3, మార్చి 2025, సోమవారం

కోటి ఆశలతో చంద్రబాబు రాకకై ఎదురు చూస్తున్న జీడి నెల్లూరు ప్రజలు

నేడే  జీడి నెల్లూరు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన 

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. 

గంగాధర  నెల్లూరు నియోజక వర్గం ప్రజలు సిఎం నారా చంద్రబాబు నాయుడుపై కోటి ఆశలు పెట్టుకొని ఉన్నారు. మార్చి ఒకటవ తేదీన నియోజక వర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వస్తున్న ఆయన అభివృధ్ధి పథకాలు ప్రకటిస్తారని భావిస్తున్నారు. 1994లో వేపంజేరి నియోజక వర్గంగా ఉన్నపుడు ఇక్కడి నుంచి టిడిపి అభ్యర్ధి ఆర్ గాంధీ విజయం సాధించారు. ముప్పై ఏళ్ల తరువాత జి డి నెల్లూరు నుంచి టిడిపి అభ్యర్ధి డాక్టర్ వి ఎం థామస్ విజయం సాధించారు. కాంగ్రెస్, వైసిపికి కంచుకోటగా ఉన్న ఇక్కడ 30 ఏళ్ళ తరువాత టిడిపి అభ్యర్ధి గెలవడంతో కూటమి నేతలు పలు అభివృద్ధి కార్యక్రమాలను గూర్చి చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. 


గంగాధర నెల్లూరు  నియోజక వర్గంలోని వెదురుకుప్పం లేదా పెనుమూరు మండలంలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. ఎన్నికల ప్రచార సమయంలో థామస్ దీనిపై హామీ కూడా  ఇచ్చారు. పెనుమూరు మండలంలోని ఎన్టీఆర్ జలాశయం నుంచి 32 చెరువులకు నీరు మళ్లించే కార్యక్రమానికి గతంలో మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ 19 99 లో ప్రతిపాధించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇందుకు  శ్రీకారం చుట్టింది. అప్పటిలో రెండు చెరువులకు అనుసందానం చేసి, నీటిని నింపారు. తరువాత వచ్చిన వైసిపి ప్రభుత్వంలో ఉప ముఖ్య మంత్రి కె నారాయణ స్వామి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పడు మిగిలిన చెరువులకు నీరు మళ్లించే పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే ఎన్టీఆర్ జలాశయం వద్ద బోటు క్లబ్ ఏర్పాటు చేసి, విహార కేంద్రంగా తీర్చిదిద్దితే, సమీపంలో ఉన్న చిత్తూరు నగరం, పూతలపట్టు ఇతర ప్రాంతాల వారికి విహార కేంద్రంగా ఉంటుందని అంటున్నారు. అలాగే పులి గుండుకు రోప్ వే వేయాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నేండ్రగుంట నుంచి పెనుమూరు వరకు ఉన్న 11 కిలో మీటర్ల రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చాలని కోరుతున్నారు. ఇప్పటి రెండు సార్లు ఈ రోడ్డు విస్తరణకు అధికారులు ప్రణాలికలు సిద్దం చేసినా, మళ్ళి  రద్దు చేశారని ఒక నాయకుడు చెప్పారు. కలికిరి కొండకు పూతలపట్టు చిత్తూరు రోడ్డు నుంచి విశాలమైన రోడ్డు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఆలయాన్ని టిటిడి స్వీకరించి ఉన్నందున ఈ ప్రాంతానికి చెందిన టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు చర్యలు తీసుకోవాలని కొందరు సూచిస్తున్నారు. దక్షిణ భారత దేశంలోనే పేరున్న కార్వేటినగరం వేదనారాయణ స్వామి పుష్కరణి అభివృద్ది చేయాలని పలువురు భక్తులు కోరుతున్నారు. వెదురుకుప్పం, కార్వేటినగరం మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలి అన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. పచ్చీకాపల్లం  నుంచి అటు తిరుపతి, ఇటు కార్వేటినగరం రోడ్లను విస్తరించాలని కోరుతున్నారు. ముట్టాలం కొండల్లో ఉన్న శివాలయం వరకు తారురోడ్డు వేయాలని కోరుతున్నారు. నియోజక వర్గంలోని ఎన్టీఆర్ జలాశయం, కలికిరి కొండ, పులి గుండు, ముట్టాలం శివాలయం, కార్వేటినగరం పుష్కరణి అభివృద్ది చేయడం ద్వారా పర్యాటకులు, భక్తులను విశేషంగా ఆకర్శించ వచ్చని పలువురు అంటున్నారు.

పో రై గంగ 1 ఎంటిఅర్ జలాశయం 

గంగ 2 పులిగుండు 

గంగ 3 కలికిరి కొండ 


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *