12, మార్చి 2025, బుధవారం

ఫర్నిచర్ చేసినోడే దోపిడీకి వ్యూహరచన

ప్రధాన నిందితుడి స్వస్థలం కర్నూలు 

హత్య కేసులో ముద్దాయి ఐపి వేసి చిత్తూరు వచ్చాడు

ఫర్నిచర్ చేస్తూ పరిస్థితిని ఆకలింపు చేసుకున్నాడు 

దోపిడీయత్నం చేసింది నంద్యాల, అనంతపురం వాసులు

ఐదుగురు చిక్కారు, ఇద్దరు పరారీ 

ధైర్యంగా దొంగలను పట్టుకున్న స్థానికులు 

ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.

చిత్తూరులో బుధవారం జరిగిన దోపిడీ యత్నంలో ఒక ఫర్నిచర్ ఫ్యాక్టరీ యజమాని కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఫర్నిచర్  ఫ్యాక్టరీ యజమాని చంద్రశేఖర్ కుటుంబాన్ని నిశితంగా పరిశీలించి ఎలాగైనా నగలు, డబ్బులను తస్కరించాలని వ్యూహరచన చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా నంద్యాల, అనంతపురం జిల్లాలకు చెందిన దొంగలు ముఠాతో సంబంధాల నెరిపి వారిని చిత్తూరుకు  రప్పించినట్లు తెలుస్తోంది.
ఉదయం ఆరు గంటల కావడంతో వారి వ్యూహం బెడిసి కొట్టింది. పోలీసులతో పాటు స్థానికులు ధైర్య,  సహసాలను ప్రదర్శించి ముగ్గురు దొంగలను పట్టుకుని చితకబాధి పోలీసులకు అప్పగించారు. ఒక దొంగ పైనుంచి దూకి పారిపోవడానికి ప్రయత్నం చేయగా అతనిని పోలీసులు పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు పోలీసుల చెబుతున్నారు. అయితే ఒక దొంగను అన్నమయ్య జిల్లా మొలకలచెరువు వద్ద పట్టుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

కర్నూలు జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యం రెడ్డికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతను ఒక హత్య కేసులో ముద్దాయిగా చంచల్గూడా జైలు వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ అందరి దగ్గర అప్పులు చేసి ఐపీ వేసి 15 సంవత్సరాల కిందట చిత్తూరుకు చేరుకున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఎస్ఎల్వి ఫర్నిచర్ ఫ్యాక్టరీ పేరుతో ఒక ఫ్యాక్టరీని నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇతనినీ తమ ఇంటికి ఫర్నిచర్ చేసి ఇవ్వడానికి పుష్ప కిడ్స్ వరల్డ్  చెందిన చంద్రశేఖర్ కోరినట్లు సమాచారం. సుబ్రహ్మణ్యం వాళ్ళ ఇంట్లో అవసరమైన ఫర్నిచర్ తయారు చేస్తూ వారి స్థితిగతులను పరిశీలించాడు. వ్యాపారం బాగా జరుగుతోందని, వాళ్ల ఇంట్లో నగదు, బంగారు భారీగా ఉందని తెలుసుకున్నాడు. మంగళవారం నాడు షాప్ యజమాని చంద్రశేఖర్ కు ఒక పెద్ద మొత్తం నగదు కూడా వచ్చినట్లు కూడా తెలుసుకున్నాడు. ముందు నుండి నేరచరిత్ర కలిగిన సుబ్రహ్మణ్యం రెడ్డి వివిధ నేరస్తులతో టచ్ లో ఉన్నాడు. నంద్యాల, అనంతపురం జిల్లాలకు చెందిన దొంగలను సంప్రదించి వారితో కలిసి చిత్తూరులో చంద్రశేఖర్ ఇంటిని దోపిడీ చేయడానికి పక్కా ప్రణాళికతో వ్యూహరచన చేశాడు. వారం రోజులుగా దోపిడి దొంగలు చిత్తూరులో గాంధీ రోడ్డులోని పుష్ప కిడ్స్ వరల్డ్ ఇంటి యజమాని చంద్రశేఖర్ దిన చర్యను గమనించారు. అతను ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు లేచి, నీళ్లు మోటార్ ఆన్ చేసి షట్టర్ తీస్తారని వారం రోజులు రెక్కి నిర్వహించి తెలుసుకున్నారు. మంగళవారం కొంత పెద్ద మొత్తం కూడా చేతికి రావడంతో బుధవారం ఉదయం దోపిడీకి ప్రయత్నం చేశారు. ప్రెస్ స్టిక్కర్ అంటించిన ఓమ్ని వ్యాన్ లో అక్కడికి చేరుకున్నారు. ఇంటి యజమాని చంద్రశేఖర్ యధావిధిగా 6 గంటలకు లేచి ఇంటి నుంచి వెలుపలికి వచ్చి తాగునీటి మోటర్ ను ఆన్ చేశారు. ఇంటికి ఉన్న మరో డోర్ ని కూడా తెరిచాడు. దీంతో దండగులు ఒక్కసారిగా లోనికి ప్రవేశించారు. నగలు, నగదును ఇవ్వాల్సిందిగా చంద్రశేఖర్ మీద దాడి చేశారు. కాల్పులు కూడా తెలిపినట్టు సమాచారం. ఈ పెరుగులాటలో చంద్రశేఖర్ తప్పిచుకుని వెలుపలికి వచ్చి షట్టర్
 మూసివేశాడు. దొంగలు లోపలే ఉన్నారు. కాల్పులు, అరుపులు, కేకలు విన్న చంద్రశేఖర్ కుమారుడు లోకేష్ కుమార్ పోలీసులకు ఇతర స్నేహితులకు సమాచారం అందజేశారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే సంతపేటకు చెందిన గణేష్ అన్న యువకుడు ఈ కలకలాన్ని గుర్తించి ఒక దొంగను పట్టుకున్నాడు. దాంతో మిగిలిన 6 మంది దొంగలు అతని మీద దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేశారు. స్వల్ప గాయాలతో తప్పించుకొని బయటపడ్డాడు. ఈలోపు పోలీసులు కూడా చేరుకున్నారు. ఈ విషయం తెలియడంతో తోటపాళ్యంలోని యువత ధైర్య సాహసాలను ప్రదర్శించి పోలీసులతో కలిసి ముగ్గురు దొంగలను పట్టుకొని చితకబాదారు. మరో దొంగ పైనుంచి దూకి పారిపోవడానికి ప్రయత్నించగా
 పోలీసులు పట్టుకున్నారు. సంఘటన స్థలం నుంచి మరో ముగ్గురు పారిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఒక దొంగను అన్నమయ్య జిల్లా మొలకలచెరువు వద్ద టెలిఫోన్ సిగ్నల్స్ ఆధారగా పట్టుకున్నట్లు తెలిసింది. విషయం తెలిగానే చిత్తూరు వన్ టౌన్ సీఐ నెట్టికంటయ్య, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఇతర పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నారు. లోపల ఉన్న దొంగలను పట్టుకోవడానికి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. తిరుమల నుంచి అక్టోబస్ దళాలు కూడా బయలుదేరి చిత్తూరు జరుపుకున్నాయి. మంగళగిరి నుంచి మరో బృందం బయలుదేరింది. మొత్తం 150 మంది పోలీసులు వరకు ఈ రిస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. దోపిడీకి ప్రయత్నం జరిగిన ఇంటిలో కింద దుకాణం ఉండగా, మొదటి అంతస్తులో షాపు యజమాని చంద్రశేఖర్, రెండవ అంతస్తులు అతని కుమారుడు లోకేష్ కుమార్ కాపురం ఉంటున్నారు. పోలీసులు నిచ్చెన సహాయంతో పైకి వెళ్లి అక్కడి నుండి కిందికి దిగి పోలీసులను నిందితులను దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ధైర్య సాహసాలతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం 7 మంది దొంగలలో సంపత్ అనే డ్రైవర్, రాజశేఖర్ అనే వారు పరారీలో ఉన్నారు. పోలీసులు అదుపులో తీసుకున్న వారిలో
 సుబ్రహ్మణ్యం ఎస్ ఎల్ వి ఫర్నిచర్స్, చిత్తూరు
ఇబ్రహీం,  నవీన్,  రామాంజనేయులు అలియాస్ నవీన్,  నెట్టికల్లు కృష్ణప్ప ఉన్నారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు ప్రత్యేక టీమ్ లు  ఏర్పాటుచేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ రిస్క్యూ ఆపరేషన్ లో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, ఏ. ఆర్ అడిషనల్ ఎస్పీ నందకిషోర్, టౌన్ డిఎస్పి సాయినాథ్, ఏఆర్ డిఎస్పి మహబూబ్ బాషా, సీఐలు నెట్టి కంటయ్య, జై రామయ్య, శ్రీనివాసులు, ఏఆర్ విభాగ ఆర్ ఐ లు, ఆక్టోపస్ బలగాలు, పోలీస్ ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ అధికారులు, ఇతర పలువురు సీఐలు పాల్గొన్నారు. వీరితోపాటు స్పెషల్ బ్రాంచ్ విఆర్ లో ఉన్న సిఐలు, ఎస్ఐలు కమ్యూనికేషన్ ఎస్టిఎఫ్ పార్టీలు పాల్గొన్నారు. ఎలాంటి ప్రాణహాని కలగకుండా నిందితులను పోలీసులు పట్టుకోవడం, దోపిడి దొంగల భారీ నుంచి ఆ కుటుంబాన్ని కాపాడడంలో పోలీసులు చకచక్యంగా వ్యవహరించారు. పోలీసులు, స్థానిక తోటపాళ్యం యువత చూపిన ధైర్య సాహసాలను చిత్తూరు పట్టణ ప్రజలు ప్రశంసిస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *