4, మార్చి 2025, మంగళవారం

మార్చి నెల కార్డుదారులకు కందిపప్పు బంద్

జిల్లాకు సరఫరా చేయని రాష్ట్ర ప్రభుత్వం 

మూడవ నేలకే చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం 

ఆవేదన చెందుతున్న వినియోగదారులు 

ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.

జిల్లాలోని తెలుపు రంగు కార్డులకు రెండు నెలలు కందిపప్పు సరఫరా చేసిన కోటమి ప్రభుత్వం మూడవ నెలలోనే  చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు మార్చి నెలకు సంబంధించి కందిపప్పును కోటాను కేటాయించలేదు. దీంతో జిల్లాలోని రేషన్ షాపులలో మార్చి నెల కందిపప్పు సరఫరా ఆగిపోయింది. రాష్ట్రస్థాయిలో కందిపప్పుకు సబంధించిన టెండర్లు ఖరారు కాకపోవడమే ఇందుకు కారణమని జిల్లా పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. కందిపప్పుకు బదులు రేషన్ షాపుల్లో  రాగులు, జొన్నలు  పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది.  రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని కార్డుదారులు నిరాశకు గురవుతున్నారు.


జిల్లాలో  ప్రస్తుతం 5.37 లక్షల  రేష‌న్ కార్డులు ఉన్నాయి. వీటికి నిత్యావసర వస్తువులు సరఫరా చేయడానికి  జిల్లాలో  1,379 రేష‌న్ షాపులు ఉన్నాయి. ఇంటింటికీ స‌రుకులు పంపిణీ చేయ‌డానికి జిల్లాకు 336  మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) వాహ‌నాల‌ను ఉన్నాయి. వీటి ద్వారా ప్రతినెల 91.85 లక్షల కిలోలబియ్యం, 2.8 లక్షల కిలోల చక్కెర, 5.37 కిలోల కందిపప్పు, 1.60 కిలోల జొన్నలు సరఫరా చేస్తున్నారు. జనవరి నేలనుండి  రేషన్ కార్డు దారులకు సబ్సిడీ ధరకు కందిపప్పు పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జనవరి నెల నుంచి దీన్ని అమలు చేస్తోంది. తెల్ల రేషన్ కార్డులున్న వారికి తక్కువ ధరకే కందిపప్పు అందజేసేందుకు ఏర్పాట్లు చేసింది. అన్ని జిల్లాలను అవసరమైన స్టాక్ ను చేరవేంది. జనవరి  నుంచి ఏపీ వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో చెక్కెర, గోధమ పిండితో పాటు కందిపప్పును కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో కంది పప్పు ధర రూ. 150 నుంచి రూ. 180 వరకు ఉంది. అయితే రేషన్ దుకాణాల్లో కిలో కందిపప్పును రూ. 67 విక్రయిస్తోంది ప్రభుత్వం. దీంతో ఈ కందిపప్పుకు సామాన్యుల నుంచి భారీగా డిమాండ్ ఉంది.  ఏపీలోని రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు చక్కెర, గోధుమ పిండిని సబ్సిడీ ధరకు అందిస్తున్న ప్రభుత్వ ఇకపై కందిపప్పును కూడా సబ్సిడీ ధరకు విక్రయిస్తోంది. రేషన్ దుకాణాల్లో కిలో గోధుమ పండి రూ. 16, కిలో చక్కెర రూ. 32, కిలో కంది పప్పు రూ. 67కు లభిస్తోంది.  రేషన్ దుకాణాల్లో కంది పప్పును ప్రభుత్వం విక్రయించాల్సి ఉన్నందున,   50,000 టన్నుల కంది పప్పును కేటాయించాలని కేంద్రాన్ని కూడా కోరింది. అయితే కేంద్రం 9,700 టన్నులకుపైగా కందులను కర్ణాటక బఫర్ స్టాక్ నుంచి కొనుగోలు చేసింది. కానీ నాణ్యత సరిగ్గా లేకపోవడంతో ఏపీ ప్రభుత్వం మరో రెండు సార్లు కేంద్రానికి లేఖలు పంపింది. అయినా, కేంద్రం నుండి స్పందన లేదని తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కందిపప్పును సరఫరా చేయడానికి టెండర్లను పిలిచిది. అయితే ఇప్పటివరకు ఈ టెండర్ల కార్యక్రమం ఖరారు కాలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మార్చి నెల నుంచి కందిపప్పు సరఫరా  ఆగిపోయింది. కందిపప్పు సరఫరాకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించకపోవడంతో భవిష్యత్తులో రేషన్ షాపుల్లో కందిపప్పు సరఫరా  ఉంటుందా లేదా అన్నది సందేహం గానే మారింది. కందిపప్పుకు  బదులు రేషన్ షాపుల్లో రాగులు, జొన్నలు ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ ప్రతిపాదిస్తుంది. అయితే వీటిని కొనుగోలు చేసేవారు కందిపప్పుతో పోల్చుకుంటే చాలా తక్కువ. కందిపప్పుకు ఉన్న డిమాండ్ రాగులు, జొన్నలకు లేదు. ప్రజలకు  రాగులు జొన్నలు దీన్ని అలవాటు కూడా తప్పింది. దీంతో జిల్లాలకు రాగులు, జొన్నలు సరఫరా చేసిన సగం వరకు కూడా వినియోగం కావడం లేదు. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం కందిపప్పు కిలో ధర 150 రూపాయల నుంచి 180 రూపాయల వరకు పలుకుతుంది. గతంలో 200 రూపాయలకు పైగా పలికిన సందర్భం కూడా ఉంది. అయితే ఇటీవల మార్కెట్లోకి కొత్త కందిపప్పు విడుదల కావడంతో ధరలు కాస్త తగ్గాయి. అయితే రేషన్ షాపుల్లో 67 రూపాయలకే కిలో కందిపప్పు వస్తుందందున బహిరంగ మార్కెట్ లో  150 పైగా  పెట్టి కదిపప్పు కొనుగోలు చేయడానికి వినియోగదారులు విముఖత చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ఎలాగైనా రేషన్ షాపుల ద్వారా కందిపప్పును సరఫరా చేయాలని కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన కందిపప్పు సరఫరా హామీ అర్ధాంతరంగా ఆగిపోవడం పట్ల వినియోగదారులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *