16, జనవరి 2025, గురువారం

మున్సిపాలిటీలలో తాగునీటి సమస్యకు రూ. 9.13 కోట్లతో ప్రణాళిక


వేసవిలో తాగునీటి సమస్యను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ ప్రణాళిక 

చిత్తూరు మున్సిపాలిటీకి రూ. 2 కోట్లతో ప్రతిపాదనలు 

కొత్త బోర్లు తవ్వడం, పాతవి మరమ్మత్తులతో పాటు ట్యాంకర్లతో నీటి సరఫరా

కరువు బృందానికి, ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు


(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు)

రానున్న వేసవులు తాగునీటి సమస్యను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం ఇప్పటి నుంచే సిద్ధం అవుతుంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలో వేసవిలో తాగు నీటి సమస్యను తీర్చడానికి 9.13 కోట్ల రూపాయలతో ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించారు.ఈ ప్రణాళికను జిల్లాలో పర్యటించిన కరువు బృందానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేసి, అవసరమైన నిధులను విడుదల చేయాల్సిందిగా కోరారు. రానున్న వేసవిని తట్టుకోవడానికి ప్రైవేట్ బోరులను అద్దెకు తీసుకోవాలని, కొత్త బోర్లను తవ్వాలని, ప్రస్తుతం ఉన్న బోర్లు కొన్నింటిని లోతు చేయాలని, అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడానికి, బోర్లను రిపేర్లు చేయడానికి నిధులు అవసరమని జిల్లా అధికారులు ప్రతిపాదించారు. 

చిత్తూరు జిల్లాలో చిత్తూరు, కుప్పం, నగరి, పలమనేరు, పుంగనూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో నగరి మున్సిపాలిటీలో మాత్రమే ప్రజలకు  ప్రతిరోజు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. చిత్తూరు, కుప్పం, పుంగనూరు మున్సిపాలిటీలో రెండు రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పలమనేరులో అయితే, మూడు రోజులకు ఒకసారి తాగునీటిని తరపున చేసే పరిస్థితి ఉంది. చిత్తూరు తాగునీటి అవసరాల కోసం ఎన్టీఆర్ జలాశయంను నిర్మించారు. నగిరికి ఎస్ఎస్ ట్యాంకు నుంచి నీటి సరఫరా అవుతుంది. కాల్వపల్లిలో నిర్మించిన వైయస్సార్ రిజర్వాయర్ నుంచి పలమనేరు మున్సిపాలిటీకి నీటి సరఫరా జరుగుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ జలాశయంలో 270 రోజులకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి. నగరిలోని ఎస్ఎస్ ట్యాంకులో 210 రోజులకు సరిపడే నీరు ఉంది. పలమనేరుకు నీటిని సరఫరా చేయు వైఎస్సార్ రిజర్వాయర్ లో మాత్రం పది రోజులకు మించి తాగునీరు లభించే పరిస్థితి లేదు. ఈ మూడు మున్సిపాలిటీలకు రిజర్వాయర్ల ద్వారా ప్రజలకు తాగునీటి సరఫరా అవుతుండగా, కుప్పం, పుంగనూరు మున్సిపాలిటీలో బోర్ల మీదనే ఆధారపడ్డారు. చిత్తూరు మున్సిపాలిటీలో ఒక మనిషికి రోజుకు 108 లీటర్ల నీటిని, నగిరిలో 107 లీటర్ల నీటిని సరఫరా చేస్తుండగా, కుప్పంలో 55 లీటర్లను, పలమనేరులో 75 లీటర్లను, పుంగనూరులో 70 లీటర్ల మాత్రమే సరఫరా చేస్తున్నారు. ప్రస్తుత అంచనాల మేరకు చిత్తూరు మున్సిపాలిటీలో జనాభా 2.5 లక్షలు, కుప్పంలో 54,000, నగరిలో 74,000, పలమనేరులో 58,000, పుంగనూరులో 64,000 ఉంటుందని అంచనా వేశారు. మొత్తం మీద ఐదు మున్సిపాలిటీలలో కలిపి 4.55 లక్షల మంది జనాభా ఉన్నారు. నాలుగు మున్సిపాలిటీలో ప్రస్తుతం కూడా తాగునీటి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. చిత్తూరు మున్సిపాలిటీలో 13 ట్యాంకర్లు, కుప్పంలో ఒకటి, నగరిలో రెండు, పలమనేరులో రెండు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా అవుతుంది. రోజుకు అన్ని మునిసిపాలిటీలో కలిపి 143 ట్రిప్పులు నీటిని సరఫరా చేస్తున్నారు. రానున్న వేసవిలో తాగునీటి సమస్యను ఎదుర్కోవడానికి పలమనేరు మున్సిపాలిటీలో ఐదు ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకోవడానికి జిల్లా అధికారులు ప్రతిపాదించారు. చిత్తూరు మునిసిపాలిటీలో 100 బోర్లను, కుప్పంలో 18 బోర్లను, నగరిలో ఐదు బోర్లను, పలమనేరులో 40 బోర్లను, పుంగనూరులో 32 బోర్లను కొత్తగా తవ్వి, మోటార్లు బిగించి, నీటి సరఫరా చేయాలని ప్రతిపాదించారు. మరికొన్ని బోరుబావులను లోతు చేయాలని నిర్ణయించారు. చిత్తూరు మున్సిపాలిటీలో 40 బోర్లను, కుప్పంలో ఐదు బోర్లను, నగరిలో పది బోర్లను, పలమనేరులో 30 బోర్లను, పుంగనూరులో 10 బోర్లను లోతు చేయాలని ప్రతిపాదించారు. అలాగే చిత్తూరు మున్సిపాలిటీలో 200 ట్యాంకర్లను నీటి సరఫరాకు వినియోగించాలని నిర్ణయించారు. కుప్పంలో 25 ట్యాంకర్లతో, పలమనేరులో 120 ట్యాంకర్లతో, పుంగనూరులో 10 ట్యాంకర్లతో నీటి సరఫరా చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. పాడైన పైపులైన్ల మరమ్మతు చేయాలని, మరమ్మతుకు గురైన బోర్లను రిపేరు చేయాలని అంచనాలు తయారుచేశారు. మొత్తం మీద ఈ వేసవిలో చిత్తూరు మున్సిపాలిటీకి నాలుగు కోట్ల రూపాయలు, కుప్పం, మున్సిపాలిటీకి 176 లక్షలు, నగరి మున్సిపాలిటీ 20 లక్షలు, పలమనేరు మున్సిపాలిటీకి 220 లక్షలు, పుంగనూరు మున్సిపాలిటీకి 70 లక్షల రూపాయలు అవసరమవుతుందని అంచనాలు తయారు చేశారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు కలిపి 9.13 కోట్ల రూపాయలు అవసరమని జిల్లా అధికారుల అంచనా వేశారు. ఈ ప్రతిపాదనలను  రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు అందజేశారు. ఇందుకు అవసరమైన నిధులను విడుదల చేయాల్సిందిగా కోరారు.

పో రై గంగ 1 చిత్తూరు మునిసిపాలిటి 
గంగ 2 ట్యాంకర్ల నీటి సరఫరా (ఫైల్ ఫోటో) 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *