చిత్తూరులో ముసుకు దొంగల హల్ చల్
నాటు తుపాకులతో దొంగల కాల్పులు
దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించిన స్థానికుడిపై దాడి
సుమారు నాలుగు గంటల పాటు పోలీసుల రెస్క్యూ ఆపరేషన్
ధన, ప్రాణనష్టం లేకుండా దొంగలను పట్టుకున్న పోలీసులు
పోలీసుల అదుపులో ఐదుగురు దొంగలు
పరారీలో ఒక దొంగ
రెస్క్యూ ఆపరేషన్ దగ్గరుండి ప్రవేశించిన జిల్లా ఎస్పీ
చిత్తూరుకు ఆక్టోపస్ దళాల రాక
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
చిత్తూరులో బుధవారం ఉదయం ముసుగు దొంగలు హల్చల్ చేశారు. చిత్తూరు గాంధీ రోడ్డులోని పుష్పాకీట్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంటిలో దోపిడీకి ప్రయత్నం చేశారు. దొంగల ఉదయం ఆరు గంటల ప్రాంతంలో దోపిడీకి ప్రయత్నించడంతో స్థానికులు కూడా అప్రమత్తమయ్యారు. షాపు యజమాని కుమారుడు లోకేష్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాంధీ రోడ్డును అదుపులోకి తీసుకొని నాలుగు గంటల పాటు రెస్కు ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్లో ఎటువంటి ధన, ప్రాణ నష్టం లేకుండా దొంగలను పట్టుకున్నారు. ఇంటి యజమాని, కుటుంబ సభ్యులను రక్షించారు. మొత్త వ్యవహారాన్ని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు దగ్గరుండి పర్యవేక్షించారు. చిత్తూరులో ముసుగు దొంగల స్వైర విహారం కలకలం లేపింది. ముసుగు దొంగల వార్తతో చిత్తూరు పట్టణం ఉలిక్కిపడింది. పోలీసుల ఆపరేషన్ చూడ్డానికి భారీగా ప్రజలు గాంధీ రోడ్ లో గుమికూడారు.
చిత్తూరు కాణిపాకం రోడ్డులోని గాంధీ రోడ్డులో బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ముసుగు దొంగలు పుష్ప కిడ్స్ వర్డ్ యజమాని ఇంట్లో దోపిడీకి ప్రయత్నం చేశారు. ప్రెస్ స్టిక్కర్ అంటించుకుని, మినీ వ్యాన్ లో వచ్చిన దొంగలు ఆ ఇంటిలోకి చొరబడి దోపిడీ చేయడానికి ప్రయత్నం చేశారు. తెల్లవారుజాము కావడంతో సమీపంలో టీ తాగుతున్న సంతపేట ఇందిరానగర్ కి చెందిన ఉమాపతి అనే అతను ధైర్యం చేసి పైకి ఎక్కి ఒక దొంగను పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో మిగిలిన 5 మంది ఉమాపతినీ చుట్టూ ముట్టి కత్తులతో, తుపాకులతో బెదిరించి గాయపరిచారు. వారి నుంచి తప్పించుకొని ఉమాపతి కిందికి చేరుకున్నాడు. దొంగలు చంద్రశేఖర్ ను చుట్టుముట్టి బంగారు నగలు, నగదు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాల్పులు కూడా జరిపారు. చంద్రశేఖర్ దొంగలను షాపు లోపల పెట్టి తప్పించుకుని వెలుపలికి వచ్చి బయట చట్టర్ వేశాడు. పైన ఉన్న ఇంటి యజమాని చంద్రశేఖర్ కొడుకు లోకేష్ పోలీసులకు సమాచారం అందజేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలం చేరుకున్నారు. ఇంటిలోకి ప్రవేశించి దొంగలను అదుపు చేయడానికి తీసుకోవడానికి ప్రయత్నాలను ప్రారంభించారు. దొంగల దగ్గర తుపాకులు ఉండడం అప్పటికే రెండు రౌండ్లు కాల్పులు కలపడంతో పోలీసులు రెస్కు ఆపరేషన్ ప్రారంభించారు. జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు అక్కడికి చేరుకొని వ్యూహం ప్రకారం దొంగలు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఒక దొంగ మిద్దె పైనుంచి దూకి పారిపోవడానికి ప్రయత్నం చేయగా అతనిని అదుపులోకి, తీసుకొని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నలుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కండ్లుగప్పి ఇద్దరు దొంగలు పారిపోయారు. మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఒక దొంగను అన్నమయ్య జిల్లా మొలకల చెరువు దగ్గర అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు పట్టణంలో దొంగలు తుపాకులతో హల్చల్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. వెంటనే తిరుపతి నుంచి ఒక అక్టోపస్ దళాన్ని చిత్తూరుకు పంపారు. మంగళగిరి నుంచి కూడా మరో దళం కూడా ప్రయాణమైంది. చిత్తూరులోని సాయిధ దళాలు ఆ ఇంటిని, గాంధీ రోడ్డును సెట్టు ముట్టాయి. సుమారు 150 మంది పోలీసులు ఈ రేస్కు ఆపరేషన్ లో పాల్గొన్నారు. గాంధీ రోడ్డును బ్లాక్ చేసి పోలీసుల రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందజేశారు. వారి సలహాలు, సూచనలు పాటిస్తూనే ఇంటి యజమానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, దొంగలను అదుపులోకి తీసుకోవడానికి వ్యూహరచన చేశారు. ఒక దశలో పొగ బాంబులను కూడా పోలీసులు తెప్పించారు. వాటిని లోపలికి విసిరి దొంగలు స్పృహ తప్పితే వారిని అదుపులోకి తీసుకోవచ్చని భావించారు. అయితే ఆ అవసరం లేకుండానే నిందితులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు దొంగలను విచారిస్తున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు పుష్పా కిడ్స్ లో పనిచేసే ఒక ఉద్యోగి ఇందుకు వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. సుబ్రహ్మణ్యం రెడ్డి అనే అతను గతంలో వ్యాపారం చేసి నష్టపోయాడు. అప్పుల పాలయ్యాడు. అతను పుష్ప కీట్స్ వరల్డ్ లో ఉద్యోగిగా చేరాడు. అతని విచారణలో చంద్రశేఖర్ దగ్గర భారీగా నగదు, బంగారం ఉన్నట్లు గుర్తించాడు. ఆ నగదును ఎలాగైనా కాజేసి తన అప్పులను తీర్చుకోవాలని వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. ఇందుకుగాను పలువురు దొంగల ముఠాలతో మంతనాలు జరిపినట్లు సమాచారం. చివరకు తమిళనాడుకు చెందిన ఈ ముఠాను సంప్రదించి పథకం ప్రకారం చంద్రశేఖర్ ఇంటిని దోపిడీ చేయడానికి ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. దొంగలు
గత వారం రోజులుగా చంద్రశేఖర్ ఇంటిని రెక్కి నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ఇంటి యజమాని చంద్రశేఖర్ రోడ్డు పక్కన ఉన్న షట్టర్ని ఓపెన్ చేస్తారు. అలాగే వెంటనే ఇంటి వెనుకవైపున షట్టర్ని కూడా ఓపెన్ చేసి మోటార్ ఆన్ చేస్తారు. దొంగలు ఈ విషయాన్ని గుర్తించారు. నేపథ్యంలో మారుతి ఓమ్ని వ్యాన్ లో 6 మంది దొంగలు ఉదయం షట్టర్ తీసిన వెంటనే ఇంటి లోపల చొరబడ్డారు. ఏంటి మొదటి ఫ్లోర్లో షాపింగ్ వస్తువులు ఉండగా రెండవ అంతస్తులో యజమానిచంద్రశేఖరు, అతని భార్య శాంతమ్మ అతని అత్తగారు ఉన్నారు.
మూడవ అంతస్తులో చంద్రశేఖర్ కుమారుడు లోకేష్ కుమార్ కుటుంబ సభ్యులు ఉన్నారు.
దొంగలు మారునాయుధాలతో బెదిరించి బంగారు నగలు నగదు ఇవ్వాలంటూ బెదిరించారు. ఈ ఘర్షణలో చంద్రశేఖర్ పైన తన పిల్లతో కాలుపులు జరపగా స్వల్ప రక్తదాయమైంది. తండ్రి అరుపులు కేకలకు పై అంతస్తులో ఉన్న కొడుకు లోకేష్ కుమార్ తన ఫోన్ ద్వారా స్నేహితులకు, ఇతర వాట్సాప్ లోకి ఇంట్లో దొంగలు పడ్డారని సమాచారం ఇచ్చాడు. దీంతో అడ్వకేట్ కన్నా అనే వ్యక్తి తొలుత టూ టౌన్స్ నెట్టికంటయ్యకి సమాచారం ఇచ్చారు. సిఐ వెంటనే ఎస్పీకి సమావేశం ఇవ్వడంతో ఎస్పీ మణికంఠ చంద్రులు ప్రత్యేక పోలీసు బలగలతో చేరుకుని ఆపరేషన్ నిర్వహించారు. పోలీసులు ఐదు మంది దొంగలను పట్టుకున్నారు. మరో దొంగ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. పోలీసులు సకాలంలో స్పందించి, సరైన విధంగా వ్యూహరచన చేసి దొంగలను పట్టుకున్నందుకు జిల్లా ప్రజలు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అభినందిస్తున్నారు.

