25, మార్చి 2025, మంగళవారం

నామినేటెడ్ పోస్టుల మూడో జాబితా భర్తీకి రెడీ!

ఈ నెలాఖరులోపు  పదవుల భర్తీకి సన్నాహాలు    
దేవాలయాల పాలక మండళ్లపై కసరత్తు పూర్తి 
సిద్ధమవుతున్న  మార్కెట్ యార్డ్ కమిటీల జాబితా
జిల్లాకు కీలక పదవులు వచ్చే అవకాశం  


ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.

ఈ నెలాఖరు లోపు మూడో విడుత నామినేటెడ్ పదవుల జాబితా విడుదల అయ్యో అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు ఇప్పటికే కసరత్తు పూర్తి అయినట్లు సమాచారం. జాబితా తయారికి శాసనసభ్యుల నుండి ప్రతిపాదనలు తెప్పించు కున్నారు. మిత్ర పక్షాలు అయినజనసేన, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలతో కూడా సంప్రదింపులు జరిపారు. వారి నుండి కూడా పేర్లను తీసుకున్నారు. అందరికి న్యాయం జరిగేలా జాబితా తుదిమెరుగులు దిద్దుకుంటున్నదని సమాచారం.  రాష్ట్రంలో పలు ప్రముఖ దేవాలయాల పాలక మండళ్లను భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇప్పటికే పాలకమండళ్ల నియామకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు పూర్తిస్తాయి నివేదిక చేరింది. 

మొత్తం 21 ప్రముఖ ఆలయాలకు పాలకమండళ్లను నియమించనున్నారు. దేవాలయ కమిటీ చైర్మన్ తో పాటు సభ్యులను కూడా నియమించేందుకు రంగం సిద్దమైంది.    సిద్ధమౌతున్న మార్కెట్ యార్డ్ కమిటీలు  వ్యవసాయ మార్కెట్ కమిటీలను నియమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయి కసరత్తును మొదలుపెట్టారు. ఏప్రిల్ మొదటి వారంలోగా మార్కెట్ యార్డ్ చైర్మన్ల నియామకాలను చేపట్టేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మార్కెట్ కమిటీల నియామకాలకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది. ప్రతి జిల్లా నుంచి నివేదికలు తెప్పించుకుంటున్న అధిష్టానం రిజర్వేషన్ల ఆధారంగా పదవులను భర్తీచేయనుంది. ఎస్సీ, ఎన్టీ, బీసీలతో పాటు ఓసి లకు సమ న్యాయం జరిగేలా సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. జిల్లాల వారీగా రిజర్వేషన్లకు సంబంధించిన నివేదికలు సిద్దమౌతున్నాయి. మహిళలకు కూడా అగ్రి కల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్లతో పాటు డైరెక్టర్ల పదవులు దక్కనున్నాయి. రాష్ట్రం లో 222 మార్కెట్ కమిటీలు ఉండగా వీటన్నిటికీ చైర్మన్తో పాటు 15 మంది సభ్యులను ప్రభుత్వం నియమించనుంది. 50 శాతానికి పైగా పదవులు ఎస్సీ, ఎస్టీ బీసీలకు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధమైనట్టు తెలుస్తోంది.  మూడవ జాబితాలో ఆశావాహులు భారీగానే ఉన్నారు. చిత్తూరు జిల్లా నేతలు కొందరికి  రాష్ట్రంలో కీలక పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం.  మాజీ ఎమ్మెల్యేలు సి కి బాబు, ఎ ఎస్ మనోహర్ లకు కీలక పదవులు  దక్కుతుందని అంటున్నారు. పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమరనాథ్ రెడ్డికి రాష్ట్ర స్థాయిలో కీలకమైన కార్పోరేషన్ పదవి ఇస్తారని అంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్, చిత్తూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాజూరు బాలాజీ కూడా రాష్ట్ర పదవుల రేసులో ఉన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయానికి చిత్తూరు మాజీ ఎమ్మెల్యేలు సీకే బాబు, ఏఎస్ మనోహర్ తమ వంతు కృషి చేశారు. వారు క్రియాశీలకంగా వ్యవహరించడంతో పట్టణంలో తెలుగుదేశం పార్టీకి ఊపు వచ్చింది. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు పోటీలో ఉన్న అభ్యర్థులను  అందరిని ఒక తాటి మీదికి తీసుకుని వచ్చి అభ్యర్థుల ప్రకటనకు ముందే చిత్తూరు నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా కష్టకాలంలో కాజూరు బాలాజీ చిత్తూరు పట్టణ ప్రజలకు అండగా నిలిచారు. ఆనందయ్య కరోనా మందులు వార్డు వార్డుకు సరఫరా చేశారు. చిత్తూరు పట్టణం మొత్తం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధులైన డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి, డాక్టర్ సప్తగిరి ప్రసాద్ లు పదవులు ఖాయమైనట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇక జనసేన, బిజెపి నాయకులలో ఒకరిద్దరి రాష్ట్ర పదవులు దక్క వచ్చని సమాచారం. కొత్తగా భర్తీ కానున్న పదవులలో అధికార భాషా సంఘం, సాహిత్య అకాడమీ, స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్, ప్రణాళికా సంఘం, నెడ్ క్యాప్ చైర్మన్ వంటి వాటికి తీవ్ర స్థాయిలో పోటీ ఉందని  చెబుతున్నారు. అలాగే బేవరేజెస్ కార్పొరేషన్, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆప్కాబ్, బ్యూటిఫికేషన్ గ్రీనరీ అండ్ కార్పొరేషన్, డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, షిప్ అండ్ గోట్ కార్పొరేషన్ పదవులు ఉన్నాయి. వాటితో పాటు స్కూల్ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రా కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా కీలకంగా ఉందని తెలిసింది. వీటికి తోడుగా అనేక సామాజిక వర్గాలకు సంబంధించిన కార్పొరేషన్లకు చైర్మన్ పదవులు కూడా భర్తీ చేయాల్సి ఉంది. దీంతో ఈసారి వీలైనంతవరకూ పదవులు అన్నీ భర్తీ చేసి పార్టీ కోసం కష్టపడిన వారిని  ప్రోత్సహించాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడు నెలల కాలం గడచిపోయింది. దాంతో ఆశావహులను వేచి చూసేలా ఉంచడం మంచిది కాదని భావించే ఈ పదవుల పందేరానికి తెర తీస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే  సంక్రాంతికి పదవుల పంపిణీ జరిగిపోతుందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇదిలా ఉండగా జిల్లాలోని కాణిపాకం ఆలయం, బోయకొండ గంగమ్మ ఆలయ పాలక మండళ్ల చైర్మన్, సభ్యులను నియమిస్తారని తెలిసింది. అలాగే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఇతర పదవుల కోసం నేతలు ఎదురు చూస్తున్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా మార్కెటింగ్ సొసైటీ, జిల్లా ప్రింటింగ్ ప్రెస్ లకు. జిల్లాలోని సింగల్ విండోలకు త్రిసభ్య కమిటీలు వేయడానికి కసరత్తు జరుగుతుంది. చిత్తూరు అసెంబ్లీ నియోజక వర్గానికి చెందిన   ప్రధాన కార్యదర్శి కోదండయదవ్, వై వి.రాజేశ్వరి, చెరుకూరు వసంత కుమార్, గుడిపాలకు చెందిన  బాలాజీ నాయుడు, యాదమరికి చెందిన ఆరణి బాలాజీ, జిల్లా కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్  పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పూతలపట్టుకు చెందిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుష్పరాజ్ ఇటేవల చంద్రబాబును కలసి వచ్చారు. గుడిపాలకు చెందిన పీటర్, మాజీ ఎం ఎల్ ఏ గాంధీ, పుత్తూరుకు చెందిన గ్యాస్ రవికుమార్, వెదురుకుప్పం మండలానికి చెందిన సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునిచంద్రా రెడ్డి  కూడా పదవి ఆశిస్తున్నారు. బిజెపి నుండి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి, బిసి నేత అట్లూరి శ్రీనివాసులు కూడా రేసులో ఉన్నారు. పుంగనూరు నియోజక వర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో తలబడి ఓడిపోయిన చల్లా రామచంద్రా రెడ్డికి పదవి వచ్చే అవకాశం ఉందని తెలిసింది. జి. డి నెల్లూరు నియోజక వర్గం నుంచి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు, తెలుగు మహిళ అధ్యక్షురాలు అరుణలకు పదవీ యోగం ఉందంటున్నారు. నగరి నియోజకవర్గంలో మాధవ నాయుడు, పోతుగుంట విజయబాబు పదవులను ఆశిస్తున్నారు. అయితే అక్కడ సిద్ధార్థ విద్యాసంస్థలు అధిపతి అశోక్ రాజుకు బిజెపి కోటాలో పదవి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. నాయకులు అందరు చైర్మన్ పోస్టులపై దృష్టిని పెట్టారు. ఎం ఎల్ ఏ, ఎంపి సిఫారసు లేఖలను జత చేశారు. తనకు పదవి తప్పదని అందరు నాయకులు ధిమాతో ఉన్నారు. మూడవ జాబితాలో చంద్రబాబు ఎవరికీ పదవీయోగం కలుగ చేస్తారో వేచి చూడాలి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *