8, మార్చి 2025, శనివారం

ఆ పోలీస్ స్టేషన్ అంటే ఎస్ ఐ లకు హడల్


9 నెలలుగా ఎస్ ఐ పోస్టు ఖాళీ

ఎవరూ ఎస్ ఐ గా రావడానికి ఇష్టపడని వైనం

పోలీస్ స్టేషన్ ను శాసించేది స్థానిక నాయకులే 

వాళ్లే మామూళ్ళు వసూలు చేసి పోలీసులకు ఇస్తారు.

అనుమానాస్థితిలో  ఒక ఎస్ఐ మృతి 

నలుగురు ఎస్ఐల మీద క్రమశిక్షణ చర్యలు

ఆ పోలీస్ స్టేషన్కు సొంత భవనం కూడా లేదు 

భవనం కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసిన నాయకులు

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరు పోలీస్సా స్టేషన్ధా కు గత తొమ్మిది నెలలుగా ఎస్ర ఐ లేరు. ఆ పోలీస్ స్టేషన్ కు ఎస్ ఐ గా రావడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. దీంతో పెనుమూరు పోలీస్ స్టేషన్ ఎస్ ఐ పోస్ట్ భర్తీ చేయడం పోలీస్ అధికారులకు తలనొప్పిగా మారింది.  ఇటేవల కూటమి నాయకులు ఎస్ ఐ పోస్ట్ భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మీద, జిల్లా అధికారుల మీమిద వత్తిడి తెస్తున్నారు. మూడు రోజుల కిందట తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ బి సుధాకర్ రెడ్డి ఈ విషయమై రాష్ట్ర హోంశాఖ మంత్రి అనితకు లేఖ రాశారు. వెంటనే ఎస్సై పోస్టులను భర్తీ చేయాల్సిందిగా కోరారు. రెండు రోజుల కిందట జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ మాల కార్పొరేషన్ సభ్యుడు పూర్ణ యోగేందర్ జిల్లా ఎస్పీ మణికంఠ చందోలను కలిశారు. పెనుమూరు పోలీస్ స్టేషన్ కు ఎస్ఐ ని పోస్ట్ చేయాల్సిందిగా కోరారు.


సాధారణంగా పోలీసులు అంటే ప్రజలు భయపడుతుంటారు. అయితే పెనుమూరు పోలీస్ స్టేషన్ అంటే ఎస్సైలు భయపడుతున్నారు.  అక్కడికి డ్యూటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లేకుండా ఖాళీగానే ఉంది. ఎస్ఐ లేకపోవడంతో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో అరాచక కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు, అక్రమ రవాణా మితిమీరిపోతున్నాయి. ఆ పోలీస్ స్టేషన్ కు ఎవరు ఎస్ఐ గా వచ్చిన స్థానిక రాజకీయ నాయకులు చెప్పినట్లు చేయాల్సిందే. కేసులు నమోదు చేయడం ఎస్సై చేతిలో ఉండదు. మామూళ్లు కూడా స్థానిక నాయకులే వసూలు చేసి, పోలీసులకు ఇస్తారు. ఎవరైనా ఎస్ఐ చెప్పిన మాట వినకపోతే వాళ్ల మీద వర్గాలకు అతీతంగా పుంఖాను పుంఖాలుగా ఫిర్యాదులు చేస్తారు. తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఆ ఎస్సైని బదిలీ చేస్తారు. అలా సాధ్యం కాకుంటే, ఎస్ఐని అడ్డు తప్పించడానికి కూడా వెనుకాడారు. స్థానిక రాజకీయ నాయకులు, స్మగ్లర్లు మాట వినలేదని దశాబ్దాం క్రిందట ఒక యువ ఎస్సై అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్సై విధి నిర్వహణ కోసం చిత్తూరు వచ్చి పెనుమూరుకు వెళుతుండగా మార్గమధ్యంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఎస్సై ప్రమాదంలో మృతి చెందారని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఆ ఎస్ఐని కొందరు పకడ్బందీగా హత్య చేశారని, దీనిమీద సిఐడి విచారణ జరిపించాలని తప్పట్లో భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఆ పోలీస్ స్టేషన్ కు సొంత భవనం కూడా లేదు. సొంత భవనం కోసం కేటాయించిన స్థలాన్ని  ఆక్రమణదారులు కబ్జా చేశారు. కోర్టులో కేసు వేసి పోలీస్ స్టేషన్ నిర్మాణం జరగకుండా అడ్డుకున్నారు. ప్రస్తుతం ఇరుకు అద్దె భవనంలో ఆ పోలీస్ స్టేషన్ మనుగడను చాటుకుంటుంది. సరైన వసతులు లేకపోవడంతో రికార్డులు వర్షానికి తడిసి పోయాయని ఒక ఎస్సై విఆర్ఓ పంపారు. స్థానిక నేతలు ఫిర్యాదు మేరకు నలుగురు ఎస్ఐల పైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. దీంతో ఆ పోలీస్ స్టేషన్ కు ఎస్సైగా రావాలంటే భయపడుతున్నారు. ఆ పోలీస్ స్టేషన్ అక్రమ రవాణాకు రాజబాట. ఆ పోలీస్ స్టేషన్ మీదుగానే ఎర్రచందనం ప్రతిరోజు అక్రమ రవాణా జరుగుతోంది. ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అని భేదాభిప్రాయాలు ఉండవు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ముఖ్య నేతతో కలిసి గతంలో వైసీపీలో ఎర్రచందనం అక్రమ రవాణా చేసిన ఒక నాయకుడు భాగస్వామ్యంతో నిత్యం అక్రమ రవాణా జరుగుతుంది. ఇందుకు తోడు ఆ మండలంలో చైతన్యం అధికం. అలాగే రాజకీయ పార్టీలలో వర్గాలు కూడా ఎక్కువ. గతంలో వైసీపీ పార్టీలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వర్గం, మాజీ ఎంపీ జ్ఞానేంద్ర రెడ్డి వర్గం ఆధిపత్యం కోసం పోరాడారు. ప్రస్తుతం అధికార ఓటమి పార్టీలు మూడు వర్గాలు తయారయ్యాయి. ఏ వర్గానికి అనుకూలంగా ఉన్నా, మరో రెండు వర్గాలు పోలీసుల మీద ఫిర్యాదులు చేస్తారు. దీంతో ఎందుకు వచ్చిన బాధ అంటూ ఆ పోలీస్ స్టేషన్ కు ఎస్ఐలుగా రావడానికి ఎవరూ సుముఖత వ్యక్తం చేయడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా తొమ్మిది నెలల కాలంగా ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లేరు. ఆ పోలీస్ స్టేషన్ కు ఎస్ఐగా రావాల్సిందిగా జిల్లా ఉన్నతాధికారులు సుమారు పదిమంది ఎస్ఐలను కోరినట్లు తెలుస్తోంది. అయితే ఎవరు కూడా సుముఖత చూపలేదు. ముఖ్యంగా ఈ మండలం ఉద్దండ రాజకీయ నాయకుల పుట్టిన ఊరు. రాజకీయ వివాదాలు, లిటిగేషన్లకు నెలవు. పార్టీలోని వర్గాలు తమ ప్రాబల్యం పెంచుకోవడానికి, లబ్ధి పొందడానికి ఎంతటి చర్యలకైనా పాల్పడుతారు. ఎవరినైనా బలి చేస్తారు. అందుకే ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లేకుండా అనాధగా మిగిలిపోయింది. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ లకు భవన సదుపాయం ఉన్న, ఆ పోలీస్ స్టేషన్ మాత్రం అద్దె భవనంలో అరకోరా వసతులతో అలా నడుస్తోంది. ఎస్ ఐ ని నియమించడానికి  ఇప్పటి వరకు ఎస్పీ 10 మంది ఎస్ ఐ లను సంప్రదించగా, ఒకరు కూడా సమ్మతించలేదు అని సమాచారం. పోలీస్ స్టేషన్ కు సరైన భావన లేక పోవడం ఒక కారణం కాగా రాజకీ ఒత్తిళ్లు మరో కారణం అని తెలిసింది. రెండేళ్ల క్రితం వర్షం వల్ల  స్టేషన్ లోని కొన్ని ఫైల్ లు తడిచి పోవడం వల్ల ఎస్ ఐ ని వీఆర్ కు పంపారు. అలాగే గత ప్రభుత్వ కాలంలో నలుగురు ఎస్ ఐ లు క్రమ శిక్షణ చర్యలకు గురయ్యారు. వీరిపై పలు ఆరోపణలు రావడమే అందుకు కారణం. దీని వెనక రాజాకీయ నేతల హస్తం ఉందంటున్నారు. అప్పటిలో ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి, ప్రభుత్వ సలహాదారు మహా సముద్రం జ్ఞానేంద్ర రెడ్డి మధ్య వర్గ పోరు ఉండేది. ఒకరు కేసు పెట్టమంటే మరొకరు ఒద్దనే వారు. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి టి వి డిబేట్లలో దుమ్మెత్తి పోసేవారు. శేషాచలం అడవుల నుంచి నెండ్రగుంట, పెనుమూరు మీదుగా ఎర్ర చందనం అక్రమ రవాణా జరిగేది. ఎర్ర చందనం స్మగ్లర్లతో  పెనుమూరు ఎస్ఐ లాలూచీ పడ్డారని పలు సందర్భాలలో ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూటమిలో మూడు వర్గాలు ఏర్పడ్డాయి. పార్టీ మండల అధ్యక్షుడు రుద్రయ్య ఒక వర్గం కాగా, మాజీ ఎంపీపీ హరిబాబు నాయుడు మరొక వర్గాన్ని పోషిస్తున్నారు. జనసేన మండల కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు, బిజెపి నాయకుడు వాసుదేవ నాయుడు మూడో వర్గంగా ఉన్నారు. వైసిపిలో రెండు వర్గాలు కొన సాగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులపై వర్గ నాయకుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మిగిలిన అధికారుల కంటే ఎస్ ఐ మీద తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. పైగా వీరిపై అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. పైగా ఈ ప్రాంతంలో ఎర్ర చందనం, గ్రావెల్, ఇసుక  అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వీరి వెనక పెద్దల హస్తం ఉంటుంది. కరవ మంటే కప్పకు కోపం, విడవ మంటే పాముకు కోపం అన్నట్టు పట్టుకుంటే ఒకరి, పట్టుకోకుంటే మరొకరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఈ మండలంలో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ను ఏ వర్గం పట్టించు కోవడం లేదు.  ప్రస్తుతం పోలీస్ స్టేషన్ తహశీల్దారు కార్యాలయం పక్కన చిన్న భవనంలో ఉంది. గతంలో బస్టాండు ఎదురుగా ఉన్న విశాలమైన చావడి భవనంలో  ఉండేది అక్కడ కొత్తగా పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి 50 లక్షలు మంజూరు చేశారు. చావడి స్థలం మొత్తం 48 సెంట్లు ఉండగా అందులో 16 సెంట్లు అగ్రికల్చర్ కార్యాయ భవనానికి కేటాయించారు. మిగిలిన 32 సెంట్లలో పోలీస్ స్టేషన్ భవనం నిర్మించాలని సంకల్పించారు.  అయితే ఆ స్థలం పూర్తిగా అగ్రికల్చర్ శాఖకు కేటాయించాలని స్థానిక నేత ఒకరు కోర్టుకు వెళ్లి స్టే తేవడంతో పోలీస్ భవన నిర్మాణం ఆగిపోయింది. తరువాత ఆయన కేసు ఉప సంహరించు కున్నప్పటికి ఫలితం లేకుండా పోయింది. కాగా తప్పుడు పత్రాలు సృష్టించి చావడి స్థలాన్ని అక్రమించుకునేందుకు ఒక వైసిపి నాయకుడు ప్రయత్నం చేస్తున్నారని ఎన్ బి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. బస్టాండు, హైస్కూలు, సంత గేటు, బజారుకు సమీపంలో ఉన్న చావడి స్థలంలో పోలీస్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలని ఆయన హోమ్ మినిస్టర్ కు లేఖ రాశారు. పెనుమూరులో ఎస్ ఐ లేక పోవడం వల్ల అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువ అయ్యాయని జనసేన నియోజక వర్గం ఇంచార్జి, రాష్ట్ర మాల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ పొన్న యుగంధర్ మంగళవారం మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పి ని కలిసి ఎస్ ఐ విషయం మాట్లాడారు. 


పో రై గంగ 1 పెన్యుమూరు పోలీస్ స్టేషన్ 
గంగ 2 పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కేటాయించిన స్థలం.






అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *