నేడు 8 మండల పరిషత్తులలో ఉప ఎన్నికలు
భారీ పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాలు పహరాలో ఎన్నికలు
రామకుప్ప మండలంలో ఉద్రి ఉద్రిక్త పరిస్థితులు
సదం మండల పరిషత్ అధ్యక్షురాలుగా సుమతి ?
తవణంపల్లిలో తిరిగి వైసిపి పరం కానున్న అధ్యక్ష పదవి
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 8 మండల పరిషత్తులలో గురువారం ఎన్నికలు జరగనున్నాయి. సదం, రామకుప్పం, తవణంపల్లి, తిరుపతి రూరల్ మండలాల్లో మండల పరిషత్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. విజయపురం, రామకుప్ప మండలాల్లో మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవులకు, పీలేరు, పెనుమూరు మండలాల్లో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగనుంది. ఇందుకోసం జిల్లా పరిషత్ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక అధికారులను కూడా జిల్లా జాయింట్ కలెక్టర్ నియమించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎనిమిది మండలాల్లో ఎన్నికలను నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు, జిల్లా పరిషత్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
సదం మండల పరిషత్ అధ్యక్షుడుగా ఉండిన ఎల్లప్ప మరణంతో అక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటివరకు మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఉన్న ధనంజయ రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగారు. గురువారం జరగనున్న ఎన్నికలలో పాలనంద పంచాయతీకి చెందిన మాధవి మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈ మండల పరిషత్ అధ్యక్ష పదవి మరో మరో వైసీపీ కైవసం చేసుకోనుంది. రామకుప్పం మండలంలో మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఉన్న శాంతకుమారి మరణంతో అక్కడ అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. ఆ మండలంలో గతంలో ఒక ఉపాధ్యక్ష పదవికి ఎన్నికల జరగలేదు. దీంతో రామకప్పం మండలంలో మండల పరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మండలంలో గత ఎన్నికలలో 16 మంది ఎంపీటీసీ సభ్యులు వైసీపీ తరఫున ఎన్నికయ్యారు. ఇటీవల ఏడు మంది ఎంపీటీసీ సభ్యులు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతమున్న బలాబలాల ప్రకారం ఈ రెండు స్థానాలు వైసీపీకి దక్కే అవకాశం ఉంది. అయితే ఎలాగైనా రామకుప్పం మండలంలో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను కైవసం చేసుకుని తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని తెలుగుదేశం పార్టీ కృతనిర్చయంతో ఉంది. దీంతో ఇందుకు అనుగుణంగా పావులు కలుపుతోంది. ఈ విషయమై బుధవారం రెండు పార్టీల మధ్య గొడవలు కూడా జరిగింది. దీంతో గురువారం భారీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సిసి కెమెరాల పహారాలో ఎన్నికను నిర్వహించనున్నారు. రామకుప్పం టిడిపి ఎంపీపీ అభ్యర్థిగా ఉనిసిగానిపల్లి పంచాయతీ ఎంపీటీసీ సులోచన, వైకాపా ఎంపీపీ అభ్యర్థి బంధార్లపల్లి పంచాయతీ 2 సుధామణి, రెండోవ వైస్ ఎంపీపీ టిడిపి తరఫున విజిలాపురం పంచాయతీ వెంకట్రామే గౌడ్, వైకాపా తరఫున కంచనబల్ల పంచాయితీ జలపతి భారీలో ఉన్నారు. ఇప్పటి వరకు మునుపు ఒకటవ వైస్ ఎంపీపీ సుబ్రహ్మణ్యం అధ్యక్షుడిగా కొనసాగారు. పెనుమూరు మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ భాషా మృతి చెందడంతో అక్కడ జరగనుంది. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం మండల పరిషత్ అధ్యక్షుడిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీ అయింది. ఆయన మున్సిపాలిటీ ఉప మేయరుగా పనిచేస్తూ, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దీంతో ఆ స్థానానికి ఎన్నిక జరుగుతుంది. విజయపురం మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఉన్న దశరథ రాజీనామా చేయడంతో ఆ మండల ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక జరగనుంది. అన్నమయ్య జిల్లా పీలేరు మండల పరిషత్ కో ఆప్షన్స్ సభ్యుడిగా ఉన్న ఖాదర్ బాషా మృతి చెందారు. దీంతో అక్కడ కో ఆప్షన్ సభ్యులు ఎన్నిక జరుగుతోంది. గురువారం జరగనున్న మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నికల నిర్వహణ విషయమై జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి డి ఆర్ ఓ కె . మోహన్ కుమార్, జెడ్పి సిఈఓ రవికుమార్ నాయుడుతో కలసి చిత్తూరు పలమనేరు కుప్పం ఆర్డీఓ లు, సంబంధిత ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించారు. రామకుప్పం, సదుం, తవణంపల్లి, పెనుమూరు, విజయపురం మండలాలో ఖాళీగా ఉన్న మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్టెడ్ మెంబర్స్ ఎన్నికల నిర్వహణకు ఎం పి డి ఓ లు పి ఓ లు గా వ్యవహరిస్తారు. ఎన్నికల నియమ నిబంధనలను కచ్చితంగా పాటించి ప్రశాంతంగా వాతావరణంలో ఎన్నికలనునిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. ఇందులో భాగంగా రామ కుప్పం మండలానికి కుప్పం ఆర్డీఓ శ్రీనివాసులు రాజును, సదుం మండలానికి ఆర్డీఓ పలమనేరు భవానిని, తవణంపల్లి మండలానికి చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులును, పెనుమూరు మండలానికి పెనుమూరు తహశీల్దార్ శరవణ కుమార్ ను, విజయపురం మండలానికి నగరి ఆర్డిఓ భవాని శంకరిని నియమించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి సభ్యులకు ఎం పి డి ఓ ల ద్వారా నోటీస్ లను అందచేశారు. ఎన్నికలు నిర్వహించే సమావేశ మందిరంలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికకు సంబంధించి కోరంను పాటిస్తారు. సభ్యులను ఎన్నుకున్న అనంతరం నోటీస్ బోర్డులో ఎన్నికైన వారి వివరాలను ఉంచుతారు. సభ్యులు తగినంత మంది హాజరు కానీ పక్షంలో మరుసటి రోజు 28 వ తేదీ ఉదయం 11 గం. లకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల నిర్వహణ సమయంలో పోలీస్ బందోబస్త ఏర్పాటు చేసుసి, ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తిగా వీడియోగ్రఫీ చేస్తున్నారు. సీసీ కెమరాలు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని మండలాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. రామకుప్పం మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

