21, ఏప్రిల్ 2026, మంగళవారం

పంచాయతీ ఎన్నికలకు ఓటర్ల తుది జాబితా ప్రకటన


జిల్లాలోని 623 గ్రామపంచాయతీలలో 5,914 వార్డులు 

5,07,703 మంది పురుష, 5,19,091 మంది మహిళా ఓటర్లు 

27 ఇతర ఓటర్లతో కలిపి మొత్తం 10,26,821 మంది ఓటర్లు 

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

గ్రామపంచాయతీ ఎన్నికల నిమిత్తం చిత్తూరు జిల్లా పంచాయతీ అధికారులు జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాలను విడుదల చేశారు. ఈ మేరకు పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను సంబంధిత సచివాలయాలలో ప్రదర్శించారు. జిల్లాలోని 27 మండలాల్లో  623 గ్రామపంచాయతీలు, 5,914 వార్డులు ఉన్నాయి. వీటిల్లో  5,07,703 మంది పురుషులు, 5,19,091 మంది మహిళలు, 27 ఇతర ఓటర్లతో కలిపి మొత్తం 10,26,821 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి మహిళా ఓటర్లు, పురుష ఓటర్లతో పాటు ఇతర ఓటర్లను కూడా ప్రకటించారు. ఇతర ఓటర్లు జిల్లాలో 27 మంది ఉన్నారు.

మండలాల వారీగా వివరాలను పరిశీలిస్తే బంగారుపాలెం మండలంలో 41 గ్రామపంచాయతీలు, 376 వార్డులు ఉండగా 29,280 మంది పురుష ఓటర్లు, 30,564 మంది మహిళా ఓటర్లు, 1 ఇతర ఓటరుతో కలిపి మొత్తం 59,845 మంది ఓటర్లు ఉన్నారు. చిత్తూరు మండలంలో 17 గ్రామపంచాయతీలు, 152 వార్డులు ఉండగా 11,825 మంది పురుషులు, 12,247 మంది మహిళలు కలిపి మొత్తం 24,072 మంది ఓటర్లు ఉన్నారు. గంగాధర నెల్లూరు మండలంలో 32 గ్రామపంచాయతీలు, 310 వార్డులు ఉండగా 27,102 మంది పురుషులు, 27,381 మంది మహిళలు, 1 ఇతర ఓటరుతో కలిపి మొత్తం 54,484 మంది ఓటర్లు ఉన్నారు. గుడిపాల మండలంలో 27 గ్రామపంచాయతీలు, 240 వార్డులు ఉండగా 16,912 మంది పురుషులు, 17,496 మంది మహిళలు, 2 ఇతరులతో కలిపి మొత్తం 34,410 మంది ఓటర్లు ఉన్నారు. ఐరాల మండలంలో 28 గ్రామపంచాయతీలు, 256 వార్డులు ఉండగా 20,364 మంది పురుషులు, 20,902 మంది మహిళలు కలిపి మొత్తం 41,266 మంది ఓటర్లు ఉన్నారు. పెనుమూరు మండలంలో 26 గ్రామపంచాయతీలు, 234 వార్డులు ఉండగా 16,198 మంది పురుషులు, 16,456 మంది మహిళలు, 2 ఇతరులతో కలిపి మొత్తం 32,656 మంది ఓటర్లు ఉన్నారు. పులిచెర్ల మండలంలో 25 గ్రామపంచాయతీలు, 222 వార్డులు ఉండగా 15,693 మంది పురుషులు, 16,330 మంది మహిళలు, 2 ఇతరులతో కలిపి మొత్తం 32,025 మంది ఓటర్లు ఉన్నారు. పూతలపట్టు మండలంలో 25 గ్రామపంచాయతీలు, 228 వార్డులు ఉండగా 17,861 మంది పురుషులు, 18,524 మంది మహిళలు, 1 ఇతర ఓటరుతో కలిపి మొత్తం 36,386 మంది ఓటర్లు ఉన్నారు. రొంపిచెర్ల మండలంలో 11 గ్రామపంచాయతీలు, 104 వార్డులు ఉండగా 10,995 మంది పురుషులు, 11,546 మంది మహిళలు కలిపి మొత్తం 22,541 మంది ఓటర్లు ఉన్నారు. శ్రీరంగరాజపురం మండలంలో 23 గ్రామపంచాయతీలు, 214 వార్డులు ఉండగా 14,561 మంది పురుషులు, 14,884 మంది మహిళలు, 1 ఇతర ఓటరుతో కలిపి మొత్తం 29,446 మంది ఓటర్లు ఉన్నారు. తవనంపల్లె మండలంలో 32 గ్రామపంచాయతీలు, 290 వార్డులు ఉండగా 21,113 మంది పురుషులు, 22,094 మంది మహిళలు, 2 ఇతరులతో కలిపి మొత్తం 43,209 మంది ఓటర్లు ఉన్నారు. వెదురుకుప్పం మండలంలో 25 గ్రామపంచాయతీలు, 230 వార్డులు ఉండగా 18,368 మంది పురుషులు, 18,232 మంది మహిళలు, 1 ఇతర ఓటరుతో కలిపి మొత్తం 36,601 మంది ఓటర్లు ఉన్నారు. యాదమరి మండలంలో 26 గ్రామపంచాయతీలు, 246 వార్డులు ఉండగా 18,946 మంది పురుషులు, 19,004 మంది మహిళలు, 2 ఇతరులతో కలిపి మొత్తం 37,952 మంది ఓటర్లు ఉన్నారు. గుడుపల్లె మండలంలో 18 గ్రామపంచాయతీలు, 192 వార్డులు ఉండగా 17,824 మంది పురుషులు, 17,714 మంది మహిళలు, 1 ఇతర ఓటరుతో కలిపి మొత్తం 35,539 మంది ఓటర్లు ఉన్నారు. కుప్పం మండలంలో 29 గ్రామపంచాయతీలు, 296 వార్డులు ఉండగా 29,355 మంది పురుషులు, 29,000 మంది మహిళలు, 8 ఇతరులతో కలిపి మొత్తం 58,363 మంది ఓటర్లు ఉన్నారు. రామకుప్పం మండలంలో 23 గ్రామపంచాయతీలు, 230 వార్డులు ఉండగా 23,191 మంది పురుషులు, 23,443 మంది మహిళలు, 1 ఇతర ఓటరుతో కలిపి మొత్తం 46,635 మంది ఓటర్లు ఉన్నారు. శాంతిపురం మండలంలో 23 గ్రామపంచాయతీలు, 242 వార్డులు ఉండగా 24,286 మంది పురుషులు, 24,064 మంది మహిళలు కలిపి మొత్తం 48,350 మంది ఓటర్లు ఉన్నారు. కార్వేటినగరం మండలంలో 22 గ్రామపంచాయతీలు, 204 వార్డులు ఉండగా 17,433 మంది పురుషులు, 18,085 మంది మహిళలు, 1 ఇతర ఓటరుతో కలిపి మొత్తం 35,519 మంది ఓటర్లు ఉన్నారు. నగరి మండలంలో 21 గ్రామపంచాయతీలు, 188 వార్డులు ఉండగా 12,670 మంది పురుషులు, 13,673 మంది మహిళలు కలిపి మొత్తం 26,343 మంది ఓటర్లు ఉన్నారు. నిండ్ర మండలంలో 21 గ్రామపంచాయతీలు, 182 వార్డులు ఉండగా 10,475 మంది పురుషులు, 11,290 మంది మహిళలు కలిపి మొత్తం 21,765 మంది ఓటర్లు ఉన్నారు. పాలసముద్రం మండలంలో 13 గ్రామపంచాయతీలు, 116 వార్డులు ఉండగా 8,903 మంది పురుషులు, 9,127 మంది మహిళలు కలిపి మొత్తం 18,030 మంది ఓటర్లు ఉన్నారు. విజయపురం మండలంలో 25 గ్రామపంచాయతీలు, 206 వార్డులు ఉండగా 10,839 మంది పురుషులు, 11,474 మంది మహిళలు కలిపి మొత్తం 22,313 మంది ఓటర్లు ఉన్నారు. బైరెడ్డిపల్లె మండలంలో 21 గ్రామపంచాయతీలు, 216 వార్డులు ఉండగా 21,990 మంది పురుషులు, 21,964 మంది మహిళలు కలిపి మొత్తం 43,954 మంది ఓటర్లు ఉన్నారు. గంగవరం మండలంలో 16 గ్రామపంచాయతీలు, 178 వార్డులు ఉండగా 21,880 మంది పురుషులు, 22,363 మంది మహిళలు కలిపి మొత్తం 44,243 మంది ఓటర్లు ఉన్నారు. పలమనేరు మండలంలో 10 గ్రామపంచాయతీలు, 106 వార్డులు ఉండగా 11,849 మంది పురుషులు, 12,068 మంది మహిళలు కలిపి మొత్తం 23,917 మంది ఓటర్లు ఉన్నారు. పెద్దపంజాణి మండలంలో 25 గ్రామపంచాయతీలు, 248 వార్డులు ఉండగా 22,412 మంది పురుషులు, 22,872 మంది మహిళలు కలిపి మొత్తం 45,284 మంది ఓటర్లు ఉన్నారు. వెంకటగిరికోట మండలంలో 18 గ్రామపంచాయతీలు, 208 వార్డులు ఉండగా 35,378 మంది పురుషులు, 36,294 మంది మహిళలు, 1 ఇతర ఓటరుతో కలిపి మొత్తం 71,673 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం జిల్లాలో 623 గ్రామపంచాయతీలు, 5,914 వార్డులు ఉండగా 5,07,703 మంది పురుషులు, 5,19,091 మంది మహిళలు, 27 ఇతర ఓటర్లతో కలిపి మొత్తం 10,26,821 మంది ఓటర్లు ఉన్నట్లు జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రావు వెల్లడించారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *