29, మార్చి 2025, శనివారం

రామకుప్పం మండల పరిషత్ పై టిడిపి జెండా

 మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు కైవసం 

రెండు అధ్యక్ష స్థానాలను నిలబెట్టుకున్న వైసీపీ 

ఉపాధ్యక్ష పదవులలో వైసీపీకి ఒకటి, టిడిపికి ఒకటి 

కో ఆప్షన్ స్థానాన్ని నిలబెట్టుకున్న వైసీపీ  

 ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు. 

ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన చిత్తూరులో  ఉత్కంఠ భరితంగా, భారీ పోలీసు బందోబస్తు మధ్య గురువారం జరిగిన మండల పరిషత్ ఉప ఎన్నికలలో రామ కుప్పం మండలంలో మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యాయ పదవులను నాటకీయ పరిణామాల మధ్య వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. జిల్లాలో మూడు మండల పరిషత్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగగా ఒక స్థానాన్ని తెలుగుదేశం, పార్టీ రెండు స్థానాల్లో వైసీపీ పార్టీ కైవసం చేసుకుంది. అలాగే రెండు మండలాల్లో మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరగగా, ఎన్నిక ఒక స్థానాన్ని వైసీపీ నుంచి తెలుగుదేశం కైవసం చేసుకుంది. మరో స్థానాన్ని వైసిపి నిలబెట్టుకుంది. ఒక కో ఆప్షన్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష వైసిపి పార్టీ ఆస్థానాన్ని తిరిగి దక్కించుకుంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య, సీసీ కెమెరాల పహరాల్లో గురువారం మండల పరిషత్ ఉప ఎన్నికలు ఉత్కంఠ భరితంగా  జరిగాయి. 


రామకుప్పం మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలను గతంలో వైసీపీ పార్టీ కైవసం చేసుకుంది. అందులో ఒక ఉపాధ్యక్షుడు ఖాళీగా ఉంది. మండల పరిషత్ అధ్యక్షురాలు శాంతి కుమారి మరణంతో మండల పరిషత్ అధ్యక్ష పదవికి ఉప ఎన్నిక జరిగింది. మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, గతంలో జరిగిన మండల పరిషత్ ఎన్నికలలో  అన్నింటిని వైసీపీ పార్టీ కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు మంది ఎంపీటీసీ సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఒక ఎంపీటీసీ సభ్యురాలు మృతి చెందారు. దీంతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడానికి మరో ఎంపీటీసీ మద్దతు అవసరమైంది. ఈ మేరకు బుధవారం రాత్రి జరిగిన నాటకీయపరిణామాలలో  ఒక ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు. దీంతో సునాయాసంగా రామకుప్పం మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఉనిసిగాన పల్లి ఎంపీటీసీ సభ్యురాలు సులోచన ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా విజిలాపురం ఎంపీటీసీ సభ్యుడు జే వెంకటరామ గౌడ్ ఎన్నికయ్యారు. దీంతో వైసిపి నుండి తెలుగుదేశం పార్టీ ఆ స్థానాలను  కైవసం చేసుకున్నట్లు అయింది. సదం మండల పరిషత్ అధ్యక్షురాలుగా వైసీపీకి చెందిన పాలమంద ఎంపీటీసీ వి. మాధవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తవణంపల్లి మండల పరిషత్ అధ్యక్షుడిగా వైసిపి పార్టీ చెందిన మల్లకుంట ఎంపీటీసీ సభ్యుడు   ప్రతాప్ సుందర్ రాయల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రెండు స్థానాలను వైసిపి నిలబెట్టుకుంది. విజయపురం మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పదవికి జరిగిన ఎన్నికల్లో వైసీపీకి చెందిన కోసలనగరం ఎంపీటీసీ సభ్యురాలు పి కన్నెమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానాన్ని వైసిపి నిలబెట్టుకుంది. అలాగే పెనుమూరు మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యురాలిగా  మైనారిటీకి చెందిన వసీమ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసిపి ఈ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో ఉప ఎన్నిక పూర్తి అయ్యింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *