24 గంటల్లో దోపిడీ దొంగల పట్టివేత
జిల్లా ఎస్పి ణికంఠ చందోలు
చిత్తూరు, మర్చి 13, (ఆంధ్రప్రభ బ్యూరో) చిత్తూరు పట్టణము నందు పుష్పా కిడ్స్ వరల్డ్ షాప్ యజమాని ఇంటిలో దోపిడీకి యత్నించిన 7 మంది దొంగలను 24 గంటలలోపే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని జిల్లా ఎస్పి ణికంఠ చందోలు తెలిపారు. గురువారం చిత్తూరు పోలీస్ అతిధిగృహములో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇంటిలో దోపిడీకి పాల్పడిన దొంగల ముఠాను కేవలం 2 గంటల వ్యవధిలో పట్టుకున్నమని చెప్పారు. నిందితుల వద్ద మూడు తుపాకులు, రెండు చిన్న కత్తి, ఒక బాక్స్ లో కారం పొడి, ఒక బాక్స్ లో గమేషణ్ పొడి, నాలుగు బుల్లెట్స్ మరియు 4 పెల్లెట్స్ స్వాదినం చేసుకున్నామని వివరించారు. దొంగల దగ్గర మారణాయుధాలు ఉన్నప్పటికీ ప్రాణాలకు తెగించి ఆపరేషన్ చేశామని, సమాచారం అందిన నిమిషాలలో సంఘటనా స్థలానికి చేరుకున్నమని పేర్కొన్నారు. తాను స్వయంగా సంఘటనా స్థలానికి వెళ్లి ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తూ విజయవంతంగా, సురక్షితంగా ఆపరేషన్ పూర్తి చేశామని తెలిపారు. సాంకేతిక పరంగా డ్రోన్ వినియోగం, ఆక్టోపస్ బృందంతో ఫైనల్ ఆపరేషన్ నిర్వహణ పూర్తి చేశామన్నారు. కేవలం 2 గం.ల వ్యవధిలో నేరస్తులను పట్టుకొన్న చిత్తూరు జిల్లా పోలీసులను అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారన్నారు. ప్రధాన నిందితుడైన సుబ్రహ్మణ్యం పై ఇప్పటికే రెండు హత్య కేసులు, రెండు దోపిడీ కేసులు ఉన్నాయన్నారు. దోపిడీ దొంగలు బుధవారం ఉదయం దాదాపు 5:30 గంటలకు, ఓమ్ని వాహనంలో డ్రైవర్‌తో సహా ఏడు మంది ముసుగు ధరించి చిత్తూరు పట్టణము, గాంధీ రోడ్ లోని పుష్ప కిడ్స్ షాపింగ్ వద్దకు చేరుకున్నారని తెలిపారు.. ఉదయం 6:40 గంటలకు, షాప్ యజమాని కె.చంద్రశేఖర్ భార్య శాంతి షాపును శుభ్రం చేయడానికి మెయిన్ ఎంట్రన్స్ తాళం తెరవగా, ఆ సమయంలో చిత్తూరు పట్టణంకు చెందిన సుబ్రహ్మణ్యం దుండగులతో రెండవ అంతస్తులోకి ప్రవేశించి ఆమెను బలవంతంగా అడ్డుకొని ఇంటిలోని వారికి తుపాకులు, కత్తులను చూపి ఇంటిలోని డబ్బు , నగలు ఇవ్వాలని బెదిరించారన్నారు. చంద్రశేఖర్ ప్రతిఘటించగా, నిందితులు అతనిపై దాడి చేశారని, ఈ దాడిలో తలకు, కుడి చేతికి తీవ్ర గాయాలు అయ్యి రక్తస్రావం జరిగిందన్నారు. బాధితులు సాయం కోసం కేకలు వేయడంతో, చుట్టుపక్కల ప్రజలు విని వెంటనే పోలీసులకు సమాచారం అందించారని, సమాచారం అందుకున్న కొన్ని నిమిషాలలో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారని తెలిపారు. పోలీసులను చూసిన నిందితులు పక్కన భవనాల మీదుగా తప్పించుకోడానికి ప్రయత్నించగా, సుబ్రహ్మణ్యం కాలికి గాయాలు అయ్యాయని, పోలీసులు ప్రజల సాయంతో నలుగురు నిందితులను అదుపులోనికి తీసుకున్నమని వివరించారు. తాను సంఘటనా స్థలికి చేరుకొని మిగిలిన నిందితుల కోసం భవనం అంతటా సెర్చ్ ఆపరేషన్ చేయించనని, అయితే నిందితులు పారిపోవడంతో వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. సాంకేతిక నైపుణ్యంతో dదోపిడిలో పాల్గొన్న మిగిలిన ముగ్గురు నిందితులు రాజశేఖర్, సంపత్ నెట్టికంటయ్య ను గురువారం మధ్యాహ్నం 12.30 గం.లకు కాణిపాకం క్రాస్ వద్ద రెండవ పట్టణ ఇన్స్పెక్టర్ నెట్టికంటయ్య,సిబ్బంది అదుపులోనికి తీసుకున్నారని వివరించారు. దోపిడీ దొంగలను పట్టుకోవడంలో అద్భుతమైన ధైర్యం మరియు కృషి చేసిన ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సమాజం పట్ల మీకు ఉన్న బాధ్యతాయుతమైన భావన, శక్తివంతమైన పోరాటం నిజంగా ప్రశంసనీయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేత ప్రశంసలు పొందేలా ఒకరోజు లోపే నిందితులు అందరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడానికి సాహసోపేతమైన విధులు నిర్వహించిన జిల్లా పోలీసులు అందరికి ప్రతేక కృతజ్ఞతలు తెలిపి, ప్రసంశాపత్రాలను అందచేశారు. కేసులో ప్రధాన నిందితుడు పసుపులేటి సుబ్రహ్మణ్యం కర్నూల్ జిల్లా, నంద్యాల పట్టణము, సాయిబాబా నగర్ కు చెందినన వారన్నారు. ఇతనిపై నంద్యాల పట్టణ పోలీస్ స్టేషన్ నందు 6 కేసులు ఉన్నాయని, నంద్యాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఒక దోపిడీ కేసు నమోదు కాగా, 10 సం. జైలు శిక్ష కూడా అనుభవించాడని తెలిపారు. ఇతను కొన్ని సంవత్సరాల క్రితం చిత్తూరు పట్టణము నందు స్థిరపడి, ఎస్ ఎల్ వి ఫర్నిచర్ అంగడిని నడుపుతున్నాడని పేర్కొన్నారు. ఎస్.ఇబ్రహీం ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన వాడని, చంగల్లు నవీన్ కుమార్ నం ద్యాల , దొమ్మర రామాంజనేయులు, దొమ్మర రాజశేఖర్, దొమ్మర నెట్టి కంటయ్య అనంతపురం జిల్లాకు చెందిన వారని, కుంచం సంపత్ కుమార్ కర్నూల్ జిల్లా, నంద్యాలకు చెందిన వారుగా వివరించారు. విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రాజశేఖర్ రాజు , ఏఆర్ అడిషనల్ ఎస్పీ నందకిషోర్, చిత్తూరు నగర డి.ఎస్.పి సాయినాథ్, సిఐలు జయరామయ్య, నెట్టికంటయ్య, శ్రీనివాసులు, భాస్కర్ మనోహర్ , ఉమామహేశ్వర్, నిత్య బాబు, ఏఆర్ డీ ఎస్పి మహబూబ్ బాషా, ఎస్సైలు ప్రసాద్, మల్లికార్జున, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
పో రై

