17, మార్చి 2025, సోమవారం

నిరుపేద వడ్డెర యువకుడిపై పగ పట్టిన పాములు

ఇప్పటికి 103 సార్లు పాము కాటుకు గురైన సుబ్రహ్మణ్యం 

మృత్యుంజయుడు ఈ సుబ్రహ్మణ్యుడు 

చివరిసారిగా ఈనెల 15న పాముకాటు 

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుబ్రహ్మణ్యం 

ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు



చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

పాములు పగబడతాయి అంటే ఆధునిక సాంకేతిక యుగంలో శాస్త్రవేత్తలు అంగీకరించారు. మనిషి రాకెట్లు మీద చంద్రమండలం మీద దిగుతున్న ఈ యుగములో అంటూ ప్రారంభిస్తారు. పాములకు జ్ఞాపకశక్తి ఉండదని, అటువంటి పాములు ఎలా పగబడతాయని ప్రశ్నిస్తారు. అయితే "పాము పగ" ఈ ఇతివృత్తం సినిమాలకు, సీరియల్ లకు బాగా పనికి వస్తుంది. ఈ ఇదివృతంతో వచ్చిన సినిమాలు చాలా వరకు  మహిళల ఆదరణకు నోసుకొన్నాయి. దీంతో భవిష్యత్తులో కూడా మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంది. "పాము పగ" ఇతివృత్తం సినిమాలు, సీరియల్ వరకే పరిమితమైతే, మనకు ఇబ్బంది లేదు. నిత్యజీవితంలో ఎదురైతే ఎలా ఉంటుందో చిత్తూరు జిల్లాలో ఒక వ్యక్తి అనుభవిస్తున్నాడు. అతనిని ఇప్పటికి 103  సార్లు పాములు కాటు వేశాయి. మీరు చవింది కరెక్టే. అక్షరాల నూట మూడు సార్లు కాటువేశాయి. ఇప్పటికి బతికి ఉన్నాడు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.

చిత్తూరు జిల్లా, బైరెడ్డిపల్లి మండలం, చల్లారగుంట పంచాయతీ, కుమ్మరగుంటకు చెందిన 47 సంవత్సరాల వడ్డెర యువకుడు సుబ్రహ్మణ్యం మీద పాములు పగ పట్టాయి.  10 సంవత్సరాల కాలంలో ఏకంగా 103 సార్లు అతనిని పాములు కాటు వేశయి.  కాటు వేసింది ఒకే పాము కాదు. వివిధ వయసులలో ఉన్న నాగుపాములు. ఒకే వ్యక్తిని నాగుపాములు వందకు పైగా సార్లు కాటు వేయడం, ఇప్పటికి ఆ వ్యక్తి జీవించి ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ విషయం నమ్మశక్యం కాకపోయినా యదార్థం. ఈనెల 15వ తేదీన చివరిసారిగా పాము ఆ యువకుడిని పాదానికి పైన కాటు వేసింది. ప్రస్తుతం పెద్దపంజాణి మండలం జేఎంజే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈసారి పాము కాటు బలంగానే పడింది. విషం తలకు ఎక్కింది. దీంతో ఆసుపత్రి డాక్టర్లు అతనిని ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఇప్పటికీ ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. డాక్టర్లు ప్రాణానికి ప్రమాదం లేదని చెబుతున్నారు. కుమ్మరకుంటకు చెందిన కే. సుబ్రహ్మణ్యం (47) గత పది సంవత్సరాల కిందట తొలిసారిగా పాము కాటుకు గురయ్యారు. ఆ రోజు నుంచి ఈరోజుటి వరకు 103 సార్లు పాములు అతనిని కాటు వేశాయి. పాము కాటు వేయగానే, విషం ఎక్కకుండా కట్టుకట్టుకోవడం, ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేసుకోవడం అతనికి పరిపాటిగా మారింది. పాముకాటుకు  చికిత్స కోసం ఉన్న మూడు ఎకరాల పొలాన్ని  అమ్ముకున్నాడు. ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు. పూరి గుడిసెలో, గ్రామం చివర  కాపురం ఉంటున్నాడు. అతనికి ఒక కుమార్తె, ఒక కుమారుడు. తేజ, సంజననే వారిద్దరు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఈ కుటుంబానికి ఆ సామాజిక వర్గం నుంచి కానీ, బంధు వర్గం నుంచి గాని ఎటువంటి ఆర్థిక సహాయం అందడం లేదు.  భార్య శారదమ్మ తో కలిసి కూలి నాలి  చేసుకుంటున్నాడు. ప్రస్తుతం  కోళ్ల ఫారంలో ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నాడు. ఆ కుటుంబం మూడు పూటలా తిని చాలా కాలమైంది. అరాకొర పస్తులతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. గత పది సంవత్సరాలుగా పాములు కాటు వేస్తూనే ఉన్నాయి. నెలకు, రెండు నెలలకు ఒకసారి పాము కాటుకు గురవుతూనే ఉన్నాడు.  ప్రతిసారి కట్టు కట్టుకోవడం ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందడం అతనిని అలవాటుగా  మారింది. ప్రాణాలు అరచేతిలో  పెట్టుకుని బ్రతుకు జీవుడా అంటూ కాలం వెళ్ళబోస్తున్నాడు. మృత్యువు  ఎప్పుడు పాము రూపంలో వస్తుందో  తెలియని పరిస్థితి. అయినా గుండె దిటవు చేసుకుని కూలి నాలి చేసుకుంటూ బతుకు బండిని లాగిస్తున్నారు. సుబ్రహ్మణ్యం భార్య శారదమ్మ ఉదయం రాత్రి వరకు  అతనికి తోడుగా ఉండాల్సిందే. అతను ఒంటరిగా ఉంటే పాములు ఎక్కడ నుంచి వస్తాయో తెలియదు, వచ్చి కాటేసి వెళ్ళిపోతాయి. దీంతో 24 గంటలు శారదమ్మ తన మగడు సుబ్రహ్మణ్యం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. అయినా ఏదో ఒక సందులో పాములు రావడం కాటు వేయడం పరిపాటిగా మారింది. ఆ గ్రామంలో 70 ఇళ్ళు ఉన్నాయి. గ్రామంలో సుమారు 400 మంది జీవిస్తున్నారు. అయినా 400 మందిలో పాములు వెతుక్కుంటూ వచ్చి సుబ్రహ్మణ్యం ఎందుకు కాటేస్తున్నాయో అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. మామూలుగా పాముకు  ముంగిసకు వైరమంటారు. ముంగిస, పాముఎదురుపడితే,  తీవ్ర స్థాయిలో కొట్లాడుకుంటాయి. ఎవరో ఒకరు మృతి చెందాల్సిందే. అలా  పాములకు సుబ్రహ్మణ్యం లో ముంగిస ముఖం ఏమైనా కనిపిస్తుందో తెలియదు. మరి కొందరు గజ జన్మలో పాములను కొట్టినా, చంపినా, హింసించినా, అవి పగపడతాయని, మరుజన్మలో కూడా పగ తీర్చుకుంటాయని అంటారు. సుబ్రహ్మణ్యం ఏ జన్మలో ఏ పాపం చేశాడో తెలియదు. ప్రస్తుతం పాములు సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని వెంటాడుతున్నాయి. ఇద్దరు పిల్లల కళ్ళు కూడా పాము కళ్ళు లాగే ఉంటాయి. సుబ్రహ్మణ్యం  తన కుటుంబంతో పాటు తన తల్లిని కూడా పోషించాలి. ముసలి తల్లికి వేరే ఆధారంలేదు. ఇప్పటివరకు ఆ కుటుంబంలో ఇలాంటి సంఘటనలు జరగలేదని చెబుతుంటారు. పాములు పగబట్టి సుబ్రహ్మణ్యం మాత్రమే ఎందుకు కాటు వేస్తున్నాయో పరిశోధకులు తెల్చాల్చి ఉంది. పెద్దపంజాణిలోని జెఎంసి ఆసుపత్రి క్రిస్టియన్లు నడుపుతున్నారు. చికిత్స కూడా ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నారు. పాము కాటు వేసిన చోట ఒక రకమైన రాళ్లను ఉంచి ఆసుపత్రి వైద్యులు కట్టు కడుతారు. ఆ రాళ్లు మనుషిలోని విషయాన్ని గ్రహిస్తాయి. మనిషిని ప్రాణాపాయం నుండి రక్షిస్తాయి. మీరు పేదలు కావడంతో చికిత్స ఖర్చు కూడా తక్కువ. దీంతో పాముకాటుకు గురైన సుబ్రహ్మణ్యం ప్రతిసారి పెద్దపంజాణి మండలంలోని జే ఎం జి  ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నాడు.

నిరుపేద వడ్డెర కులానికి చెందిన సుబ్రహ్మణ్యం రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు. వారు ఉండడానికి ఇల్లును నిర్మించి ఇవ్వాలని, జీవన ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. అతనిని పాములు అన్నిసార్లు ఎందుకు కాటు వేస్తున్నాయో పరిశోధించి, అతనికి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. అతనిని పాముల బారి నుండి కాపాడి పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని మనవి చేస్తున్నారు. 




అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *