రెండవ రోజు చంద్రబాబు బిజీ బిజీ
విశ్రాంతి లేకుండా వరుసగా కార్యక్రమాలు
ఇద్దరి సమస్యలు అక్కడికద్దడే పరిష్కారం
లోకనాయకుడు కార్యాలయం ప్రారంభం
కార్యాలయంలో పనితీరును స్వయంగా పరిశీలన
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
కుప్పం పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండవ రోజైన మంగళవారం బిజీ బిజీగా గడిపారు ఉదయం నుంచి రాత్రి వరకు తీరిక లేకుండా విశ్రాంతి తీసుకోకుండా పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు ఎక్కువ సమయం లోకనాయకుడు కార్యాలయంలో గడిపారు. ఈ కార్యాలయంలో పనితీరును ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. అక్కడికి వచ్చిన ఇద్దరి ఫిర్యాదుదారుల సమస్యలను ముఖ్యమంత్రి అక్కడికక్కడే పరిష్కరించారు. అనారోగ్యంతో వచ్చిన ఒక కుటుంబానికి 8 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ప్రకటించారు. బోరుకు పంప్ సెట్, పైపులు కావాలని వచ్చిన మరో రైతుకు 48 గంటల్లో సమకూర్చాల్సిందిగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను ఆదేశించారు.
కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా శాంతి పురం మండలం తుమ్మిసి చెందిన శివ, సత్య దంపతుల కుమారుడికి జితేంద్రగా నామకరణం చేశారు. అనంతరం ఆర్ అండ్ బి అతిధి గృహం నుండి బయలుదేరిటిడిపి కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. కుప్పం నియోజకవర్గం తో పాటుగా జిల్లా వ్యాప్తంగా 1090 మంది అర్జీదారుల వివిధ రకాల సమస్యల తో నేరుగా ముఖ్యమంత్రికి అందజేయాలని ఉద్దేశంతో పెద్ద ఎత్తున అర్జీదారులు వచ్చారు. ముఖ్యమంత్రి స్వయంగా అర్జీదారుల వద్దకు వచ్చి సమస్యల అర్జీలను స్వీకరిస్తూ వారు చెప్పే సమస్యలను వింటూ వారి సమస్యలను వెంటనే పరిష్కరం చేయుటకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. మధ్యాహ్నం టి డి పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కుప్పం అభివృద్దికి అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. తరువాత ఎన్ టి ఆర్ స్టేడియం చేరుకొని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ తో ప్రాజెక్ట్ వ్యయం: రూ. 105.10 కోట్లతో 4800 మంది కి ఉపాధి దిశగా మదర్ డెయిరీ ఫ్రూట్ విజిటబుల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా శాంతి పురం మండలం, తంబిగాని పల్లి, తంబి గానిపల్లి(గ్రామం)వద్ద ఎకరాల 41.22 విస్తీర్ణంలో ప్రాసెసింగ్ ప్లాంటుకు శంకుస్థాపన చేశారు. ఫ్రూట్ పల్ప్ (మామిడి, టమోటా) తయారీ..50 వేల మంది రైతులకు ప్రయోజనం పొందేలా చర్యలు చేపడుతున్నట్లు జయ తీర్థ చారి, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ మదర్ డైరీ ముఖ్య మంత్రి కి వివరించారు. రూ.233 కోట్ల తో 4000 మందికి ఉపాధి కల్పించే విధంగా శ్రీజ ప్రొడ్యూసర్ కంపెనీ (పాల పొడి తయారీ) కి చిత్తూరు జిల్లా శాంతి పురం మండలం తంబి గానిపల్లి గ్రామం వద్ద 40 ఎకరాలలో ఏ పి ఐ ఐ సి ద్వారా భూమి కేటాయింపు పత్రాలను అందచేశారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే లక్ష మంది మహిళా రైతుల భాగ స్వామ్యం కలరని సీఈఓ తిమ్మప్ప చైర్మన్ శ్రీదేవి ముఖ్య మంత్రికి వివరించారు. రోజుకు 200 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేసే సామర్థ్యం గల క్యాటిల్ ఫీడ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రారంభించారు. అలాగే ప్రభుత్వ ప్రత్యేక నిధులు రూ.10 కోట్లు తో కుప్పం మున్సిపాలిటీలో అర్బన్ ప్రాజెక్టుల నిర్వహణ, అధికారుల అతిథి గృహాల నిర్మాణం కోసం సమీకృత కాంప్లెక్స్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ (2 అంతస్తులు) నిర్మాణం కోసం ప్రత్యేక గ్రాంట్లు ద్వారా అంచనా వ్యయం: రూ. 10.00 కోట్లతో శంఖుస్థాపన చేశారు. ప్రత్యేక గ్రాంట్లుతో అంచనా వ్యయం రూ.60.20 కోట్లుతో కుప్పం లో ఏర్పాటు చేసిన డీకే పల్లి పార్కుల అభివృద్ధి, సుందరీకరణ, కుప్పం ఏరియా అభివృద్ధి లో రోడ్డు జంక్షన్లు, వీధి దీపాలను ప్రాంభించారు. అంచనా వ్యయం రూ. 110.21 కోట్లతో కుప్పం నియోజక వర్గంలోని 451 డ్రైనేజీ వర్కులును జి ఎస్ హెచ్ 11- ఎస్ డి పి నిధుల ద్వారా చేపట్టిన పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఏన్టీఆర్ స్టేడియంలో ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా ( ఏఎల్ ఇఏపి ) హైదరాబాదుతో జిఏపీ కుప్పం నియోజక వర్గంలో మహిళా శక్తి పవన్, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేయడంమరియు మహిళా పారిశ్రామిక వేత్తలను బలోపేతం చేయడం తద్వారా సామాజిక, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అవగాహన ఒప్పందం చేసుకున్నారు. మహిళా శక్తి భవన్, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం 19.87 ఎకరాల భూమి కేటాయింపుపై ఒప్పందం కుదిరింది. 175 మహిళా స్వయం సహాయక బృందాలకు మౌలిక సదుపాయాలు శిక్షణ, సామర్థ్యాన్ని పెంపునకు, 4000 మంది మహిళలకు ఉపాధి అవకాశాలను సృష్టించడం, 1900 మంది కుటుంబాల సామాజిక ఆర్థిక స్థితి గతులను మెరుగు పరచడం ద్వారా ఎం ఎస్ ఎం ఈ రంగంలోకి మహిళలను ప్రోత్సహించడం కోసం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ఐదేళ్ల వరకు అమలులో ఉంటుంది. ఏం ఓ యూ ల అనంతరం సా.4.35 గంటలకు సభా వేదికపై ఎన్టీఆర్ స్టేడియం సభా వేదికలో సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. కూచిపూడి నాట్యం చేసిన విద్యార్థులను రాష్ట్ర ముఖ్యమంత్రి అభినందించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాలలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న, ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ,అనంతపురం రేంజ్ డిఐజి హిమోషి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, కడపిడి వికాస్ మర్మత్, రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పి.ఎస్. ముని రత్నం, మాజీ ఎం ఎల్ సి గౌనివారి శ్రీనివాసులు, జిల్లా పరిషత్ సీఈఓ రవికుమార్, డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీదేవి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.