19, మార్చి 2025, బుధవారం

కుప్పంలో 18 లక్షల టన్నుల బంగారం నిల్వలు

గుడిపల్లి మండలంలో బంగారు గని 

బంగారు తవ్వకానికి ప్రభుత్వం అనుమతి 

ఏడాదిలో  బంగారు తవ్వకాలు ప్రారంభం

చిగురుకుంట 650 ఎకరాల భూములకేటాయింపు 

రూ. 500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎన్ఎండీసీ సిద్దం  


       తెలుగు దేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం బంగారుమయం కానుంది. కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం ‘చిగర్ గుంట- బిసనత్తమ్’ మధ్య బంగారు నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 18 లక్షల టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్లు అంచనా. అక్కడ బంగారును తవ్వుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి మంజూరు చేసింది. కర్ణాటక ప్రభుత్వానికి చెందిన హుట్టి గోల్డ్ మైన్స్ కంపెనీ 500 కోట్ల రూపాయల లీజుకు దరఖాస్తు చేసింది. పర్యావరణ అనుమతులు కూడా లభిస్తే సంవత్సరంలో బంగారు తవ్వకాలు ప్రారంభం కానున్నాయి. వేయికి పైగా యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.     

కర్నాటకకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ బంగారం తవ్వకాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. చిత్తూరు జిల్లాలో ఉన్న గనిలో ఏకంగా 18 లక్షల టన్నుల గోల్డ్ నిక్షేపాలు ఉన్నట్లు అంచనా వేశారు. ఈ గనిని రూ. 500 కోట్లు చెల్లించి లీజుకి తీసుకునేందుకు కర్ణాటక ప్రభుత్వానికి చెందిన హుట్టి గోల్డ్ మైన్స్ కంపెనీ సిద్ధమవుతోంది.  కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ మూసివేసినప్పటి నుంచి దేశంలో బంగారం ఉత్పత్తి అనేది దాదాపు ఆగిపోయింది. దీంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఏటా 800 నుంచి 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశం మనదే. అయితే దేశంలోని గనుల నుండి బంగారాన్ని ఉత్పత్తి చేసే దిశగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇనుప ఖనిజాలతో పాటు అరుదైన ఖనిజాల తవ్వకాలను చేపట్టే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ లిమిటెడ్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారం తవ్వకాలు చేపట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం గోల్డ్ మైనింగ్ మొదటి ప్రయత్నంలో భాగంగా రూ. 500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎన్ఎండీసీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఏపీలోని అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో బంగారం నిక్షేపాలు ఉన్నాయని చాలా కాలం క్రితమే గుర్తించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహా మరికొన్ని సంస్థలు సర్వే చేసి ఎక్కడెక్కడ, ఎంత మేర బంగారు ఖనిజ నిల్వలు ఉన్నాయనే దానిపై కీలక సమాచారాన్ని సేకరించాయి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలంలో ఉన్న ‘చిగర్ గుంట-బిసనత్తమ్’ బంగారు గనిలో 18 లక్షల టన్నుల బంగారు ఖనిజం ఉన్నట్లు అంచనా. ఒక్కో టన్ను నుంచి 5 గ్రాములకు పైగా బంగారం తీయవచ్చునని అంచనా వేసినట్లు సమాచారం. ఈ గనిలో తవ్వకాలు చేపట్టడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకాలు చేసింది ఎన్ఎండీసీ. ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతులు వంటి క్లియరెన్స్ తెచ్చుకోవడానికి ఎన్ఎండీసీ కంపెనీ ఒక కన్సల్టెంట్ ను నియమించాలని యోచిస్తుంది. కుప్పం దగ్గరలో కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ లో ఎన్నో ఏళ్లుగా బంగారం గనులను తవ్వుతున్నారు. రాయ్ చూర్ సమీపంలో కర్ణాటక ప్రభుత్వానికి చెందిన హుట్టి గోల్డ్ మైన్స్ కంపెనీ కూడా దేశంలోనే అతి పెద్ద బంగారు గనిని నిర్వహిస్తోంది. కుప్పం వద్ద ఉన్న చిగురుకుంట-బిసానత్తం గనుల్లో మరో 5 ఏళ్లలో బంగారాన్ని తవ్వడం ప్రారంభిస్తామని నేషనల్ మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ గనుల్లో తవ్వకాలు చేపట్టడం ద్వారా బంగారం ఉత్పత్తిలోకి ఎన్‌ఎండీసీ ప్రవేశిస్తోంది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌ఎండీసీ ప్రస్తుతం ఇనుము, వజ్రాలు వంటి వాటి తవ్వకాల్లో ఉంది. 1970లలో అంతర్జాతీయంగా దేశీయంగా బంగారానికి పెరిగిన డిమాండ్‌ దృష్ట్యా కొత్త నిక్షేపాల కోసం కేంద్ర ప్రభుత్వం అన్వేషణ చేపట్టింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో బంగారం నిల్వలు వేగంగా తరుగుతూ రావడం కూడా ఇందుకు మరొక కారణం. దాంతో బంగారం అన్వేషణకు పంచవర్ష ప్రణాళిక(1980-85)ను ప్రభుత్వం ప్రకటించింది. అలా చేపట్టిన అన్వేషణలో భాగంగా 1976లో తొలిసారి చిత్తూరులోని చిగురుకుంట వద్ద బంగారం నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాథమిక అంచనాకు వచ్చింది. చిగురుకుంటకు కోలార్‌కు మధ్య దూరం సుమారు 30 కిలోమీటర్లు. 3 కిలోమీటర్ల మేర పొడవు, ఒక కిలోమీటరు వెడల్పుతో విస్తరించి ఉన్న ఈ గనులను 5 బ్లాకులుగా విభజించారు. 1976-77 మధ్య చిగురుకుంటలో పరిశోధనలు చేసిన జీఎస్‌ఐ 7.56 లక్షల టన్నుల ముడి బంగారం ఉన్నట్లు గుర్తించింది. జీఎస్‌ఐ సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ 1982లో చిగురుకుంటలో ప్రయోగాత్మకంగా తవ్వకాలు ప్రారంభించింది. ప్రాథమికంగా జరిపిన తవ్వకాల్లో 10 లక్షల టన్నుల నిల్వలు ఉంటాయని ఎంఈసీఎల్ గుర్తించింది. ఒన్నపనాయని కొత్తూరు, తలై అగ్రహారం, నారలపల్లి వంటి గ్రామాలు చిగురుకుంట గనుల ప్రభావం పరిధిలోకి వస్తాయి. చిత్తూరు జిల్లాలోని పాత బిసానత్తం గనులు కేజీఎఫ్ గనులకు సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. 1894-98 మధ్య బిసానత్తం గనుల్లో తవ్వకాలు జరిగాయని ఎంఈసీఎల్ నివేదికలు చెబుతున్నాయి. 1894 నుంచి 1902 వరకు మైసూరు రీఫ్స్ గోల్డ్ మైనింగ్ కంపెనీ బంగారం తవ్వకాలు చేపట్టింది. 1894-98 మధ్య పాత బిసానత్తం గనుల్లో 9,618 టన్నుల ఖనిజం నుంచి సుమారు 140 కేజీల బంగారాన్ని వెలికి తీశారు. 1902 తరువాత పాత బిసానత్తం గనులు చేతులు మారుతూ పోయాయి. 1958 తరువాత వాటిల్లో తవ్వకాల గురించిన సమాచారం ఎక్కడా రికార్డు కాలేదు. 1980లలో భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్, ఎంఈసీఎల్ ఈ గనుల మీద పరిశోధనలతో పాటు ప్రయోగాత్మక తవ్వకాలు చేపట్టాయి. ఆ తరువాత బంగారం వెలికి తీయడం ప్రారంభించాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిగురుకుంట-బిసానత్తం గనుల నిర్వహణ బీజీఎంఎల్ చేతికి వెళ్లింది. 1990లలో మార్కెట్‌లో బంగారం ధర తక్కువగా ఉండటం, నిర్వహణ వ్యయం పెరగడం వంటి కారణాల వల్ల 2001లో బీజీఎంఎల్ కార్యకలాపాలను కేంద్రం నిలిపి వేసింది. దాంతో చిగురుకుంట-బిసానత్తం గనులు మూతపడ్డాయి. ఉపాధి, పరిహారం వంటి కారణాలతో బీజీఎంఎల్‌ కార్యకలాపాలను ఆపడాన్ని సవాలు చేస్తూ నాడు కార్మికులు కోర్టుకు వెళ్లారు. గనులను తిరిగి తెరచి బీజీఎంఎల్‌ కార్యకలాపాలను ప్రారంభిస్తామని 2006లో కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈలోపు బీజీఎంఎల్‌కు ఉన్న చిగురుకుంట-బిసానత్తం గనుల లైసెన్సు గడువు 2008లో ముగిసింది. బంగారం ధరలు పెరుగుతుండడంతో చిగురుకుంట బంగారం గనులను మళ్లీ ప్రారంభించాలని 2018లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఆ తరువాత జరిగిన బిడ్డింగ్ ప్రక్రియల్లో ఎన్‌ఎండీసీ టెండర్ దక్కించుకుంది. నాడు గనులను మూసే సమయానికి మార్కెట్‌లో గ్రాము బంగారం ధర 400 రూపాయలుగా ఉంది. ఆ లెక్కన చూస్తే నాడు బంగారం వెలికితీయడం వల్ల నష్టం వచ్చేది. కానీ నేడు గ్రాము బంగారం మార్కెట్‌లో 5,000 రూపాయలకు పైనే ఉంది. కాబట్టి ఇప్పుడు వెలికి తీయడం ఆర్థికంగా లాభంగా ఉంటుందిను భావిస్తున్నారు. 2022 అక్టోబరులో లెటర్ ఆఫ్ ఇంటెంట్ వచ్చింది. ప్రాజెక్ట్‌కు సంబంధించి అన్నిరకాల అనుమతులు తీసుకొని ఏడాదిలో  ప్రభుత్వంతో ఒప్పందాన్ని పూర్తి కావచ్చు. చిగురుకుంట-బిసానత్తం అనేది భూగర్భ గనిగా ఉంటుంది. ఇందులో 18.3 లక్షల టన్నుల బంగారం నిల్వలు ఉంటాయని అంచనా వేస్తున్నాం. ఇక్కడ టన్నుకు 5.15 గ్రాముల బంగారం దొరుకుతుంది. ఇక్కడ వెలికితీసిన ముడిబంగారాన్ని చిగురుకుంట వద్ద శుద్ధి చేస్తాం. అక్కడే బంగారం తయారవుతుంది. తొలుత ప్రస్తుతం ఉన్న సొరంగాలు, దారులను ఉపయోగించుకుని ముడి బంగారాన్ని వెలికి తీస్తారు. ఒప్పందం పూర్తయిన రెండేళ్లలో బంగారాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తారు. గనుల్లో ఉన్న నీటిని తొలగించడం, సొరంగాల లోపల వెలుతురు గాలి వచ్చేలా ఏర్పాట్లు చేయడం, యంత్రాలు సమకూర్చుకోవడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. ఈ గనుల నుంచి మొత్తం మీద సుమారు 7 టన్నుల బంగారాన్ని వెలికి తీయగలమని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎన్‌ఎండీసీ రూ.450 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు సమాచారం. చిగురుకుంట గనుల దగ్గర ఉన్న 650 ఎకరాల భూములను ఎన్ఎండీసీకి ఇప్పటికే   పలమనేరు మైన్స్ అధికారులు కేటాయించారు. చిగురుగుంట, బిసానత్తం పరిధిలోని 650 ఎకరాలను గోల్డ్ మైనింగ్ కోసం కేటాయించారు. బీజీఎంఎల్‌కు కేటాయించిన భూముల్లోనే ఎన్ఎండీసీ తవ్వకాలు కొనసాగిస్తుంది. అటవీ, పర్యావరణ అనుమతులు, ఎన్ఓసీ అన్ని సమర్పించిన తర్వాత వారికి లీజు గ్రాంట్ అవుతుంది. దీనికి ఎల్ఓఈ 2022లో జారీ చేశారు. కుప్పం బంగారం గనుల్లో మళ్లీ తవ్వకాలు జరగాలంటే ఆ ప్రాంతంలో ఉన్న 8 సొరంగ మార్గాల్లో పనిచేయగలిగిన టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బంది భారీగా అవసరం అవుతారు. ఆ లెక్కన సుమారు 3 వేల మందికి ఉపాధి దొరుకుతుందని అంచనా వేస్తున్నారు. గనుల చుట్టుపక్కల దాదాపు 20 గ్రామాలున్నాయి. ఇప్పటికే కుప్పం నియోజక వర్గం నుంచి పది వేల మంది యువకులు ఉపాధి కోసం నిత్యం బెంగళూరుకు రాకపోకలు సాగిస్తున్నారు. గనులు ప్రారంభమైతే మాలాంటి వారికి స్థానికంగానే ఉపాధి లభిస్తుంది. అంతే కాకుండా మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కుప్పంకు రాష్ట్రంలో ఒక గుర్తింపు వస్తుంది. మళ్లీ తవ్వకాలు ప్రారంభమైతే గ్రామ పంచాయతీలకు ఆదాయం పెరుగుతుంది. చిగురుకుంట-బిసానత్తం గనుల్లో తిరిగి తవ్వకాలు చేపట్టడం వల్ల స్థానికులకు ఉపాధి దొరికి, ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే సంవత్సరంలో అన్ని పనులూ పూర్తి చేసి బంగారం గని తవ్వకాలు ప్రారంభించాలని ఎన్ఎండీసీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. చైనా తర్వాత ఎక్కువగా బంగారాన్ని వినియోగిస్తున్న దేశం భారతదేశం. పండుగలు, పెళ్లిళ్లలో ఖచ్చితంగా బంగారం ఉండాల్సిందే. దిగుమతుల ద్వారా భారతదేశం 90 శాతం కంటే ఎక్కువ బంగారం డిమాండ్ ని దాటేసింది. 2021లో అత్యధికంగా 55.8 బిలియన్ డాలర్ల బంగారం లోహాన్ని ఇతర దేశాల నుండి దిగుమతి  ఇంపోర్ట్ చేసుకుంది. 2022లో 36.6 బిలియన్ డాలర్లు, 2023లో  దిగుమతి చేసుకున్న బంగారం విలువ సుమారు 35 బిలియన్ డాలర్లుగా ఉందిఅయితే, 2022-23లో దిగుమతులు 35 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2023-24లో 30 శాతం  పెరిగి 45.54 బిలియన్ డాలర్లకు చేరాయి. భారతదేశం బంగారం దిగుమతి చేసే ప్రధాన దేశాలు: స్విట్జర్లాండ్నుండి  40 శాతం,  యుఏఇ నుండి 16శాతం,  దక్షిణాఫ్రికా నుండి  10శాతం బంగారును దిగుమతి చేసుకుంటోంది. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *