20, జనవరి 2025, సోమవారం

వికలాంగుల సాధారణ పించన్ల పరిశీలన ప్రారంభం

చిత్తూరు, నగరి, పలమనేరు, కుప్పం ఆస్పత్రులలో పరిశీలన 

ఆరు నెలల పాటు కొనసాగనున్న పరిశీలన 

పరిశీలనకు హాజరు కాకుంటే పించన్ కట్ 

పరిశీలన పూర్తి అయ్యాక కొత్త పించన్లు 

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

దీర్ఘకాలిక వ్యాధులు, ప్రమాదాల కారణంగా మంచాలకు, మూడు చక్రాల కుర్చీలకు పరిమితమైన దివ్యాంగుల పింఛన్ల పరిశీలన కార్యక్రమం జిల్లాలో ఒకవైపు కొనసాగుతోంది. మరో రెండు రోజుల్లో ఈ కార్యక్రమం ముగియనుంది. సోమవారం నుంచి దివ్యాంగుల సాధారణ పింఛన్ల పరిశీలన కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. వీరు జిల్లాలో 35,277 మంది ఉన్నారు. నెలకు 6 వేల రూపాయలు పించన్ గా తీసుకుంటున్నారు. చిత్తూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, పలమనేరు, నగరి, కుప్పంలోని ఏరియా ఆసుపత్రులలో ఈ పింఛన్ల పరిశీలన కార్యక్రమం ప్రారంభమైంది. రోజుకు ఒక్కొక్క ఆస్పత్రిలో  50 మందిని పరిశీలించి, వారికి అంగవైకల్యం ఉందా? లేదా< ఉంటే ఎంత శాతం ఉంది అనే విషయాన్ని నమోదుచేస్తారు. రోజుకు 200 మంది వంతున ఈ పింఛన్ల పరిశీలన కార్యక్రమం ఆరు నెలల పాటు జిల్లాలో కొనసాగనుంది. అప్పటివరకు జిల్లాలో ఎవరికి కొత్తగా వికలాంగుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పింఛన్ల పరిశీలన కార్యక్రమం పూర్తయన పూర్తి అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పింఛన్లను మంజూరు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ప్రతి నెల 15 వేల రూపాయలు పింఛన్లు తీసుకుంటున్న దివ్యాంగుల ఇంటింటి పరిశీలన జనవరి మూడో తారీఖు నుంచి ప్రారంభమైంది. ఇందుకు నెల్లూరు, తిరుపతికి చెందిన 10 డాక్టర్ల బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బృందాలు  మంచానికే పరిమితం అయిన  దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి వారి స్థితిగతులను, ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తనిఖీ చేస్తున్నారు. రోజుకు 25 నుంచి 30 మంది పెన్షనర్ల వివరాలను యాప్ లో నమోదు చేస్తున్నారు. ఈ పరిశీలన మరో రెండు రోజుల్లో పూర్తయ్య అవకాశముది. సోమవారం నుంచి నెలకు ఆరు వేల రూపాయలు పింఛన్ తీసుకుంటున్న దివ్యాంగుల పరిశీలన కార్యక్రమం ప్రారంభమైంది. పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే పరిశీలనకు హాజరు కావలసి ఉంటుంది. ఎవరైనా ఈ పరిశీలనకు ఎవరైనా హాజరు కాకుంటే, మరుసటి నెల నుంచి వారి పింఛన్ నిలుపుదల చేస్తారు. జిల్లాలో ఆర్తో (ఎముకలు)  కారణంగా పింఛన్ తీసుకుంటున్న దివ్యాంగులు 19,927 మంది,  కంటి చూపు లోపం కారణంగా 3093 మంది, వినికిడి లోపం కారణంగా 5332 మంది, మానసిక వికలాంగుల కింద 3189 మంది, మానసి వికలాంగత్వంతో పాటు అనారోగ్యానికి గురైన 2994 మంది, వివిధ రకాల అంగవైకల్యంతో 1642 మంది  పింఛన్లను తీసుకుంటున్నారు. వీరిని రోజుకు 50 మంది చొప్పున చిత్తూరు, పలమనేరు, నగరి, కుప్పం ఆసుపత్రులకు పిలిపించి అంగవైకల్యానికి సంబంధించిన పరిశీలన చేస్తారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ నెల కొరకు పూర్తవుతుందని అంచనా వేశారు.

కొత్త పించన్లు ఎప్పుడు?

రాష్ట్రవ్యాప్తంగా గత 13 నెలలుగా కొత్త పింఛన్ల మంజూరుకు బ్రేక్ పడింది. సాధారణంగా ప్రతి 6 నెలలకు ఒక సారి ప్రభుత్వం కొత్త పించన్లను మంజూరు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే కోటను ప్రభుత్వం ఈ విషయాన్ని కూడా పక్కన పెట్టింది. చివరిసారిగా గత సంవత్సరము డిసెంబర్ లో కొత్త పించన్లు మంజూరు అయ్యాయి. వాటిని జనవరిలో ఇచ్చారు. తరువాత ప్రభుత్వం కొత్తగా పించన్ లను మంజూరు  చేయలేదు. ఇదివరకు ఉన్న పింఛన్లను మాత్రం పంపిణీ చేస్తున్నారు. పాత పింఛన్దారులకు వైసీపీ ప్రభుత్వంలో ఇస్తున్న మొత్తాలను  పెంచి మరి అందజేస్తున్నారు. కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు గత 13 నెలలుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. తమకు పింఛన్లు ఎప్పుడు వస్తాయని గ్రామ సచివాలయాలు, చుట్టూ మండల కార్యాలయాలు చుట్టూ  లబ్దిదారులు కాళ్లు అలిగేలా తిరుగుతున్నారు. ప్రభుత్వం కొత్తగా పెన్షన్లను మంజూరు చేయడం లేదని, మంజూరు చేయగానే ఇస్తామని మండల అధికారులు లబ్ధిదారులకు నచ్చ చెబుతున్నారు. జిల్లాలో సుమారుగా 20,000 మంది కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. పించన్ల పరిశీలన కార్యక్రమం సెప్టెంబరు నెల వరకు కొనసాగనుంది. అప్పటి వరకు ప్రభుత్వం కొత్త పించన్లు మంజూరు చేసే అవకాశాలు కనిపించడం లేదు. అంటే రెండు సంవత్సరాల సుధీర్గ విరామమం, ఎదురుచూపుల తరువాత కొత్త పించన్లు మంజురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

వితంతు పించన్లలో తిరకాసు !

ప్రభుత్వం కొత్తగా వితంతు పెన్షన్లను కూడా మంజూరు చేయడం లేదు. గతంలో భర్త చనిపోతే ఆ పింఛన్ ను భార్యకు మరుసటి నెల నుండి అందచేసే వారు. జనవరి నుంచి పింఛన్ల కోసం వితంతువులు ఎదురు చూస్తుండగా, నవంబర్ నెల మొదటి తేదీ నుంచి డిసెంబరు 15వ తారీఖు వరకు భర్త చనిపోయి, అతనికి పింఛన్ వస్తుంటే భార్యకు మాత్రం పించన్ మంజూరు చేశారు. ఇలా జిల్లాకు కొత్తగా 620 పింఛన్లు మంజూరయ్యాయి. జనవరి నెల నుంచి భర్తను కోల్పోయి పింఛన్ కోసం ఎదురుచూస్తున్న వారికి నిరాశే మిగిలింది. సీనియారిటని పక్కనపెట్టి జూనియర్లకు పింఛన్లు మంజూరు చేయడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న లబ్ధిదారులకే పింఛన్లు అందజేయడంలోనే కూటమి నిమగ్నమై ఉంది. దీంతో వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు కొత్త పింఛన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం పాత పింఛన్దారులకు పింఛన్ మొత్తాలను పెంచి అందజేయడం పట్ల పింఛన్దారులలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్న పింఛన్దారులను నిర్లక్ష్యం చేయడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భర్తను కోల్పోయిన వితంతువులు తమకు పింఛన్ వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. భర్త లేకపోవడంతో తమకు జీవనాధారం లేకుండా పోయిందని, తమను ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన చెందుతున్నారు. కొత్తగా ప్రమాదాలలో వికలాంగులైన వారు, ఒంటరి మహిళలు ఆవేదన చెప్పనలివి కావడం లేదు. పించన్ కోసం ప్రతి నెలా ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం కొత్త పింఛన్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకొని త్వరగా అర్హులైన వారికి అందజేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *