స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేయని మొబైల్ ఫోన్లు
ఇబ్బందిపడుతున్న ప్రజలు, డాక్యుమెంట్ రైటర్స్
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
స్టాంపులు రిజిస్ట్రేషన్ ల విభాగములు నెలరోజులుగా మొబైల్ ఫోన్లు పనిచేయడం లేదు. మొబైల్ ఫోన్లకు సంబంధించి బిల్లులను చెల్లించకపోవడంతో ఫోన్లు మూగ పోయాయి. డిపార్ట్మెంట్ ఫోన్లు పనిచేయకపోవడంతో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలు అధికారులు, సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. వారిని సంప్రదించడానికి వీలు లేకుండా ప్రజలు, రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు నానా తిప్పలు పడుతున్నారు. డిపార్ట్మెంట్ పరంగా అధికారులు, సిబ్బందికి ఉన్న వ్యక్తిగత ఫోన్ల ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటున్నా, అధికారిక ఫోన్లు పనిచేయకపోవడంతో రిజిస్ట్రేషన్ల విభాగంలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆ ప్రభావం రిజిస్ట్రేషన్ ల మీద పడుతోంది.
స్టాంపులు, రిజిస్ట్రేషన్ విభాగంలో రాష్ట్రస్థాయిలో కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్ ఉంటా.రు తర్వాత అదనపు ఇన్స్పెక్టర్ జనరల్స్ ఇద్దరు, నలుగురు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ గ్రేడ్ వన్ పోస్టులు ఏడు మంది, గ్రేడ్ టు ఎనిమిది మంది పనిచేస్తున్నారు. వీరికి సహాయకులుగా 23 మంది సీనియర్ అసిస్టెంట్లు, 25 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఐదు మంది టైపిస్టులు ప్రధాన కార్యాలయంలో పనిచేస్తుంటారు. రాష్ట్రవ్యాప్తంగా డిప్యూటీ జనరల్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్స్ 12 మంది, 35 మంది జిల్లా రిజిస్టార్లు , 90 మంది గ్రేడ్ వన్ సబ్ రిరిజిస్టార్లు, 278 మంది గ్రేటు సబ్ రిజిస్టార్లు, 500 మంది సీనియర్ అసిస్టెంట్లు, 702 మంది జూనియర్ అసిస్టెంట్లు, 34 మంది టైపిస్టులు పనిచేస్తున్నారు. డిపార్టుమెంటులో మొత్తం 1909 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి అందరికీ డిపార్ట్మెంట్ తరఫున మొబైల్ ఫోన్లను అందజేశారు. డిపార్ట్మెంట్ తరఫున అవసరమైన సమాచారాన్ని అందిపుచ్చుకోవడానికి ఈ డిపార్ట్మెంట్ ఫోన్లు ఉపకరిస్తున్నాయి. వీటికి బిల్లులు చెల్లించకపోవడంతో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో మొబైలు ఫోన్లు పనిచేయడం లేదు. దీంతో ప్రజలకు, రిజిస్ట్రేషన్ అధికారులకు సంబంధాలు తెగిపోయాయి. భూముల రిజిస్ట్రేషన్ కొరకు డాక్యుమెంట్ రైటర్లు, ఇతర వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖలో భూముల రిజిస్ట్రేషన్లు మాత్రమే కాకుండా స్టాంపుల విక్రయం, ఏపీ సొసైటీల రిజిస్ట్రేషన్, ఇండియన్ భాగస్వామ్య చట్టం కింద రిజిస్ట్రేషన్లు, హిందువుల వివాహాలు, క్రిస్టియన్ వివాహాలు, చిట్ ఫండ్స్, స్వచ్ఛంద సేవా సంస్థలు, నోటరీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఫోన్లు పనిచేయకపోవడంతో ప్రజలు, సంబంధిత వ్యక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
పో రై గంగ 1 రిజిస్ట్రేషన్ కార్యాలయం

