31, జనవరి 2025, శుక్రవారం

వాట్సప్ పరిపాలన ప్రారంభం

 


రాష్ట్రంలో పౌరసేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సప్ పరిపాలన (వాట్సాప్ గవర్నెన్స్) ప్రారంభమయ్యింది. ఈ మేరకు అధికారిక వాట్సప్ నంబర్ +919552300009ను కేటాయించారు. మన మిత్ర పేరుతో మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తొలి విడతలో ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్, ఇంధన, దేవాదాయ తదితర శాఖల్లో సేవలు అందుతాయి. సర్టిఫికెట్లు, పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సిన అవసరం ఉండదు.  రెండో దశలో 300కుపైగా సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. తొలి విడతలో దేవాదాయ, ఇంధన, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల్లో ఈ సేవలు ప్రారంభించారు. వాట్సాప్‌ సేవలతో ప్రజలు ధ్రువపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. అలాగే ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని ప్రజలకు పంపించేందుకు ఈ వాట్సాప్ అకౌంట్‌ నుంచి కోట్లమందికి మెసేజ్‌లు పంపిస్తుంది. ఉదాహరణకు వర్షాలు, వరదలు, విద్యుత్ మరమ్మతులు, ఎమర్జెన్సీ, హెల్త్, పర్యాటకం, వ్యవసాయం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి సమాచారాన్ని అందిస్తారు. ప్రజలు తమ వినతుల్ని, ఫిర్యాదుల్ని ఈ వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ చేసిన వెంటనే ఓ లింక్ వస్తుంది. వెంటనే అందులో పేరు, మొబైల్‌ నంబర్, అడ్రస్ నమోదు చేయాలి.. వారి వినతి, సమస్య ఏంటో టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ తర్వాత వారికి ఒక రిఫరెన్స్‌ నంబరు పంపిస్తారు. దాని ద్వారా ప్రజలు తమ వినతికి సంబంధించిన స్టేటస్‌ను చూడొచ్చు.

ప్రభుత్వం జారీ చేసే సర్టిఫికేట్లు  ఆదాయం, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ను కూడా వాట్సాప్ ద్వారా తీసుకోవచ్చు. సీఎం రిలీఫ్ ఫండ్ స్టేటస్ చూసుకోవచ్చు. కరెంట్ బిల్స్, ఆస్తి పన్నుల్ని కూడా చెల్లించొచ్చు. అలాగే రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్‌ రికార్డుల్ని కూడా తీసుకోవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథఖాల నుంచి ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అర్హతలు, పథకాల ప్రయోజనాలు ఏంటో ఈ వాట్సాప్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఆలయాల్లో దర్శనాలు, వసతి గదులు, విరాళాలు అందజేయడం వంటి సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏపీఎస్‌ఆర్టీసీ సేవల్ని కూడా పొందొచ్చు. ప్రధానంగా టికెట్‌ బుకింగ్, క్యాన్సిలేషన్, సర్వీసు, రిఫండ్, జర్నీ రిమైండర్, ట్రాకింగ్‌ సర్వీసు, ఫీడ్‌బ్యాక్ వంటి‌ సేవలు పొందవచ్చు. ఈ వాట్సాప్ సేవలకు సంబంధించి ప్రజల సమాచారం సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ మేరకు ఫోరెన్సిక్, సైబర్‌ సెక్యూరిటీని బలోపేతం చేయాలని సూచనలు చేశారు. వాట్సాప్‌ ద్వారా సేవలందించేందుకు గతేడాది అక్టోబరు 22న మెటాతో ఒప్పందం చేసుకుంది. వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలనుకునే వారు.... వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేస్తే ఒక లింక్ వస్తుంది. అందులో పేరు, చిరునామా, ఫోన్ నంబర్ టైప్ చేసి... వినతి ఏమిటో టైప్ చేయాలి. వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రిఫరెన్స్ నంబర్ ద్వారా వినతి పరిష్కారం ఎంత వరకు వచ్చిందో తెలుసుకోవచ్చు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *