రాయలసీమలో మామిడి క్లస్టర్ ఏర్పాటు
మామిడి రైతులకు శుభవార్త
వసాయ బడ్జెట్ లో మంత్రి అచ్చం నాయుడు వెల్లడి
మూడు జిల్లాల మామిడి రైతులకు మహర్దశ
మామిడిని నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీలు
కొనుగోలు, ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు
మామిడి ప్యాకింగ్, పల్పింగ్ మార్కెట్ కల్పన
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
మామిడి క్లస్టర్ ఏర్పాటుతో రైతులకు ఎంతో మేలు చేకూరనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మామిడి నర్సరీలను ఏర్పాటు చేయనున్నారు. మామిడి కాయలు, పండ్లు ఎగుమతి చేసేందుకు ట్రాన్స్‌పోర్టు వాహనాలను సిద్ధం చేస్తారు. మార్కెటింగ్ సర్వీ స్‌ను కల్పించనున్నారు. మామిడిని నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీలు నిర్మించనున్నారు. కొనుగోలు, ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. మామిడి ప్యాకింగ్, పల్పింగ్ మార్కెట్‌ను కల్పిస్తారు. తోటల
ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో కలిపి ఎగుమతికి తగ్గ నాణ్యమైన మామిడిని ఉత్పత్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నాయి.చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలను మ్యాంగో క్లస్టర్లుగా అభివృద్ధితో పాటు మొక్క నాటిన నాటి నుంచి కాయ అయ్యే వరకు రైతులకు సదుపాయాలు కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.99 లక్షల హక్టార్లలో మామిడి తోటలుంటే.. చిత్తూరు జిల్లాలో 1.50 లక్షల ఎకరాలలో మామిడి తోటలు విస్తరించి ఉండగా, ఉమ్మడి జిల్లాలో 2.70 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న మామిడి తోటల నేపద్యంలో మామిడికాయలను పల్ప్ చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 47 మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇవి 2023లో 8 లక్షలు మెట్రిక్ టన్నుల మామిడికాయలను కొనుగోలు చేసి తద్వారా నాలుగు లక్షల టన్నుల పల్పును ఉత్పత్తి చేశాయి. 2024 సంవత్సరంలో మామిడి పంట గణనీయంగా తగ్గింది. దీంతో నాలుగు లక్షల మామిడి కాయలను క్రస్సింగ్ చేసి రెండు లక్షల టన్నుల పల్పును ఉత్పత్తి చేశాయి. చిత్తూరు జిల్లాలో ఉత్పత్తి అయిన పల్ప్ ఎక్కువగా యూరప్ దేశాలకు ఎగుమతి అవుతుంది. అలాగే కొంత గల్ఫ్ దేశాలకు, సింగపూర్ కూడా ఏగుమతి అవుతుంది. జిల్లాలో తయారయ్యే మామిడి పల్పు మనదేశంలో వినియోగం చాలా తక్కువ. మన దేశంలోని స్లైడ్, మాజా, రియల్, ఫ్రూటీ, గల్లా వంటి జ్యూస్ లు తయారు చేస్తారు. వీటిల్లో వాడకం అంత ఆశాజనకంగా లేదు. ఇదివరకు ఈ జ్యూస్ లో మామిడి పల్పును18 నుంచి 20 శాతం ఉపయోగించేవారు. ప్రస్తుతం సగానికి పైగా మ్యాంగో బల్బును తగ్గించారు. ప్రస్తుతం పది నుంచి 12 శాతం మాత్రమే ఉపయోగించి ఈ జ్యూస్ లను తయారు చేస్తున్నారు. గత సంవత్సరంగా జరుగుతున్న అమాస్ ఇజ్రాయిల్ యుద్ధాలు, రష్యా ఉక్రెయిన్ యుద్దాల కారణంగా ఇతర దేశాలకు చిత్తూరు నుండి మ్యాంగో పల్ప్ ఎగుమతి ఆగిపోయింది. గత రెండు సంవత్సరాలలో తయారైన మామిడి పళ్ళు ఇంకా 2.85 లక్షల టన్నుల నిల్వ ఉంది. ఇంకా చాలా మంది రైతులకు ఫాక్టరీలు బిల్లులు కూడా చెల్లించలేదు. జిల్లాకు మ్యాంగో క్లస్టర్ మంజూరు అయితే, ఇలాంటి కష్టాలు ఉండవు. మామిడికాయలును, మామిడి గుజ్జును ఎగుమతి చేసుకోవడానికి అవకాశాలు మెరుగవుతాయి. ఎప్పటికప్పుడు విదేశాలకు ఎగుమతి చేసుకొని లాభాలు కొన్ని అవకాశం కలుగుతుంది. సాధారణంగా మామిడి ఎకరానికి 8 టన్నుల వరకు ఉత్పత్తి వస్తుంది. సీజన్‌ను బట్టి ఒక్కోసారి అటుఇటుగా అవుతుంది. అయితే చిత్తూరు మామిడికి దేశంలో మంచి మార్కెటే ఉన్నప్పటికీ విదేశాలకు ఎగుమతి చేయలేకపోవడంతో రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఈ నేపథ్యంలోనే విదేశాలకు ఎగుమతి చేయాలంటే అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. ఎలాంటి రసాయనాలు వాడకూడదు. ఎక్స్‌పోర్ట్ నాణ్యతను పెంచేందుకు ప్రాసెసింగ్ యూనిట్లను నిర్మిస్తారు. అకాల వర్షాల వల్ల నష్టాలు జరగకుండా అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. రైతులకు అత్యంత నాణ్యమైన మామిడి విత్తనాలను అందజేస్తారు. ఈ క్లస్టర్‌ను మూడు విభాగాలుగా నిర్వహించనున్నారు. పంటకు ముందు, కాయ తెంపిన తర్వాత, మార్కెటింగ్.. ఇలా నిర్వహిస్తారు. చిత్తూరు మామిడిని ఒక బ్రాండ్‌గా మార్చి, దేశ విదేశాల్లో మార్కెటింగ్ చేసేలా క్లస్టర్ రైతులకు తోడ్పాటును అందించనుంది. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రుచులు ప్రపంచ వ్యాప్తంగా పరిచయం అవుతాయి.

