1, మార్చి 2025, శనివారం

పెన్షన్ లబ్ధిదారుడికి ఆపన్న హస్తం...



 నేనున్నానంటూ భరోసా కల్పించిన   ముఖ్యమంత్రి..

చిత్తూరు, మార్చి1, (ఆంధ్రప్రభ బ్యూరో)
 చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీల భాగంగా  పెన్షన్ లబ్ధిదారుడు, కల్లు గీత కార్మికుడు వాసుకు పెన్షన్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా పింఛన్దారుడు వాసు భార్య సెల్వి మాట్లాడుతూ మా మనవరాళ్లు రక్షిత (5 వతరగతి), హేమ శ్రీ (3వ తరగతి) లకు తల్లిదండ్రులు లేరన్నారు. తన కూతురికి వివాహమైందని, ఇద్దరు బిడ్డలు జన్మించిన తర్వాత ఆమె మరొకరితో వెళ్లిపోయిందన్నారు. అలాగే అల్లుడు కూడా మరో మహిళతో వెళ్లిపోయాడని, తన మనవరాళ్ళు ఇద్దరు అనాధలుగా మిగిలారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిద్దరిని తానే దగ్గరుండి చూసుకుంటున్నానని, తల్లిదండ్రులు లేని అనాధలైన ఆ ఇద్దరు బిడ్డలను ఆదుకోవాలని అభ్యర్థించారు. కూలీ నాలి చేస్తూ తానే ఇద్దరు బిడ్డల ఆలలాపాలన చూస్తున్నారని చెప్పారు. వారిని చదివించాలని, ఇందుకు సాయం చేయాలని కోరారు. మాకు సొంతం ఇల్లు లేదని, ఇల్లు మంజూరు చేయాలని అభ్యర్థించారు. మా జీవనోపాధి నిమిత్తం ఆవుల పెంపకంనకు ఆర్థిక సాయం చేయాలని  పెన్షన్ లబ్ధిదారుడి భార్య సెల్వీ ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. వారి పరిస్థితిని చూసి వారికి సాయం  అందిస్తామని భరోసా కల్పించారు. ఇద్దరు ఆడపిల్లలకు
ఒక్కొక్కరికి రెండు లక్షలు చొప్పున, మిషన్ వాత్సల్య పథకం కింద ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ.4వేలు చొప్పున ఇద్దరూ ఆడపిల్లలకు మొత్తం రూ.8 వేలు 18 సం.రాలు నిండే వరకు, వారి బ్యాంకు ఖాతాలకు జమ అయ్యేలా ఆర్థిక సాయం అందించేలా, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన  పత్రాలను లబ్ధిదారులకు  అందజేశారు. అనంతరం
పెన్షన్ లబ్ధిదారురాలు వసంతమ్మకు పెన్షన్ అందచేశారు. ఈ సందర్భంగా వసంతమ్మ మాట్లాడుతూ తాము చాలా పేదవాళ్లమని ఉండడానికి ఇల్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలాంటి జీవన ఆధారము లేదని, తనకు ముగ్గురు పిల్లలని, పిల్లలను చదివించుకోవడం కూడా కష్టమవుతుందని కన్నీరు పెట్టుకున్నారు. భర్త మేస్త్రి పని చేస్తారని తెలిపారు. అమ్మాయి చదువుకు 50వేల రూపాయలను అందజేస్తే సరిపోతుంది వారిని చంద్రబాబు నాయుడు అడిగారు. ప్రభుత్వ వసతి గృహంలో పెట్టి చదివించాల్సిందిగా జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. ఉండడానికి మూడు సెంట్లతో ఇంటి పట్టాను ఇచ్చి,   ఇంటిని కట్టిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న ఇంటిని కూడా రిపేరు చేసి ఇస్తామన్నారు. జీవనాపాధికి రెండు రావులను పట్టిస్తామని చెప్పారు. దీంతో పట్టరాని ఆనందంతో ఆ కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడుకు పాదాభివందనం చేశారు. అనంతరం  ప్రజలకు అభివాదం చేస్తూ హరిజన వాడలో ఏర్పాటుచేసిన స్టాల్స్ ను పరిశీలించేందుకు స్టాల్స్ వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నాయకుడు,ప్రియతమ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  తమ ఊరికి విచ్చేసారన్నా సంతోషం, పండుగ వాతావరణం ను తలపిస్తూ.. మహిళలు పిల్లలు, పెద్దలు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్వాగతం పలికారు.  విద్యార్థులు, పిల్లలు, పెద్దలు చంద్రబాబునాయుడుతో ఫోటోలు దిగడానికి పోటీలు పడ్డారు. ఒక పసికందును ఎత్తుకొని చంద్రబాబు నాయుడు ఫోటో దిగారు.  చంద్రబాబు నాయుడు చిరు మందహాసంతో పిల్లలందరినీ ఫోటోకు అనుమతించారు. వారిని పలకరిస్తూ వారితో ఫోటోలు దిగారు. మధ్యలో పాస్టర్లు చంద్రబాబునాయుడును ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి,చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గు మళ్ళ ప్రసాదరావు, ప్రభుత్వ విప్, జీడీ నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ వి.ఎం థామస్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జెసి విధ్యాధరి సంబంధిత అధికారులు ఉన్నారు.

-

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *