25, మార్చి 2025, మంగళవారం

మహిళల కుట్టు శిక్షణకు భారీ స్పందన

జిల్లాలో 5,000 వేల మంది దరఖాస్తు 

మండలానికి 500 మందికి శిక్షణ 

త్వరలో మండలాల్లో శిక్షణ కేంద్రాలు ప్రారంభం 

శిక్షణ అనంతరం ఉచితంగా కుట్టు మిషన్ 


ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు. 

 రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టైలరింగ్ మిషన్ చిన్న కార్యక్రమానికి చిత్తూరు జిల్లాలో భారీగా స్పందన వచ్చింది. ఈ పథకానికి జిల్లా నలుదిక్కుల ఐదువేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా మహిళలకు శిక్షణ కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. మండలానికి ఒక శిక్షణా కేంద్రం వంతున  32 మండలాల్లో 32 కుట్టు శిక్షణ  కేంద్రాలను ప్రారంభించనున్నారు. వీరికి 45 రోజుల నుంచి 90 రోజుల వరకు దుస్తులు కుట్టడంలో శిక్షణ ఇస్తారు. ఇందుకు  గ్రామీణ పట్టణ ప్రాంతంలో బిసి, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ  మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఇందుకు వయసు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. కుట్టడంలో శిక్షణ  అవసరమైన మహిళలు ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వీరికి శిక్షణలో ప్రాథమికంగా దుస్తులు  కొట్టడం గురించి నేర్పుతారు. ఈ కుట్టు శిక్షణ కేంద్రాలను వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ  డైరెక్టర్ పర్యవేక్షిస్తారు. మండలాల్లో, మున్సిపాలిటీలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.  మండల అభివృద్ధి అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. మీరు గ్రామ, వార్డు సెక్రటరీల సహకారం తీసుకుంటారు. ఈ శిక్షణలో 75 శాతం  హాజరు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.  శిక్షణ అనంతరం ప్రభుత్వం తరపున సర్టిఫికేట్ ను, కుట్టు మిషన్లను పంపిణీ చేస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా 1.02 లక్షల మంది మహిళలకు కుట్టు పై ఉచితంగా శిక్షణతోపాటు మిషన్లను అందించనున్నారు.  బీసీ, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, ఈబీసీ వర్గాలకు చెందిన మహిళల ఉపాధి కల్పనకుగాను ఈ నిర్ణయం తీసుకుకున్నారు. తొలుత  అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ  శిక్షణ ప్రారంభిమ్చాలని భావించారు. లబ్దిదారుల ఎంపిక ఆలస్యం కావడంతో త్వరలో ప్రారంభం కానున్నారు.  లబ్దిదారుల వీలుకు అనుగుణంగా 45 రోజుల నుంచి 90 రోజులపాటు శిక్షణ ఉంటుందన్నారు. తొలి విడతగా 46,044 మంది బీసీలకు, 56,788 మంది ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన మహిళలకు కుట్టుమిషన్లు అందించనున్నారు.  ఇందుకోసం ప్రభుత్వం రూ.255 కోట్లు వెచ్చిస్తోంది. మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసి అయ్యి ఉండాలి. ఆధార్ కార్డు కలిగి ఉండాలి. కుల దృవీకరణ పత్రం ఉండాలి. వయసు 20 సంవత్సరముల నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆదాయం సంవత్సరానికి గ్రామాల్లో 1.5 లక్షలు. పట్టణాల్లో 2 లక్షలకు మించరాదు. వితంతువులు, దివ్యాంగ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ట్రైనింగ్ తీసుకునే సమయంలో కచ్చితంగా 70% హాజరు ఉంటే కుట్టు మిషన్ ఇస్తారు. ప్రస్తుతం బిసి, ఆర్థికంగా ఎనుకబడిన కులాలకు చెందినవారు అర్హులు. కుటుంబ వివరాల ప్రాతిపదికన హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ డేటా ఆధారంగా తీసుకునే అవకాశం ఉంది. 26 జిల్లాలకు సంబంధించి 175 నియోజకవర్గాలలో ప్రస్తుతానికి మొదటి విడత కింద 60 నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలకు ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,000 అప్లికేషన్లు మాత్రమే తీసుకుంటారు. ఇందులో ఎంపిక చేసిన 500 అందికి శిక్షణ ఇచ్చి,  కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. నియోజకవర్గ స్థాయిలో 5 నుంచి 6 శిక్షణ కేంద్రాలలో ఈ శిక్షణ అనేది ఉంటుంది. ఒక శిక్షణ కేంద్రం 30 నుండి 50 మహిళలకు మిషన్ పై శిక్షణ ఇస్తారు. శిక్షణ వ్యవధి 45 రోజుల నుండి 90 రోజుల వరకు ఉంటుంది. ప్రతిరోజు శిక్షణ ఇచ్చే టైములో హాజరు వేస్తారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో 500 మందికి దుస్తులు కుట్టడంలో శిక్షణ ఇస్తారు. కుప్పం నియోజకవర్గంలో మాత్రం పరిమితి లేదు. ఎందరు దరఖాస్తు చేస్తే, అందరికి శిక్షణ ఇస్తారు. త్వరలోనే కుట్టు శిక్షణ కేంద్రాలను ఆయా నియోక వర్గాలలో శాసన సభ్యులు ప్రారంభిస్తారు. చిత్తూరు మున్సిపాలిటిలో మాత్రం మహిళా దినోత్సవం సందర్భంగా కుట్టు శిక్షణ ప్రారంభం అయ్యింది.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *