16, జనవరి 2025, గురువారం

ముగిసిన నాలుగు రోజుల సంక్రాంతి పండుగ

 చిత్తూరు పట్టణంలో దుకాణాల బంద్ 

అటవీ ప్రాంతంలో సరదాగా గడిపిన వ్యాపారస్తులు 


చిత్తూరు, జనవరి 16(ఆంధ్రప్రభ):  సంక్రాంతి పండుగలు చివరి రోజు అయిన ముక్కనుమ  రోజు చిత్తూరు పట్టణంలో చాలా వరకు దుకాణాలు మూత పడ్డాయి. పట్టణంలో బంద్ వాతావరణం కొనసాగుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు వ్యాపారస్తులందరూ దుకాణాలను మూసివేశారు. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో గురువారం రోజు చిత్తూరుకు సమీపంలోని అటవీ ప్రాంతంలో, జింకల పార్కులో సరదాగా కాలక్షేపం చేశారు. వారికి ఇష్టమైన ఆహారాన్ని తయారు చేసుకుని, విందు భోజనాలు చేశారు. ముక్కనుమ రోజు చిత్తూరు పట్టణంలో ప్రజలు, వ్యాపారస్తులు  గోట్ పాటిస్తారు. అంటే ఆరోజు వ్యాపారస్తులందరూ ముఖ్యంగా ఆర్యవైశ్యులు తమ దుకాణాలకు తాళాలు వేస్తారు. బంధుమిత్రులతో కలిసి చిత్తూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణలో సేద తీరుతారు. సంవత్సరం రోజులు వ్యాపార కలాకారులు తలమునకులైన వ్యాపారస్తులందరూ ముక్కనుమను  ఆటవిడుపుగా భావిస్తారు. చిత్తూరు పట్టణంలోని చర్చి వీధి, గాంధీ రోడ్డు, బజారు విధులలో  దుకాణాలన్నీ మోతపడ్డాయి. కిరాణా షాపుల నుండి బంగారు దుకాణాల వరకు తాళాలు పడ్డాయి. వ్యాపారస్తులు కుటుంబ సభ్యులతో సరదాగా తెలిపారు. చిత్తూరు అడవి ప్రాంతంలో, జింకల పార్కులో ఉన్న చిన్న పిల్లల పార్కులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా సరదాగా రోజంతా కాలక్షేపం చేశారు. చిన్న పిల్లలు అక్కడ ఉన్న ఉయాల, జారుడు బల్ల, నీటి కొలను వంటి వాటితో ఆడుకున్నారు. పెద్దలు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, అంత్యాక్షరి ఆడుకుంటూ, ఆడుకుంటూ, పాడుతూ కాలక్షేపం చేశారు. చిత్తూరు పట్టణంలో దుకాణాలు మూతపడంతో బంద్ వాతావరణం నెలకొంది. సాధారణంగా ఈ పద్ధతి తమిళనాడులో విస్తృతంగా అమలులో ఉంది. చిత్తూరు కూడా తమిళనాడుకు సరిహద్దులోఉన్నందున ఆ సంస్కృతి కూడా మిళితం అవుతుంది. దీంతో ముక్కనుమ రోజును చిత్తూరులోని వ్యాపారస్తులు విహారదినంగా పాటిస్తారు. గ్రామీణ ప్రాంతాలలో దూడల పండగగా వ్యవహరిస్తారు. ఆ రోజు ఆవులలో పాలు పిండరు. దూడలకు పాలు మొత్తం వదిలి, వాటికి ఆనందాన్ని చేకూరుస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో నాలుగవ రోజునా కూడా మాంసాహారం తినడం కానవాయితీగా వస్తుంది. చిత్తూరు జిల్లాలో ఇలా నాలుగు రోజుల సంక్రాంతి పండుగ సరదా సరదాగా ముగిసింది. 


పో రై గంగ 3 చిత్తూరులో మూతపడ్డ దుకాణాలు 

గంగ 4 జింకల పార్కులో సరదా సరదాగా పిల్లలు, పెద్దలు

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *