జీడి నెల్లూరుకు వరాల జల్లు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గంగాధర నెల్లూరు పర్యటన శనివారం సరదా సరదాగా కొనసాగింది. ముఖ్యమంత్రి గంగాధర నెల్లూరు పర్యటనలో చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించారు. తన పర్యటనకు వచ్చిన యువకులను, విద్యార్థులను, ప్రజలను ఉత్సాహపరిచారు. వారితో కలిసి మెలిసి తిరుగుతూ వారితో ఫోటోలు దిగారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. రెండు కుటుంబాలకు ముఖ్య మంత్రి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఆ కుటుంబ సభ్యుల ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కల్లుగీత కార్మికుడు వాసు కుటుంబంలోని ఇద్దరు అనాధ పిల్లల విషయం ముఖ్యమంత్రిని కలిసి వేసింది. దీంతో ఆ ఇద్దరు అనాధ పిల్లల చదువు, పెంపకం పూర్తి బాధ్యతలను చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. ఒక్కొక్కరికి రెండు లక్షలు వంతెన ఫిక్స్డిడ్ పాజిట్ వేయనున్నట్లు తెలిపారు. వారి చదువుల ఖర్చులన్నీ కూడా తామే భరిస్తామన్నారు. వారికి ఉండడానికి ఇల్లు, ఉపాధికి పాడి ఆవులు అందజేస్తామని హామీ ఇచ్చారు. మరో పింఛన్దారు వసంతమ్మ ఇంటి పరిస్థితులు కూడా ముఖ్యమంత్రిని కదిలించాయి. ఆమెకు ఇంటి పట్టాను అందజేసి, వెంటనే ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఉన్న ఇల్లును కూడా రిపేరు చేసి ఇస్తామని, ఉపాధి కోసం పాడి ఆవులను అందజేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి వివిధ ప్రభుత్వ విభాగాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఒక్కొక్క స్టాల్ వద్ద జిల్లా అధికారులు, సిబ్బందితో విపులంగా మాట్లాడారు. వారు చేస్తున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులకు ఆస్తులను పంపిణీ చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో అమ్మలు జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పనులకు శంకుస్థాపన చేశారు. తొలత గంగాధర నెల్లూరుకి విచ్చేసిన ముఖ్యమంత్రికి హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, శాసనసభ్యులు, కార్యకర్తలు, జిల్లా అధికారులు, ప్రజలు భారీగా తరలివచ్చి చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికారు. పలువురు గులాబీ పూలను అందజేసి స్వాగతం పలుకుగా మరికొందరు శాలువాలను వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహూకరించారు. పలువురు ముఖ్యమంత్రితో కరచాలనం చేయడానికి ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి ఎవరితోనూ కరచాలను చేయకుండా నమస్కారంతో సరిపెట్టారు. గంగాధర నెల్లూరు హరిజన వాడుకు వచ్చిన ముఖ్యమంత్రితో విద్యార్థులు, బాలికలు ఫోటోలు తీసుకోవడానికి పోటీలు పడ్డారు. వారిని సాదరంగా పలకరించి ముఖ్యమంత్రి వారితో ఫోటోలు దిగారు. కొందరు సెల్ఫీ కూడా తీసుకున్నారు. చిన్నపిల్లలను ఎత్తుకొని వారిని బు. వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పించన్ అందుతుందా అంటూ వృద్ధులను ఆరా తీశారు. జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ మాట్లాడుతుండగా చంద్రబాబు నాయుడును దేవుడుగా, కోహినీరు వజ్రంగా పోల్చారు. దీంతో చంద్రబాబు చిరునవ్వులు చిందించారు. థామస్ కోరిక మేరకు నియోజకవర్గంలోని రెండువేల ఎకరాలలో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రజల కరతాల ధ్యానుల మధ్య ప్రకటించారు. అలాగే గంగాధర నెల్లూరులో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని, నియోజకవర్గ అభివృద్ధిని చేయడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 30 సంవత్సరాల తర్వాత గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించడం పట్ల చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని అభ్యర్థిగా థామస్ ను ప్రకటించామని, ప్రజలు కూడా భారీ మద్దతుతో గెలిపించారని అన్నారు. వ్యాపారం అంటూ అటు ఇటు తిరగకుండా నియోజకవర్గంలో ఉండి ,అభివృద్ధికి కృషి చేయాల్సిందిగా కోరారు. అనుచరులను కూడా అదుపులో పెట్టుకోవాల్సిందిగా చురక అంటించారు. జిల్లా ప్రజల చిరకాల వాంఛిన మామిడి బోర్డ్ ఏర్పాటు పరిశీలనలో ఉన్నట్లు వెల్లడించారు. మొత్తం మీద ముఖ్యమైన నారా చంద్రబాబు నాయుడు పర్యటన గంగాధర నెల్లూరులో చలాకీగా, సరదాగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కొనసాగింది.