27, జనవరి 2025, సోమవారం

పదో తరగతి విద్యార్థులకు వందరోజుల ప్రత్యేక తరగతులు

ఆదివారం, సెలవు రోజుల్లో కూడా బోధనా తరగతులు 

విద్యార్థులకు ఆదివారం కూడా మధ్యాహ్నం భోజనం 

100 శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా బోధన 

ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో ప్రత్యేక తరగతులు



(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

మార్చి నెలలో జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 100 శాతం  ఫలితాలను సాధించడానికి  100 రోజుల కార్యాచరణ ప్రణాళికను విద్యాశాఖ అధికారులు అమలు చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థులలో  పబ్లిక్  పరీక్షల భయాన్ని తగ్గించడానికి,  వారిలో  ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి  ఎస్సిఇఆర్టి 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.  మార్చి పరీక్షల కోసం ఫోకస్డ్, సమర్థవంతమైన ప్రిపరేషన్‌ కోసం  ఈ ప్లాన్ రూపొందించారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక విద్యార్థులు ఎంతగానో ఉపయోగపడుతుంది. కార్యాచరణ ప్రణాళిక ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థుల మీద  వ్యక్తిగత శ్రద్ధ పెడుతారు. ఇందువల్ల  నెమ్మదిగా నేర్చుకునేవారిని పరిక్షలకు తాయారు చేయడానికి ఉపాధ్యాయులకు తగినంత సమయం ఉంటుంది. ప్రణాళికా అమలుకు  అదనపు తరగతులను నిర్వహిస్తారు.  సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయడానికి,  ప్రశ్నలను రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడానికి, అదనపు తరగతులు ఉపయోగపడుతాయి. 

  చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 15, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉన్నత పాఠశాలలు 291, మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 10, రెసిడెన్సియల్  పాఠశాలలో 18, ఏపిఎంఎస్ పాఠశాలలు 7, కేజీబీవీ పాఠశాలలు 8  నడుస్తున్నాయి.  సాధారణ పని దినాలలో పదవ తరగతి విద్యార్థులకు ఉదయ ఎనిమిది గంటలకి పాఠశాలలు  ప్రారంభమవుతాయి. వీరు సాయంకాలం ఐదు గంటల వరకు పాఠశాలల్లో ఉండాల్సి ఉంటుంది. అలాగే ఆదివారం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 12 15 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 1.15 నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు ప్రత్యేక తరగతులు జరుగుతాయి. పదవ తరగతి విద్యార్థులకు ఈ సందర్భంగా ఆదివారం కూడా మధ్యాహ్నం భోజనాన్ని అందచేస్తారు. రెండవ శనివారం సెలవు రోజుల్లో కూడా ప్రత్యేక బోధన కార్యక్రమం కొనసాగుతుంది.  ఈ  విధానం విద్యార్థులకు పరీక్షలు అంటే ఉన్న భయం పోగొట్టడానికి, మంచి పనితీరు కనబరిచి, ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు సహాయపడుతుంది. ఆదివారంతో సహా రోజు తరగతి పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థుల పనితీరు విశ్లేషణ ఆధారంగా ఉపాధ్యాయులు మరింత మెరుగ్గా బోధన చేయవచ్చు. పబ్లిక్ పరిక్షల వలే  ప్రీ-ఫైనల్, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. దీంతో  విద్యార్థులకు వాస్తవ పరీక్షల వాతావరణంతో అలవాటు అవుతారు.  ఈ పరీక్షలు సాధారణ పరీక్షల డైరెక్టర్ విడుదల చేసిన బ్లూప్రింట్ ప్రకారం నిర్వహిస్టారు. ఇందువల్ల  పర్యవేక్షణ, జవాబుదారీతనం పెరుతుంది. జిల్లా, మండల అధికారులు అన్ని పాఠశాలల్లో ఈ కార్యాచరణ ప్రణాళిక అమలు, పురోగతిని పర్యవేక్షిస్తారు.  సబ్జెక్ట్ టీచర్లు వెరిఫికేషన్ కోసం మూల్యాంకనం చేసిన స్క్రిప్ట్‌లు, మార్కులతో సహా రికార్డులను నిర్వహించాలి. ఈ కార్యాచరణ ప్రణాళిక విజయవంతం కావడానికి, ప్రభుత్వ నిర్వహణలోని అన్ని పాఠశాలలలో ఈ విధానం అమలు చేస్తారు. ఉపాధ్యాయులు, నిర్వాహకులు మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని,  పబ్లిక్  పరీక్షలలో 100 శాతం  ఫలితాలను సాధించాలని నిర్దేశించారు. అందరు సబ్జెక్ట్ టీచర్లు ఈ టైమ్‌లో స్లిప్ టెస్ట్‌లను నిర్వహించాలి. ఈ పరీక్షలను తప్పనిసరిగా మూల్యాంకనం చేసి తప్పో ఒప్పులను విద్యార్థులతో చర్చించాలి.  ఉపాధ్యాయులు మునుపటి రోజు స్లిప్ పరీక్ష జవాబు పత్రాలను విశ్లేషించాలి.  ఈ సెషన్‌లో నెమ్మదిగా నేర్చుకునేవారికి  అసైన్‌మెంట్‌లు ఉంటాయి.  ఈ కార్యాచరణ ప్రణాళికను సజావుగా అమలు చేయడానికి ప్రధానోపాధ్యాయులు  బాధ్యులుగా చేశారు.  అన్ని తరగతులు సమానంగా, ఇతర తరగతులకు ఎటువంటి అంతరాయాలు లేకుండా సాధారణ పాఠశాల టైమ్‌టేబుల్‌కు అవసరమైన సర్దుబాట్లు చేయాలి.  ఆదివారం తరగతులను అవసరమైన అన్ని జాగ్రత్తలతో నిర్వహించాలి.  బాలికల భద్రతకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.  విద్యార్థులందరూ వెళ్ళే వరకు సబ్జెక్టు టీచర్లు ఉండాలి. ఆదివారం మధ్యాహ్న భోజనం,   పిల్లల భద్రతకు సంబంధించిన ఏర్పాట్ల కోసం పూర్తి షెడ్యూల్‌ను తల్లిదండ్రులకు ముందుగానే తెలియజేయాలి. 

పో రై గంగ 1 విద్యార్థులు 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *