13, మార్చి 2025, గురువారం

నిరుద్యోగ యువతకు వరం పిఎం ఇంటర్న్‌షిప్‌ పథకం

వన్ టైమ్ గ్రాంట్ కింద రూ. 6 వేలు, నెలకు రూ.5 వేల  స్టైఫండ్

దేశంలోని టాప్​ 500 కంపెనీల్లో పనిచేసే అవకాశం 

ఎస్ ఎస్ సి, ఐటీఐ, పాలిటెక్నిక్ చదివిన ఒకే 

బి.ఎస్సీ, బి.కాం, బిసిఎ, బిబిఎ, బీఫార్మసీ విద్యార్థులకు కూడా 

ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు. 

 యువతకు నైపుణ్యాలు నేర్పించి, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌షిప్‌ పథకాన్ని  ప్రారంభించింది. ఈ స్కీమ్​కు ఎంపికైన అభ్యర్థులకు వివిధ రంగాల్లో ఏడాది పాటు ఇంటర్న్​షిప్ కల్పిస్తారు. దీంతో పాటు వన్ టైమ్ గ్రాంట్ కింద రూ. 6,000 ఇంకా నెలకు రూ.5,000 స్టైఫండ్ కూడా చెల్లిస్తారు. యువతకి నైపుణ్యాలను అందించడానికి ఈ స్కీమ్  వచ్చే రెండేళ్లలో 30 లక్షల మందికి నైపుణ్యాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్వాత ఐదేళ్లలో మొత్తం కోటి మంది యువతకు నైపుణ్యాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానమంత్రి ఇంటర్న్​షిప్​ స్కీమ్  దేశంలోని టాప్​ 500 కంపెనీల్లో కోటి మంది నిరుద్యోగ యువతకి ఉపాది నైపుణ్యాలను కల్పించడం  లక్ష్యం. 


ప్రధానమంత్రి ఇంటర్న్​షిప్​ స్కీమ్​ అప్లై చేయడానికి  21-24 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న ప్రతి భారతీయుడు ఈ స్కీమ్​కు అప్లై చేసుకోవచ్చు. అలాగే అభ్యర్థులు ఎస్ ఎస్ సి, ఐటీఐ, పాలిటెక్నిక్​ లేదా బి.ఎస్సీ, బి.కాం, బిసిఎ, బిబిఎ లేదా బీఫార్మసీ వంటి గ్రాడ్యుయేషన్​ డిగ్రీలు పూర్తి చేసి ఉండాలి. ఇంటర్న్​షిప్​ స్కీమ్​ అప్లై చేయడానికి  ఎంబీఏ, ఎంబీబీఎస్, పీహెచ్‌డీ, సీఏ, సీఎంఏ, సీఎస్ వంటి అర్హతలు కలిగినవారు అనర్హులు. ఇంకా ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి గ్రాడ్యుయేషన్​ పూర్తి చేసిన వారు కూడా అనర్హులు. ఎటువంటి పర్మనెంట్ ఉద్యోగం చేస్తుండకూడదు. ఈ స్కీమ్​కు అప్లై చేసుకునే వారి వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు మించకూడదు. అలాగే ఫ్యామిలీలో ఎవరికీ కూడా శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. అలాగే ఇంకా ఏదైనా కోర్సు చదువుతున్నవారు కూడా అప్లై చేయడానికి అనర్హులు. ఈ స్కీమ్​లో చేరడానికి రిజర్వేషన్ నిబంధనలు లేవు. కానీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు ఇలా అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించేలా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఇంటర్న్​షిప్ ​కోసం అభ్యర్థులను  ముందుగా పీఎం ఇంటర్న్​షిప్​ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత వారి వివరాలను నమోదు చేయాలి. వారి అర్హతలకు అనుగుణంగా వివిధ కంపెనీల్లో ఇంటర్న్​షిప్ కోర్సులు​ చేయడానికి నమోదు చేసుకోవాలి. తర్వాత కంపెనీలు అభ్యర్థులను షార్ట్​లిస్ట్​ చేసి ఎంపిక చేస్తాయి. ఇంటర్న్​షిప్​  స్కీమ్​కు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరం పాటు ఇంటర్న్​షిప్​ ఉంటుంది. అప్లై చేసుకోవడానికి  ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్లు, పాస్​పోర్ట్​ సైజ్​ ఫొటో అవసరం. రిజిస్ట్రేషన్​ సమయంలో ఇతర డాక్యుమెంట్లు ఏమి అవసరం లేదు. ఒక అభ్యర్థి  విద్యా అర్హతల ఆధారంగా 5 ఇంటర్న్​షిప్​ కోర్సులకు అప్లై చేసుకోవచ్చు. అయితే, మీరు అప్లికేషన్​ సబ్మిట్​ చేసే ముందు ఐదు ప్రాధాన్యతలను ఎన్ని సార్లైనా మార్చుకోవచ్చు. ఒక్కసారి సబ్మిట్​ చేసిన తర్వాత ఎలాంటి మార్పుల చేసుకోవడానికి వీలుండదు.  అభ్యర్థులకు నచ్చిన ఐదు ఇంటర్న్​షిప్​ కోర్సుల్లో దేనికీ సెలక్ట్​ కాకపోతే  అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠంగా ఒక అభ్యర్థికి  రెండు ఇంటర్న్​షిప్​ ఆఫర్లు వస్తాయి. షార్ట్​లిస్ట్ అయిన వారి ఆఫర్ లెటర్ పీఎం ఇంటర్న్​షిప్ పోర్టల్లో అప్​లోడ్ చేస్తారు. అలాగే ఈమెయిల్​ ద్వారా మెసేజ్​ వస్తుంది. ఎంపికైనవారికి ప్రతినెలకు రూ.5000 ఆర్థిక సహాయం అందిస్తారు. దీనికి అదనంగా అభ్యర్థులు చేరిన తర్వాత రూ.6000 వన్ టైమ్​ గ్రాంట్ ఇస్తారు. అభ్యర్థి ఆధార్​ కార్డ్​కు లింక్​ చేసిన బ్యాంక్​ అకౌంట్​లో ఈ డబ్బులు జమ అవుతాయి. ఈ ఇంటర్న్​షిప్​ కాలంలో అభ్యర్థులకు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద బీమా కవరేజీ ఉంటుంది.  ఇంటర్న్​షిప్​ ద్వారా  ఐటీ అండ్ సాఫ్ట్​వేర్ డెవలప్మెంట్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆయిల్, గ్యాస్ అండ్ ఎనర్జీ, మెటల్స్ అండ్ మైనింగ్, ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్), టెలికాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్​స్ట్రక్షన్, రిటైల్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్, ఆటో మోటివ్, ఫార్మాస్యూటికల్, ఏవియేషన్ అండ్ డిఫెన్స్, మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియస్ట్రిల్, కెమికల్, మీడియా, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ తదితర విభాగాల్లో ఇంటర్న్​షిప్​ లభిస్తాయి. అగ్రికల్చర్ అండ్ అలైడ్, కన్సల్టింగ్ సర్వీసెస్, టెక్స్​టైల్​ మాన్యుఫ్యాక్చరింగ్, జెమ్స్అండ్ జువెలరీ, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ, హెల్త్​ కేర్. ఇంటర్న్​షిప్​ సమయంలో 6 నెలలు శిక్షణ తరగతులు, 6 నెలలు ప్రాక్టికల్​ ట్రైనింగ్ ఉంటుంది. ఇంటర్న్​షిప్​ ​ పూర్తి చేస్తే ఉద్యోగం గ్యారంటీ అని ఉండదు. కానీ, ఇంటర్న్​షిప్​ ద్వారా అభ్యర్థుల చాలా నైపుణ్యాలను సంపాదించుకుంటారు. దీనివల్ల వివిధ అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు.  


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *