16, జనవరి 2025, గురువారం

సాంప్రదాయబద్దంగా కనుమ పండుగ

 



సంక్రాంతి పండుగలో  మూడవ రోజు అయిన కనుమ పండుగను చిత్తూరు జిల్లా ప్రజలు సాంప్రదాయబద్దంగా జరుపుకున్నారు. ఈ పండగనే పశువుల పండుగ అని కూడా పిలుస్తారు. వ్యవసాయంలో, కుటుంబ పోషణలు తమకు తోడునీడుగా ఉన్న పశువులకు కృతజ్ఞతలు తెలిపే పండుగే కనుమ పండుగ. కనుమ పండుగ రోజున పశువులను, ఆవులను, గేదెలను, దూడలను శుభ్రంగా కడిగి, అలంకరించారు. వాటి కొమ్ములను చెక్కి, రంగులు వేశారు. కొమ్ములకు కుప్పిలు బిగించి, కుచ్చిళ్ళు కట్టారు. రంగురంగుల బెలూన్లు, రిబ్బన్లతో, పూలతో అలంకరించారు. మంగళహరతులతో పూజలు చేశారు. గ్రామాలలో కనుమ రోజు పశువులకు ఎటువంటి కష్టమో లేకుండా చూసుకుంటారు. వాటికి ఇష్టమైన ఆహారాన్ని అందజేస్తారు. బాగా ముస్తాబు చేసిన పశువులను గ్రామంలో ఊరేగింపుగా తిప్పుతారు. ఊరేగింపు అయిన తర్వాత కొన్ని గ్రామాలలో పశువులను  తరుముతూ యువకులు ఆనందిస్తారు. ఈ సందర్భంగా పందాలు కూడా కాస్తారు. అయితే చిత్తూరు జిల్లాలో క్రమంగా పశువులు కనుమరుగయ్యాయి. వాటి స్థానాన్ని ఆవులు ఆక్రమించాయి. జిల్లాలో సగానికి పైగా కుటుంబాలకు ఆవులు జీవనాధారంగా మారాయి. దీంతో జిల్లాలో డైయిరీ పరిశ్రమకు ప్రాధాన్యత పెరిగింది. పలువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా తమ ఉద్యోగాలను వదిలి,  డైయిరీ పరిశ్రమ పట్ల ముగ్గు చూపుతున్నాను. డజను వరకు ఆవులను నిర్వహిస్తూ సంపాదిస్తున్నారు. కనుమ పండుగ రోజునా తమకు జిననధారమైన ఆవులను శుభ్రంగా కడిగి వాటిని అలంకరించి పూజలు నిర్వహించారు.  చిత్తూరు జిల్లాలో మూడవ రోజు అయిన కనుమ రోజు మాంసాహారం తినడం ఆనవాయితీ. ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు మాంసాహారాలతో విందు భోజనాలు  ఏర్పాటు చేశారు. శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆప్యాయంగా కనుమ పండుగను జరుపుకున్నారు. పెద్దలు, పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తూ, ఆనందంగా గడిపారు.

పో రై. గంగ 2 ఐరాల మండలం పుత్రమద్దిలో పశువుల ఊరేగింపు 

        గంగ 2 గోపూజ చేసిన మాజీ మంత్రి రోజా 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *