10, మార్చి 2025, సోమవారం

ఎమ్మెల్సీ పదవుల్లో చిత్తూరు జిల్లాకు రిక్త హస్తం


నిరాశలో రాశావాహులు

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాకు శూన్య హస్తం మిగిలింది. చంద్రబాబు సొంత జిల్లాకు మొండి చేయి చూపడం పట్ల జిల్లా నేతల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్సీ పదవులపైన పలువురు నాయకులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల గంగాధర నెల్లూరు పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రిని కూడా కొంతమంది నాయకులు కలిసి మనసులోని మాటను తెలియజేశారు. గత ఎన్నికల్లో కష్టపడి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని భావించారు. మంత్రివర్గంతో పాటు ఇతర నామినేటెడ్ పోస్టులలో ఎమ్మెల్సీ పదవులను జిల్లాకు తగిన స్థానం లభించలేదని నాయకులలో ఆవేదన వ్యక్తం అవుతుంది.

 గత ప్రభుత్వంలో జిల్లాలో వైసిపి చెందిన భరత్, డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం ఎమ్మెల్సీలుగా ఉన్నారు. టిడిపి నుంచి ఒకరు కూడ లేకపోవడం విశేషం. రాష్ట్రంలో ఖాలీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారంతో నామినేషన్ల గడువు ముగిసింది. టిడిపి నుంచి ముగ్గురు, జనసేన, బిజెపి నుంచి ఒక్కొక్కరు నామినేషన్లు వేశారు.13 తేదీ ఎవరు ఉపసంహరణ చేసుకొనట్టయితే ఐదుగురు గెలిచినట్టేగా భావించాలి. 20 వ తేదీన అధికారికంగా ప్రకటిస్తారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తరువాత జిల్లా నుంచి ఒకరికి అవకాశం ఉంటుందని పరిశీలకులు భావించారు. గతంలో బి ఎన్ రాజసింహులు ( దొరబాబు),  గౌనివారి శ్రీనివాసులు, గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ముద్దు కృష్ణమ నాయుడు మరణం తరువాత ఆయన భార్య సరస్వతమ్మకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. కాబట్టి ఈ సారి జిల్లా నుంచి ఒకరికైనా అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలలో చర్చ సాగింది. ఈ నేపథ్యంలో చిత్తూరు మాజీ ఎమ్మేల్యే సి కె బాబు పేరు ఎక్కువగా వినిపించింది. ఆయన ఈ నెల ఒకటవ తేదీన గంగాధర నెల్లూరు వచ్చిన చంద్రబాబును స్వయంగా కలిసి మనసులో మాట చెప్పారని తెలిసింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి బద్ద శత్రువు అయిన సి కె బాబు కౌన్సిలర్ గా రాజకీయ జీవితం ప్రారంభించి 1989 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1994, 1999, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. తరువాత ఆయన కొంత వరకు రాజాకీయ అనిక్షితి ఎదుర్కొన్నారు. 2019 లో టిడిపిలో చేరి ఆ ఎన్నికల్లో పంచేసారు. 2024 లో గురజాల జగన్ మోహన్ నాయుడు విజయానికి కృషి చేశారు. అయినా ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం దక్కలేదు. అలాగే చిత్తూరు మరో మాజీ ఎమ్మెల్యే ఎ ఎస్ మనోహర్ కూడా ఎమ్మెల్సీ పదవి ఆశించారు. ఆయన 1994 లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి సి కె బాబు చేతిలో ఓడిపోయారు. 2004 లో ఆయన టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి  సి కె బాబుపై విజయం సాధించారు. మళ్ళీ 2009 లో ఓడిపోయారు.  2014 లో టికెట్టు కోసం ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. 2019 ఎన్నికలలో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయాలకు విరామం ఇచ్చారు. 2024 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి విజయానికి కృషి చేసారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు అవకాశం ఉంటుందని భావించారు. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి తొలి నుంచి ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. గతంలో ఆయన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 1999 ఎన్నికల్లో ఆయన పుత్తూరులో ముద్దు కృష్ణమ నాయుడుకు కాంగ్రెస్ టికెట్టు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. ముద్దు కృష్ణమ ఓటమికి కారకుడయ్యారన్న ఆరోపణతో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. తరువాత సైకాలజిస్టు, శిక్షకునిగా వృత్తి ప్రారంభించారు. వై ఎస్ జగన్ కు వ్యతిరేకంగా సోషియల్ మీడియా ద్వారా పోరాటం చేస్తున్న ఆయనను  చంద్రబాబు పిలిచి పదవి ఇచ్చారు. మంచి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తనకు కాకున్నా తన కుమారుడు ఎన్ బి హర్ష వర్ధన్ రెడ్డికి అవకాశం కల్పించాలని ఆయన తొలి నుంచి అడుగుతున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతోనే జిల్లాలోని నాయకులకు తగిన గుర్తింపు లభించడం లేదని నాయకులు లోలోన మదన పడుతున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *