21, మార్చి 2025, శుక్రవారం

జిల్లాలో గ్రామీణ రోడ్లుకు మహర్దశ

రూ. 96.02 కోట్లతో 229.18 కి మీ సిసి, బీటీ రోడ్లు మంజూరు 

రూ. 55.30 కోట్లుతో  145.92 కిలోమీటర్లు సిసి, బీటి రోడ్లు పూర్తి

జిల్లాలో సిసి, బీటి రోడ్లతో గ్రామాలకు కొత్త కళ

గుంతలు లేని రోడ్లే కూటమి ప్రభుత్వ ధ్యేయం

ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.    

కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల మీద దృష్టిని కేంద్రీకరించింది. గుంటలు పడిన రహదారుల మరమ్మతులతో పాటు కొత్త రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.  జాతీయ ఉపాధిహామీ పధకం కింద   రాష్ట్రవ్యాప్తంగా రూ.4500 కోట్లతో 30 వేల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది.  చిత్తూరు జిల్లాలో రూ.96.02 కోట్లతో మీటర్ల మేర సిసి, బీటీ రోడ్ల నిర్మాణం నిమిత్తం  పనులు మంజూరు అయ్యాయి.  యం జి యన్ ఆర్ జి ఎస్ ద్వారా సి సి,బి టి రోడ్లు 1666 పనులు మంజూరు చేయడం జరిగింది.  పనులు శర వేగంగా జరుతున్నాయి. అందులో కొన్ని  పనుల పూర్తయినవి. ఇప్పటికి రూ. 55.30 కోట్లుతో  145.92 కిలోమీటర్లు సిసి, బీటి రోడ్లు పూర్తి అయ్యాయి. మిగిలిన రోడ్లను సత్వరం పూర్తిచేయడానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చర్యలు తీసుకుంటున్నారు.

దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్టం అభివృద్ధి చెందుతుందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. పల్లెలకు పూర్వ వైభవం తీసుకురావాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం 'పల్లె పండుగ' పేరుతో అక్టోబర్ 14 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలో నూతన కార్యక్రమాన్ని చేపట్టింది. తద్వారా పల్లెలలో పనుల 'పండుగ' సందడి ప్రారంభమైంది. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పనులకు పరిష్కారానికి శ్రీకారం చుట్టి  పల్లెల్లో అసలైన పండుగ వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 2024 ఆగస్టు 23న గ్రామసభల్లో  తీర్మానాలు; గత ఏడాది ఆగస్టు 23 న రాష్ట్రవ్యాప్తంగా ఒక్కే రోజు 13 వేల 326 పంచాయతీల్లో  గ్రామసభలను ప్రభుత్వం నిర్వహించింది. దేశంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఈ మేరకు చిత్తూరు  జిల్లాలోని  గ్రామపంచాయతీలలో గ్రామసభలు నిర్వహించి,  ఆయా పంచాయతీల్లో స్థానిక సర్పంచులు యం పి టి సిలు, జడ్పీటీసీ, ప్రజల సమక్షంలో తీర్మానాలు చేశారు. ఈ మేరకు   మేరకు పంచాయతీ పరిధిలో సిమెంటు రోడ్లు, బిటి రోడ్లు, పాఠశాల లకు ప్రహరీలు, గోకుల షెడ్లు, పారిశుద్ధ పనులు చేపట్టాలని నిర్ణయించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే ఈ పనులకు ప్రభుత్వం నుంచి పరిపాలనపరమైన అనుమతి, సాంకేతిక ఆమోదం లభించింది. గ్రామసభల్లో తీసుకున్న నిర్ణయాలు అమలుచేయడానికి అన్ని శాఖలను జిల్లా యంత్రాంగం పనులు ప్రారంభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రభుత్వ శాఖల సమన్వయాన్ని  పర్యవేక్షిస్తున్నారు. జూన్ నాటికి పనులు పూర్తి చేసి పల్లెలకు అసలైన పండుగ తీసుకురావాలనేది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సంకల్పం. పల్లెలకు పండుగే ఈ మేరకు అభివృద్ధి పనులు చేపట్టి పల్లెలకు పూర్వవైభవం తీసుకురావాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం తొలి అడుగు వేసింది. "పల్లె పండుగ -పంచాయతీ వారోత్సవాలు" పేరిట కొత్త కార్యక్రమాన్ని చేపట్టి అక్టోబర్ 14 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలలో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేశారు. 'పల్లెపండుగ' వారోత్సవాల్లో భాగంగా రూ.4,500 కోట్లతో 30 వేల అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా 3 వేల కిలోమీటర్ల సిమెంట్‌ రోడ్లు, మరో 500 కిలోమీటర్ల తారు రోడ్లు, 25 వేల గోకుల షెడ్లు, 10 వేల వాన నీటి సంరక్షణ కందకాలతో పాటు గ్రామాల్లో అవసరమైన అనేక పనులను ప్రభుత్వం చేయడానికి సంకల్పించింది. ఈ పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు, గ్రామ ప్రజల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించడానికి, గ్రామీణ మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు శ్రీకారం చుట్టింది. ప్రజలంతా కలిసి తమ గ్రామాల్లో కావాల్సిన అభివృద్ధి పనులను వారే తీర్మానించుకున్నారు. శంకుస్థాపన చేసిన చోటే ఆయా పనులకు సంబంధించి పూర్తి వివరాలు ఉండాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పూర్తి పారదర్శకతతో పనులు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దీనివల్ల గ్రామాల్లో నీటి, రవాణా, వ్యవసాయ వంటి రంగాలలో గణనీయమైన మెరుగుదల సాధ్యం అవుతోంది. అంతేకాకుండా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో భాగస్వామ్యాన్ని పెంచి, గ్రామాల్లో ఆర్థిక స్థిరత్వం సృష్టించడంలో పల్లె పండుగ కార్యక్రమం ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. జిల్లాలో రూ. 96.02 కోట్లతో 1666 పనులు, 229.18 కి మీ సిసి, బీటీ రోడ్ల నిర్మాణం కొరకు  పనులకు ఆమోదం లభించింది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగాన్ని వేగంగా సమాయుక్తం చేశారు.  ఈ మేరకు పక్కా ప్రణాళికతో కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్తున్నారు. గ్రామ సభలో ఆమోదం పొందిన పనులకు సంబంధించి జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకం సమన్వయంతో పంచాయతీరాజ్ శాఖ ద్వారా చిత్తూరు జిల్లాలో రూ.96.02 కోట్లతో 229.18 కిమి మేర సిసి, బీటీ రోడ్ల నిర్మాణం నిమిత్తం 1666 పనులకు జిల్లా కలెక్టర్ సత్వరం పరిపాలనపరమైన ఆమోదపు మంజూరు ఉత్తర్వులను జారీ చేశారు. జిల్లాలో  పనులు ప్రారంభించి.కొన్ని పనులను పూర్తి చేయగా కొన్ని  పనులు తుది దశ ప్రగతిలో ఉన్నవి. ఇప్పటికే 1245 పనులు పూర్తి చేయడం జరిగింది. 145.92 కిలోమీటర్లు సిసి, బీటి రోడ్లు పూర్తి చేశారు. ఇందుకుగాను ఇప్పటి వరకు రూ. 55.30 కోట్లు ఖర్చు చేశారు. ఇంకను   సిసి రోడ్లు నిర్మాణాలు దాదాపు చివరి దశకు  చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పని పూర్తి చేసిన ప్రతిచోట చేపట్టిన పని తెలిపే వివరాలు, ప్రదేశం, ఎక్కడి నుంచి ఎక్కడిదాకా రహదారులు నిర్మించారు, ఎంత ఖర్చు చేశారు తదితర వివరాలను కూడా పని ప్రదేశంలో "సిటిజెన్ నాలెడ్జ్ సమాచార బోర్డులు" కూడా ఏర్పాటు చేస్తున్నారు. పి.ఎం.జి.ఎస్.వై – ఫేజ్ 3 ద్వారా తొమ్మిది బిటి రోడ్లు పనులకు ఆమోదం తెలుపగా,  172.34 కిమీ కొరకు రూ.61.97 కోట్లుఖర్చు చేసి, 7.60 కిమీ రోడ్డు పూర్తి చేశారు. ఒక్క రోడ్డు పురోగతి లో ఉంది. దీనికి  రూ.3.88 కోట్లు ఖర్చు చేశారు. ఎక్స్ టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్  ద్వారా జిల్లాలో 657 రోడ్డులు పనులు మంజూరు కాగా, 1125.52 కిలోమీటర్ల పొడవు రూ.767.29 కోట్లుతో, ఇప్పటికే  382రోడ్లు 654.40 కిలోమీటర్ల పోదు పూర్తి అయింది. 146 రోడ్ల నిర్మాణం పురోగతిలో ఉన్నాయి. వీటికి  రూ.314.25 కోట్లు ఖర్చు చేశారు.


ఈ విషయమై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ..  సిసి, బీటి రోడ్లతో చిత్తూరు జిల్లా లో గ్రామాలు నూతన శోభ సంతరించుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వ రాకతో  ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులు, సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం శాయశక్తులా కృషి చేస్తోంది. ఇందుకు ప్రజల నుంచి కూడా పూర్తి సహకారం అందుతోంది. వారు కూడా ఈ కార్యక్రమాలలో స్వచ్ఛందంగా భాగస్వాములు అవుతున్నారు. రోడ్డు సైడ్ కాలువలు, అవెన్యూ ప్లాంటేషన్ పనులు కూడా చేస్తున్నాం. ఇందుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుండడంతో  ప్రజల కోసం ప్రజులు నిర్ణయం తీసుకోని, అమలు చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఒక మంచి సంప్రదాయం. గ్రామసభల తీర్మానాల మేరకు జిల్లాలో  సిసి బిటి రోడ్లను నిర్మించాలని సంకల్పించి, ఇప్పటికే  సి సి, బి టి రోడ్లు పూర్తి చేశాం. చిన్నచిన్న సాంకేతిక సమస్యలతో ఇంకనూ ప్రారంభించని పనులు కూడా త్వరితగతిన చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పని పూర్తి అయిన ప్రదేశంలో సిటిజన్ నాలెడ్జ్ సమాచార బోర్డులను కూడా ఏర్పాటు చేస్తున్నాం. పంచాయతీరాజ్ శాఖ, ఉపాధి హామీ శాఖల అధికారులు సమన్వయంతో పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. పనులన్నింటినీ నాణ్యతతో పూర్తి చేయాలని  స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. బిల్లులు అప్లోడ్ చేసిన పిదప ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేస్తోంది. పల్లె పండుగ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులను జూన్ లోగా,  నాణ్యతగా పూర్తి చేయడం జరుగుతుంది. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *