20, జనవరి 2025, సోమవారం

ప్రాణాంతక వ్యాధుల నుంచి ప్రజలను రక్షించే టీకాలు

నేడు జాతీయ టీకా దినోత్సవం 

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.) 

తల్లిపాలు ద్వారా పిల్లలకు కావాల్సినంత రోగనిరోధక శక్తి సరైన స్థాయిలో అందదు. ఆ సమయంలో పిల్లలు ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. వివిధ ఆరోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెడతాయి. కొన్నిసార్లు వైకల్యం కూడా వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సమస్యలను నిరోధించి.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యాంటిజెన్​లను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్​లు చాలా హెల్ప్ చేసి.. పిల్లలను రక్షిస్తాయి. ఇవి వారి ఎదుగుదలకు సహాయం చేసి  జీవితకాలం మొత్తం రక్షణ కల్పిస్తాయి. అలాగే అంటు వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి టీకాలు చాలా అవసరం. పలు వైరస్​లు, బ్యాక్టీరియా దరి చేరకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో వ్యాక్సిన్స్ హెల్ప్ చేస్తాయి. తద్వార అంటు వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. శిశువులు, వృద్ధుల్లో, రోగనిరోధక శక్తి లేని వారిని వివిధ వ్యాధులను నుంచి రక్షించడంలో వ్యాక్సిన్స్ దోహదం చేస్తాయి. పైగా వ్యాక్సినేషన్ అనేది చవకైన ప్రజారోగ్య చర్య. ఇది ప్రాణాలను కాపాడుతుంది. అంటువ్యాధుల వల్ల కలిగే దీర్ఘకాలిక ఆరోగ్య పరిణామాలను నివారిస్తుంది. ఈ మహత్తర కార్యక్రమంతో దేశం నుంచి పోలియోను నిర్మూలించగలిగాము. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2014లో పోలియో రహితం దేశంగా భారతదేశాన్ని ప్రకటించింది. ఎందరో ప్రాణాలు తీసిన మసూచిని అరికట్టడం మొదల్కోని, అందరినీ ఇంట్లో కూర్చోబెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకునేలా చేసిన కరోనాను కంట్రోల్​ చేయగలిగేలా చేసింది వ్యాక్సిన్ మాత్రమే. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ప్రాణాంతక వ్యాధులనుంచి ప్రజలను రక్షిస్తాయి. కేవలం పిల్లలకే కాకుండా పెద్దలు కూడా కొన్ని వ్యాక్సిన్స్ వేయించుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రాణాంతక వ్యాధులు రాకుండా.. వచ్చినా వాటి ప్రభావం ఎక్కువగా లేకుండా చేయడంలో వ్యాక్సిన్స్ కీలకపాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోనే అత్యంతం విస్తృతమైన రోగనిరోధకత కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. వైద్య సదుపాయాలు సరిగ్గా లేని ప్రాంతాలకు కూడా వ్యాక్సిన్స్​లను చేర్చుతుంది. వ్యాక్సిన్ ప్రాముఖ్యతలపై విస్తృత ప్రచారాన్ని చేస్తుంది. అంతేకాకుండా స్వదేశీ వ్యాక్సిన్లను తయారు చేస్తూ ఎందరికో ప్రాణదాత అవుతుంది. వ్యాక్సిన్లపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 18న నేషనల్ వ్యాక్సినేషన్​ డే నిర్వహిస్తున్నారు. దీనినే జాతీయ టీకా దినోత్సవం అని కూడా అంటారు. ఇందులో భాగంగా టీకా డ్రైవ్​లను దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. అంతేకాకుండా టీకాలు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, తీసుకోకపోతే జరిగే నష్టాలు గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఏ వ్యాక్సిన్స్ తీసుకోవాలి? ఏ వయసులో వ్యాక్సిన్ తీసుకోవాలి వంటి వాటిపై కూడా నిపుణులు సలహా ఇస్తుంటారు. లింగ బేధం లేకుండా, సామాజిక ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా.. వ్యాక్సిన్లు అందరికీ పని చేస్తాయి. సురక్షితమైన, ప్రభావవంతమై టీకాలు భారత పౌరులకు అవసరం. ​అంటు వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి వ్యాక్సిన్లు చాలా అవసరం. పలు వైరస్​లు, బ్యాక్టీరియా దరి చేరకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇవి సాయపడతాయి. తద్వార అంటు వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. పిల్లల్లో వృద్ధుల్లో, రోగనిరోధక శక్తి లేని వారిని వివిధ వ్యాధులను నుంచి రక్షించడంలో వ్యాక్సిన్స్ హెల్ప్ చేస్తాయి.  ఇది ప్రాణాలను కాపాడుతుంది. అంటువ్యాధుల వల్ల కలిగే దీర్ఘకాలిక ఆరోగ్య పరిణామాలను నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

జిల్లాలో పూర్తి స్థాయిలో టీకాలు: డిఐఓ 

చిత్తూరు జిల్లాలో  టీకా కార్యక్రమాలను  సమర్థవంతంగా అమలుచేస్తున్నామని  జిల్లా ఇమునైజేషన్ అధికారి డాక్టర్ హనుమంతరావు తెలిపారు. చిత్తూరు జిల్లాలో 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 613 సబ్ సెంటర్లు, ఏడు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, మూడు ప్రాంతీయ వైద్యశాలలు, ఒక జిల్లా ఆసుపత్రి, మూడు వైద్య కళాశాలలు, ఒక నవజాత శిశు సంరక్షణ కేంద్రం, 14 పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా జిల్లాలో టీకాల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు బీసీజి టీకాలు, జీరో డోస్ 19,725 మందికి, పెంటావలెంట్ 3 టీకాలు 20,732 మందికి వేశామని, 21,575 మంది పూర్తి వ్యాధినిరోధక టీకాలను వేసుకున్నారని తెలిపారు. ఇవి కాకుండా గర్భవతులకు టిటి వేస్తున్నామని, పసి పిల్లలకు విటమిన్ కె1, ఓపివి, హెల్ప్ బి, పోలియో, రోటా వైరస్ వ్యాక్సిన్, తట్టు అమ్మవారు రాకుండా, ఓపివి బూస్టర్, డిపిటి బూస్టర్, జేఈ సెకండ్ డోస్,  విటమిన్ ఏ, పి సి వి 1,2,  పిసిబి బూస్టర్ డోసులను కూడా అందచేస్తున్నామని తెలిపారు. జిల్లాలో సంవత్సరంలో 32,000 మందికి ఈ టీకాలను వేస్తున్నామని హనుమంతరావు తెలిపారు.

పో రై గంగ 5 టికా

గంగ 6 హనుమంతరావు 


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *