పగడ్బందీగా జిల్లాలో పది పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం
మొత్తం 118 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.
40 సిట్టింగ్స్ స్క్వాడ్స్ 8 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల ఏర్పాటు.
ఉ.9.30 గం.ల నుండి మధ్యాహ్నం 12.45గం.ల వరకూ పరీక్షలు
పరీక్ష రోజు పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ణలు
పరీకా కేంద్రాల పరిధిలో జిరాక్సు,నెట్ సెంటర్లను మూసి ఉంచాలి
ఫేక్ న్యూస్,వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
రాష్ట్ర స్థాయిలో 08662974540 నంబరు కంట్రోల్ రూమ్ ఏర్పాటు
చీఫ్ సూపరింటిండెంట్ తప్ప ఎవరి మొబైల్ ఫోన్ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదు.
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ
జిల్లా వ్యాప్తంగా సోమవారం నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకూ నిర్వహించే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు ఆస్కారం లేని రీతిలో సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గొబ్బిళ్ళ విద్యాధరి తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చీఫ్ సూపరింటిండెంట్ మినహా ఎవరి మొబైల్ ఫోన్ ను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరాదని స్పష్టం చేశారు.ఎవరైనా మొబైల్ ఫోన్లు తీసుకువస్తే వాటిని పరీక్షా కేంద్రాల ప్రధాన గేటువద్దే వాటిని సేకరించి భద్రపర్చి పరీక్ష అనంతరం వాటిని తిరిగి అప్పగించాలన్నారు. పరీక్షలు జరిగే రోజుల్లో పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ణలు విధించాలని చెప్పారు. అదే విధంగా పరీక్షా కేంద్రాల పరిధిలోని జిరాక్సు, నెట్ సెంటర్లన్నీ మూసి ఉంచేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పరీక్షలు జరిగే సమయంలో వివిధ సోషల్ మీడియా సహా ఇతర ప్రసార మాధ్యమాల్లో పేపరు లీకు వంటి వదంతులు లేదా ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎక్కడైనా అలాంటివి వ్యాప్తి జరిగితే వెంటనే విచారణ చేసి తగిన స్పష్టత ఇవ్వాలని నకిలీ వార్తలు ప్రసారం చేసినట్టు తేలితే అలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు.
ఇటీవల బిఇడి పరీక్షల నిర్వహణ సమయంలో పేవర్ లీక్ వంటి వదంతులు వచ్చాయని, కావున అలాంటి వాటిపై పూర్తి అప్రమత్తంగా ఉండి పరీక్షల సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.10వ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా కలక్టర్,ఎస్పిల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అధికారులతో కోఆర్డినేషన్ కమిటీ సమావేశాలు నిర్వహించామన్నారు. సెన్సిటివ్ పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక దృషి సారిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి జిల్లాకు ప్రత్యేక నోడలు అధికారులను ప్రభుత్వం నియమించిందని, రాష్ట్ర స్థాయిలో 08662974540 నంబరుతో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని ఇన్చార్జ్ కలెక్టర్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన కాన్పిడెన్సిషల్ మెటీరియల్ ను ఇప్పటికే సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపడం జరిగిందని అన్నారు. వేసవి దృష్ట్యా అన్ని పరీక్షా కేంద్రాల్లో తగిన తాగునీటి సౌకర్యం కల్పించాలని, ప్రతి కేంద్రంలో ప్రధమ చికిత్స వంటి సేవలకు ఒక ఎఎన్ఎంను అందుబాటులో ఉంచాలని సూచించారు.
పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరాకు ఉండేలా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. జిల్లాలో మొత్తం 118 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని,జిల్లా లో 'ఎ' క్యాటగిరీ పరీక్షా కేంద్రాలు -38, 'బి' క్యాటగిరీ- 3,b'సి' క్యాటగిరి- 43 ఉన్నాయని వివరించారు. పది పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న రెగ్యులర్ ప్రైవేటు మొత్తం విద్యార్థులు 21,248గా పేర్కొన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 20,954 మంది, ఇందులో బాలురు -10,802, బాలికలు -10,152 మంది అని వివరించారు. ప్రైవేట్ విద్యార్థులు మొత్తం 294 మంది పరీక్షలు రాస్తున్నారని ఇందులో బాలురు 203, బాలికలు -91 ఉన్నారని తెలిపారు. 11 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలు నందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
37 స్టోరేజ్ పాయింట్స్ ఉన్నాయని, పరీక్షల నిర్వహణకు 118 చీఫ్ సూపరింటెండెంట్ లను ఏర్పాటు చేశామన్నారు. పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పరీక్షల కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా పోలీస్ శాఖను ఆదేశించామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 భారత న్యాయ సంహిత నియమాలు వర్తిస్తాయనీ, మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే చర్యలు తప్పవనీ హెచ్చరించారు.
పరీక్షా కేంద్రంలోనికి విద్యార్థులు మరియు ఇన్విజిలేటర్లు సహా ఎవరు ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రాలలో ఫస్ట్ ఏయిడ్ కిట్లు, ఒ ఆర్ ఎస్ ఎస్ ప్యాకెట్లు ఏర్పాటు చేశామని అందుబాటులో వైద్య సిబ్బంది ఉంటారని తెలిపారు.పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల్లో భాగంగా తగినంత లైటింగ్, మంచినీరు అందించడానికి చర్యలు చేపట్టామన్నారు. నీటి వసతితో కూడిన మరుగుదొడ్ల సౌకర్యం కల్పించామని, దూర ప్రాంత విద్యార్థులు పరీక్షలకు సకాలంలో చేరుకొనేలా బస్సులు నడిపేలా ఆర్ టి సి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. పరీక్షా కేంద్రాలలో నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించామన్నారు. ప్రశ్నా పత్రాలు, జవాబు పత్రాల తరలింపుకు సంబందించి పతిష్ట బందోబస్తు, ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేశామని తెలిపారు.
విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకొని.. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తినేత సాధించాలని ఇన్చార్జి కలెక్టర్ విద్యాదని ఆకాంటించారు. జిల్లా వ్యాప్తంగా పది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు పరీక్షా సమయం 9:30 గంటలకు అర్ధగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, హడావిడి లేకుండా ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయాలన్నారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పది పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం చేశామని, దూర ప్రాంత విద్యార్థులు వారి హాల్ టికెట్ ను బస్సు లో చూపించి ఉచితంగా ప్రయాణించి సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవలని కోరారు.
పో రై గంగ 2 జిల్లా ఇన్చార్జి కలెక్టర్ విద్యాధరి.

