1, జనవరి 2025, బుధవారం

అరుపులు, కేకలతో దద్దరిల్లిన జిల్లా పరిషత్ సమావేశం

 అధికార, ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాలు, వాగ్వివాదాలు

అందోళనతో అరగంట స్తంభించిన సమావేశం

సర్దిచెప్పిన జడ్పి సీఈఓ , జిల్లా కలెక్టర్ 

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవం లేదని ఆవేదన 

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు దూరంగా పెట్టారని ఆరోపణ  

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)


మంగళవారం చిత్తూరులో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అరుపులు, కేకలతో దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాలు, వాగ్వివాదలతో అరగంట పాటు సమావేశం స్తంభించింది. ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్దకు దూచుకొని వచ్చి ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి నిలబడ్డారు. ఒక దశలో తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడాడ వారికి మద్దతుగా నిలచారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రస్తుత ప్రభుత్వం గౌరవం ఇవ్వడం లేదని తీవ్రస్థాయిలో ఆవేదనను వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఉద్యమించక తప్పదని హెచ్చరించారు. చివరకు జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈఓలు ప్రతిపక్ష  సభ్యులను శాంతింపజేశారు.


జిల్లా పరిషత్ సాధారణ సమావేశం మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి జిల్లా పరిషత్తు చైర్మన్ గోవింద శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా పరిషత్ సీఈవో రవికుమార్, చిత్తూరు పార్లమెంటు సభ్యుడు ప్రసాదరావు, తిరుపతి పార్లమెంటు సభ్యుడు గురుమూర్తి, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, శాసనమండలి సభ్యుడు సిపాయి సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ కలెక్టర్ హేమ వంశీ, చూడ చైర్పర్సన్ కటారి హేమలత, తిరుపతి ఆర్డిఓ నరసింహులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తొలుత దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం శాఖల సమీక్షలు ప్రారంభమయ్యాయి. వ్యవసాయం ఉద్యానవన శాఖ విద్యా శాఖ ప్రతిపక్ష సభ్యులు నిరసన స్వరాన్ని వినిపించారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తమకు మండల స్థాయిలో తగిన గౌరవం ఇవ్వడం లేదన్నారు. మండల స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు తమ ప్రమేయం లేకుండా మంజూరవుతున్నాయని, అమలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పలుచోట్ల మండల పరిషత్ సమావేశాలు జరగకుండా అధికార పార్టీకి చెందిన నాయకులు అడ్డుకుంటున్నారని, దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపించారు. మండల పరిషత్ అధ్యక్షులతో సంప్రదించకుండా మండల సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారని, సభ్యులకు సమాచారాన్ని స్వీట్ పోస్టులలో పంపుతున్నారని తెలిపారు. తంబళ్లపల్లి శాసనసభ్యులు ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ ఈ విషయంలో తంబళ్లపల్లి నియోజకవర్గం లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది అన్నారు. కోర్టులు జోక్యం చేసుకొని, ఆదేశాలు ఇచ్చిన మండల పరిషత్ సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో జరుగుతున్న సభలు, సమావేశాలకు తమకు ఆహ్వానాలు అందడం లేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమను పక్కనపెట్టి అధికార పార్టీ నాయకులతో పరిపాలన సాగిస్తున్నారని ఎద్దేవా వేశారు. తమ సభ్యులు మండల పరిషత్ కార్యాలయాలకు వెళ్ళకుండా అడ్డుకుంటున్నారని, రౌడీలు, గుండాలతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఒక మండలానికి చెందిన నిధులను మరొక మండలానికి మళ్లించి, వ్యయం చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో తమను ఎందుకు భాగస్వామ్యం చేయడం లేదు ప్రశ్నించారు. ఒక దశలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ వారికి సర్ది చెప్పడానికి ప్రయత్నం చేసిన, ఫలించలేదు. తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. సభ్యులు పోడియం వైపు చొచ్చుకొని వచ్చి ఆందోళనకు దిగారు. తమ సమస్యల మీద జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ విషయమై జిల్లా పరిషత్ సీఈవో రవికుమార్ మాట్లాడుతూ తంబళ్లపల్లి నియోజకవర్గంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉందన్నారు. అందరితో మాట్లాడి పరిస్థితిని చక్క దిద్దుతానని హామీ ఇచ్చారు. ఒక్కొక్క మండలంలో కోటి నుంచి కోటిన్నర రూపాయల నిధులు ఉన్నాయని, వాటితో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాల్సిందిగా కోరారు. గ్రామసభలను నిర్వహించి, ప్రజల అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా పనులు చేపట్టాలన్నారు. ప్రతి జడ్పిటిసి సభ్యుడు 50 లక్షలు వరకు పనులను ప్రతిపాదించవచ్చున్నారు. ఈ మేరకు ఎనిమిది మండలాల్లో మినహా అన్ని మండలాల నుంచి ప్రతిపాదనలు అందాయన్నారు. ఒక మండలంలో 50 లక్షలు, మరో మండలంలో 1. 36 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ మండల స్థాయిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో అందరూ ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాల్సిందిగా జిల్లాలోని అందరు ఎంపీడీవోలను ఆదేశించడం జరిగిందన్నారు. ఎక్కడైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, సమస్యను సర్దుబాటు చేస్తానన్నారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ టిడ్కో బకాయిలను పూర్తి చేసి, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని లబ్ధిదారులకు అందజేయాల్సిన అవసరం ఉందన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కలుగజేచుకుంటూ ఈ విషయాన్ని సత్వరం పరిష్కరించి, డబ్బులు కట్టిన లబ్ధిదారులకు గృహాలను ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. చిత్తూరు ఎంపి ప్రసాదరావు మాట్లాడుతూ రైతులకు రుణాలు మంజూరు చేయడంలో వెనుకబడ్డారని, లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వాలన్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు కలుషిత ఆహారం తిని, ఆసుపత్రుల పాలవుతున్నారని, ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కూరగాయలు వారానికి ఒకసారి కాకుండా ప్రతిరోజు కొనుగోలు చేసే విధంగా చూడాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ఎస్సి శంకర్ నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ సంబంధించిన పనులను రద్దు చేసిందన్నారు. జిల్లాకు గండికోట, కండలేరు జలాశయాలనుంచి తాగునీటిని సరఫరా చేయడానికి 4000 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించిన సమీక్ష కార్యక్రమం జరిగింది.

పో రై. గంగ 1 జిల్లాపరిషత్ సమావేశంలో పాల్గిన్న అధికారులు, అనధికారులు 

గంగ 2 హాజరైన సభ్యులు 

గంగ 3 ప్రతిపక్ష సభ్యుల అందోళనలు

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *