1, మార్చి 2025, శనివారం

ప్రభుత్వ విభాగాల స్టాళ్లను పరిశీలించి ఆస్తులను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి



    జీడి నెల్లూరు, మార్చి 1, (ఆంధ్రప్రభ)
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో వివిధ ప్రభుత్వ శాఖలచే ఏర్పాటు చేసిన స్టాల్స్ రాష్ట్ర ముఖ్య మంత్రి  నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఆయా శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరించారు. అలాగే ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ఆస్తులను ముఖ్యమంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

 ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్ధి పనుల నిర్మాణంలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.30.50 కోట్లతో పనులకు  రాష్ట్ర ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. జిల్లా నీటి యజమాన సంస్థ వారిచే హార్టికల్చర్ ప్లాంటేషన్ ఫారం పాండ్, స్త్రీ నిధి జీవనోపాధి రుణాలు, లక్ పతి దిది ( లక్షాధికారి), ఉన్నతి (ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్) వడ్డీ లేని రుణం, బ్యాంకు లింకేజీ- లబ్ధిదారు, బహుళ వ్యాపారవేత్త, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాలను, జిల్లా గృహ నిర్మాణ శాఖ ఇండ్ల పురోగతికి సంబంధించి వివరాలను ప్రదర్శించారు. వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక, పట్టు పరిశ్రమల శాఖలు... పశువర్ధక శాఖ వారిచే పశుసంతతి పరిశీలన పథకం-రాష్ట్రీయ గోకుల్ మిషన్, వ్యవసాయ శాఖ చిత్తూరు వారిచే వ్యవసాయంలో డ్రోన్ ల వినియోగం, వ్యవసాయంలో డ్రోనుల ఎకనామిక్స్, అధిక ప్రోటీన్ విలువలు గల వరి రకాలు, స్కిల్ ఆఫ్ డిజిటల్ శిక్షణ కార్యక్రమంలను వివరించారు. ఉద్యానవన శాఖ వారిచే మట్టి అవసరం లేకుండా కేవలం పోషకాలు కలిపిన నీటితో రక్షణ, వాతావరణ పరిస్థితి పంటల సాగు చేయడం, మామిడి ప్రత్యామ్నాయ పంటలు మామిడి సమగ్ర సస్య సంరక్షణ గురించి వివరించారు. పట్టు పరిశ్రమ శాఖ వారిచే పట్టు సాగులో సిరి సంపదలు మీ సొంతం, పట్టు పరిశ్రమల శాఖ ద్వారా మల్బరీ రైతులకు ఇవ్వబడుతున్న ఆర్థిక ప్రోత్సాహకాలు గురించి వివరించారు.
పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మరియు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జిల్లాలో ఏర్పాటు చేసిన రోడ్ల మరమ్మత్తు కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు  ప్రదర్శించారు. డిఆర్డిఏ వారి చే తెల్ల జిల్లేడుతో చేసిన బొమ్మలను, టెర్రికోట టాయ్స్, వ్యవసాయ శాఖ వారిచే చెరుకులో విలువ జోడింపు, మామిడి పంటకూర అంతర యజమాన్యం, ప్యాక్ హౌసులు/ కలెక్షన్ సెంటర్లు, పండు కవర్లు, మామిడి, మామిడి- కొమ్మల కత్తిరింపులు, పునరుద్ధరణ, మామిడి ఎగు మతులు, పశుగణాభివృద్ధి సంస్థ వారిచే పశుసంతతి పరిశీలన పథకం- రాష్ట్రీయ గోకుల్ మిషన్ గురించి ముఖ్యమంత్రికి వివరించారు. పీఎం విశ్వకర్మ యోజన జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా చేపట్టిన కార్యక్రమాల వివరాలను వివరించారు. కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ ద్వారా ముఖ్యమంత్రి ఫోటోను సిద్ధం చేసిన జీడి నెల్లూరు మండలం మారేడుపల్లికి చెందిన అమృతను ముఖ్యమంత్రి అభినందించారు. 
పాపులేషన్ మేనేజ్మెంట్ & హెచ్ ఆర్ డి స్టాల్ నందు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు సంక్షేమ శాఖ ద్వారా 20 మంది వికలాంగులకు 20 ల్యాప్ టాప్ లు, రూ.1.45 లక్షలు విలువగల 2 స్కూటర్లు పంపిణీ చేసారు. ప్రతి నెల మూడవ శనివారం స్వచ్చ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం, ఒక అడుగు ముందు స్వచ్ఛత వైపు అనే అంశం, ఎన్.సి.డి - ఐ . సి.ఎం.ఆర్ ప్రాజక్ట్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ వారు క్రీడా సదుపాయాలు గురించి ముఖ్యమంత్రికి వివరించారు. పాపులేషన్ ఎం.జి.ఎం.టి అండ్ హెచ్ ఆర్ డి స్టాల్ నందు సమగ్ర శిక్ష అభియాన్, విద్యాశాఖ వారిచే జ్ఞాన జ్యోతి, మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల ప్రీ ప్రైమరీ పిల్లల సమగ్రాభివృద్ధి కోసం 2,385 అంగన్వాడి టీచర్లకు ఉత్తమ శిక్షణ ఇవ్వడం జరిగిందని,
జ్ఞాన ప్రకాష్  ఆ రెండు సంవత్సరాల లోపు (1, 2 తరగతులు) విద్యార్థుల సమగ్రాభివృద్ధి కోసం 1,473 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. టీచింగ్ అట్ రైట్ లెవెల్ లో 3, 4, 5 తరగతుల విద్యార్థుల స్థాయికి తగ్గ ఉత్తమ బోధన కోసం 3,309 మంది ఉపాధ్యాయులుకు ఉత్తమ శిక్షణ ఇవ్వడం జరిగిందని, తల్లికి వందనం, మెగా డీఎస్సీ, వయోజన విద్య ద్వారా ఉల్లాస్ కార్యక్రమం గురించి ముఖ్యమంత్రికి వివరించారు. వాటర్ సెక్యూరిటీ స్టాల్స్ నందు ఉద్యానవన శాఖ, గ్రౌండ్ వాటర్ మరియు వాటర్ ఆడిట్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసిన డ్రిప్పు పద్ధతికి స్వయం చాలక సాగు విధానం అనుసంధానించడం, గండికోట మరియు కండలేరు ద్వారా పూర్వ చిత్తూరు జిల్లాకు సమగ్ర రక్షణ నీటి సరఫరా పథకం, నీటి పరవాహక ప్రాంతం పరిరక్షణ పద్ధతులలో భూసార పరిరక్షణ, భూగర్భ జలాల పరిరక్షణ, రీఛార్జ్ గుంట/ కందకము ల గురించి వివరించారు. స్వచ్ఛ ఆంధ్ర స్టాల్ నందు పంచాయతీరాజ్ శాఖ వారిచే ఏర్పాటు చేసిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రము, వర్మీ కంపోస్ట్ విక్రయ కేంద్రం,వర్మీ కంపోస్ట్ ఎరువు వాడకం వల్ల లాభాలు గురించి వివరించారు.
కాస్ట్ ఆప్ట్ మేజషన్ - ఎమర్జెన్సీ అండ్ ఫ్యూయల్ స్థల నందు ప్రధానమంత్రి సూర్య యోజన పథకం ద్వారా గ్రిడ్జ్ కనెక్టెడ్ సోలార్ రూఫ్ టాప్ నెట్ మీటర్ ఇన్ సిస్టం సోలార్ ఉచిత విద్యుత్ పథకాలు క్రింద జగజీవన్ జ్యోతి పథకం, గోల్డ్  స్మిత్ / హ్యాండ్ లూమ్స్ పథకాల గురించి వివరించారు. అనంతరం ఉద్యానవన శాఖ ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి సాగు పథకం కింద రూ.4 కోట్ల 20 లక్షలు జీడి నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి 704 మంది లబ్ధిదారులకు 567 హెక్టార్లకు సంబంధించిన బిందు తుంపర్ల సేద్యం పరికరాలను ముఖ్యమంత్రి  చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.  ప్రభుత్వ విప్ మరియు జీడి నెల్లూరు శాసనసభ్యులు డా .వి.ఎం.థామస్ వారి నిధులతో  8 ఆటోలను  (ఒక్కొక్కటిరూ.3.50 లక్షలు) లబ్ధిదారులకు ముఖ్య మంత్రి  గారి చేతులు మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డి,
 చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *