31, జులై 2025, గురువారం

యూరియా అందాక అల్లాడుతున్న రైతులు

ఎరువుల దుకాణాల మీద విజిలెన్ దాడులు 

భారీగా ఎరువులు, క్రిమిసంహారక మందుల స్తంభన

మోతాదుకు మించి యూరియా వాడుతున్నారని అధికారుల వివరణ 

జిల్లాలో అవసరం అయిన ఎరువుల నిల్వలు ఉన్నాయని స్పష్టం

 

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ) 

చిత్తూరు జిల్లాను యూరియా కొలత వెంటాడుతుంది. రైతులకు యూరియా దొరకకపోవడంతో ఎరువుల దుకాణాలు, రైతు సేవా కేంద్రాల వద్ద రైతులు బారులు తీరుతున్నారు. ఎరువుల కొరతను దృష్టిలో ఉంచుకొని విజిలెన్స్ అధికారులు జిల్లా వ్యాప్తంగా ఎరువుల దుకాణల మీద దాడులు నిర్వహించారు. భారీగా యూరియా, ఇతర ఎరువులు, క్రిమిసంహారక మందులను స్తంభింపజేశారు. జిల్లాలో అవసరమైన యూరియా నిల్వలు ఉన్నాయని, అయితే రైతులు సమతుల ఎరువులను వాడడం లేదని వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. మోతాదుకు మించి యూరియాను రైతులు వాడుతున్నారని అధికారుల తెలిపారు. జిల్లాలోని రైతులు యూరియాను పశుగ్రాసం కోసం వాడుతున్న కారణంగా జిల్లాలో యూరియా కొరత తలెత్తిందని చెపుతున్నారు. రైతులకు అవసరమైన ఎరువులను వాటి నిష్పత్తి ప్రకారం అందజేయడానికి సిద్ధంగా ఉన్నావని తెలియజేస్తున్నారు.


యురియా కొరత రైతుల్లో ఆందోళన కలుగచేస్తుంది. రైతు సేవా కేంద్రాల్లో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. కొందరు డీలర్లు కృత్రిక కొరత సృష్టించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అదనుగా కొంత మంది వ్యాపారులు ధరలు ఇష్టానుసారంగా పెంచేసి అమ్ముతుండటంతో రైతులకు ఆవేదన తప్పడం లేదు.  ప్రస్తుతం ఖరీఫ్‌లో వరి పంట సాగు చేసే రైతులకు ఎరువుల కొరత ముఖ్యంగా యూరియా కోసం నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎరువుల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలిచే రైతులకు రైతు సేవా కేంద్రాలను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి అవసరమైన ఎరువులు గ్రామాలకు చేరవేస్తామని అని ప్రకటించిన ప్రభుత్వం అమలులో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందినట్లు తెలుస్తోంది. రైతు సేవా కేంద్రాలకు రైతులు ఆధార్‌, పట్టాదారు పాసు పుస్తకంతో ఎరువులు అందుబాటులో ఉన్న సందర్భంలో మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి వస్తుంది. రైతులకు అవసరమైన అన్ని రకాల ఎరువులు కావాలంటే ప్రయివేటు దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తుంది. యూరియా కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. యూరియా నిలువ వచ్చిన రోజు సాయంత్రంలోపు పూర్తిగా అయిపోతుంది. తిరిగి నిలువ రావడానికి 15 రోజుల సమయం వేచి ఉండాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. ఒక్కొక్క రైతు భరోసా కేంద్రం పరిధిలో ఒకరు లేదా ఇద్దరు రైతులకు మాత్రమే యూరియా లబిస్తున్నట్లు తెలుస్తుంది. ఎరువుల దుకాణాల్లో కూడా యూరియా కొరత కొట్టొచ్చినట్లు కనిపిసుంది. కొందరు వ్యాపారులు కృత్రిమ కోరత చూపిస్తున్నట్లు తెలుస్తుంది. రైతులకు అవసరం లేకపోయిన దుకాణాల వారు సూచించిన ఎరువులు తీసుకుంటేనే యూరియా ఇవ్వడం, యూరియాను అధిక ధరకు అమ్మకాలు చేపట్టడం చేస్తున్నారు. జిల్లాలో ఖరిఫ్ సాగు ప్రారంభం అవుతోంది. ఎకరాకు 2 బస్తాలు యూరియాను వినియోగించినప్పటికీ రెండు లక్షల బస్తాల యూరియా అవసరం ఉంటుంది. జిల్లాలో  ఖరీఫ్‌ సీజన్‌లో ఇప్పటికే వేయి ఎకరాలకు పైగా వరి పంట సాగు అయింది. వారం, పది రోజుల్లో మరికొంత వరి పంట సాగు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి రైతు భరోసా కేంద్రం పరిధిలో రోజుకు పది బస్తాల యూరియా కూడా లభించడం లేదు. గ్రామీణ ప్రాంత రైతులు పట్టణ ప్రాంతాలకు వెళ్లి ఎరువులు కొనుగోలు చేసే ఆనవాయితీ ఉంది. జిల్లా కేంద్రంలో కూడా యూరియా అందుబాటులో లేనట్లు కొరత లేనట్లుగా చూపిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం యూరియా కొరత రైతులను వెంటా డుతోంది. అధికారులు మాత్రం యూరియా కొరత లేనట్లు ప్రకటనలు చేస్తున్నారు. యూరియా కొరతపై వ్యవసాయ అధికారులు జిల్లావ్యాప్తంగా కొరత ఉందని చెబుతున్నారు.రైతులు మాత్రం చేసేది ఏమీ లేక ఇతర ఎరువులతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వరి పంట సాగుచేసే రైతులకు యూరియా కొరత లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

*విజిలెన్స్ దాడులు* 

కమిషనరేట్ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలో ఐదు రోజులు పాటు విజిలెన్స్ దాడులు జరిగాయి. జిల్లాలోని 150 దుకాణాలు మీద దాడులు నిర్వహించారు. ఎరువులు, క్రిమిసంహారక మందుల నిల్వలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ  దాడుల్లో 38.46 మెట్రిక్ టన్నుల ఎరువులను, 331.15 లీటర్ల క్రిమిసంహారక మందులను స్తంభింపజేశారు. వీటి విలువ 12.14 లక్షల రూపాయలు. వీటికి సంబంధించి సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో, ధ్రువీకరణ పత్రాలు అందే వరకు వాటిని రైతులకు పంపిణీ చేయవద్దని ఆదేశాలు జారీచశారు.

*యూరియా కొరత లేదు: వ్యవసాయ శాఖ జెడి*  గంగ 2

జిల్లాలో యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జెమురళి కృష్ణ తెలిపారు. సాధారణంగా రైతులు నాలుగు శాతం నత్రజని, రెండు శాతం పాస్పరస్, ఒక శాతం పోటాస్ వాడాల్సి ఉంటుందన్నారు. చిత్తూరు జిల్లాలో రైతులు నత్రజని 11 శాతం, పాస్ఫరస్ మూడు శాతం, పోటాస్ ఒక శాతం వాడుతున్నారని, ఇదే రాష్ట్రస్థాయిలోనే అత్యధిక మోతాదులో ఉందన్నారు. దీనిని నియంత్రించడానికి సమతుల ఎరువులను సరఫరా చేయడానికి అవసరమైన రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన దామాషా మేరకు ఎరువులను సరఫరా చేస్తామన్నారు. జిల్లాలో పశుగ్రాసానికి ఎక్కువ యూరియాను వినియోగిస్తున్నారని, అలా వినియోగించడం కారణంగా పశువులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు.  జిల్లాలో ప్రస్తుతం 3,775 మెట్రిక్ టన్నుల యూరియా, 19 వేల మెట్రిక్ టన్నుల డిఏపి, 16,600  టన్నుల కాంప్లెక్స్, 740 టన్నుల సూపర్ పాస్పేట్, 240 టన్నుల పొటాషియం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్రామ వ్యవసాయ శాఖ అధికారి సిఫార్సు మేరకు రైతులకు ఎరువులను పంపిణీ చేస్తున్నట్లు మురళీకృష్ణ వివరించారు.

పో రై గంగ 1 యూరియా 

గంగ 2 వ్యవసాయ శాఖ జెడి

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *