14, జులై 2025, సోమవారం

ఇ క్రాప్ నమోదు విధానంలో విప్లవాత్మక మార్పులు

మొబైల్ ఆధారిత యాప్ ద్వారా అత్యంత ఖచ్చితంగా డేటా

పొలంలో ఏ పంట ఉన్నది ఫోటోతో పాటు నమోదు
అత్యంత ఖచ్చితమైన డేటా సేకరణకు ప్రణాళికలు
జియో-ఫెన్సింగ్, ఉపగ్రహ చిత్రాల  పరిజ్ఞానం వినియోగం   
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
వ్యవసాయ డేటాను సేకరించడం, వినియోగించే విధానంలో విప్లవాత్మక మార్పులుకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టింది. ఇది వరకటిలా ఇంట్లో కూర్చొని యాప్ లో ఎదో ఒకటి నమోదు చేయడానికి అవకాశం లేదు.  ఈ-పంట డిజిటల్ క్రాప్ సర్వే ను మొబైల్ ఆధారిత యాప్ ద్వారా అత్యంత ఖచ్చితంగా సేకరించనున్నారు. ఈ సర్వేలో జియో-ఫెన్సింగ్, ఉపగ్రహ చిత్రాల వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు. తద్వారా ప్రతి వ్యవసాయ కమతానికి సంబంధించిన ఖచ్చితమైన పంట విస్తీర్ణ సమాచారాన్ని సేకరించనున్నారు. పొలం ఫోటోను కూడా యాప్ లో పొందుపరుస్తారు. ఈ సమాచారం ఖచ్చితమైన ఉత్పత్తి అంచనాలను రూపొందించడానికి,  వ్యవసాయ ప్రణాళికలను మెరుగ్గా రూపొందించడానికి ఉపయోగపడుతుంది. డిజిటల్ క్రాప్ సర్వే వివరణాత్మక వ్యవసాయ డేటాను సేకరించడానికి అధునాతన అప్లికేషన్లు, సాధనాలను ఉపయోగిస్తారు. పంట నమూనాలు, భూమి కమతాలు, సర్వే నంబరు, జియోట్యాగ్ చేసిన చిత్రాలతో కూడిన సమాచారాన్ని సేకరించడానికి  సర్వేయర్ల కోసం ఒక మొబైల్ అప్లికేషన్, ప్రత్యేక పోర్టల్ అభివృద్ధి చేశారు. జిల్లాలో ఇందుకోసం ఇప్పటికే వ్యవసాయ శాఖా సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

 2023-24లో గుజరాత్‌లోని ఆరు జిల్లాల్లో పైలట్‌గా ప్రారంభించబడిన ఈ కార్యక్రమం, 2024 ఖరీఫ్ సీజన్‌కు ఇప్పటికే 436 జిల్లాలకు విస్తరించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో, డిజిటల్ పంట సర్వే 11 రాష్ట్రాలలో విస్తరించి, 2024-25 సంవత్సరానికి ఆహార ధాన్యాల ఉత్పత్తి  మొదటి ముందస్తు అంచనాలకు ఉపయోగించే డేటాను ఉత్పత్తి చేసింది. ముఖ్యంగా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు ఒడిశా రాష్ట్రాలు గణనీయమైన పురోగతిని చూపించాయి, డిజిటల్ సర్వేలు ఉత్తరప్రదేశ్‌లో వరి సాగు పెరిగినట్లు వెల్లడించాయి. భూమి కమతాలు, పంట నమూనాలపై కీలకమైన సమాచారాన్ని ఏకీకృతం చేస్తూ 10 మిలియన్ల ప్రత్యేక రైతు ఐడిలు లేదా కిసాన్ పత్రాలు జారీ చేశారు.  రాబోయే సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 110 మిలియన్ల రైతులకు ఈ గుర్తింపు వ్యవస్థను విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా డేటా ఖచ్చితత్వం, విశ్వసనీయతను పెంపొందించడానికి డిజిటల్ పంట సర్వే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అనుసందానం చేయనున్నారు. ఇది ఖచ్చితమైన పంట పటాలు, ప్రాంత అంచనాలను రూపొందించడానికి ఉపయోగపడుతుంది. సాగు చేసిన ప్రాంతాల గుర్తింపు,  మ్యాపింగ్‌ను సులభతరం అవుతుంది. రానున్న దిగుబడి అంచనా వేయవచ్చును. ఈ సాంకేతికతలు స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థలతో భాగస్వామ్యాలతో అనుసందానం చేశారు. డిజిటల్ సర్వే ప్లాట్-లెవల్, జియోట్యాగ్ చేసిన పంట డేటాను అందిస్తుంది. ఇదిఅత్యంత ఖచ్చితంగా పనిచేస్తుంది.  పంట బీమా, క్రెడిట్- లింక్డ్ రుణాలను అమలు చేయడంలో సహాయపడుతుంది. సమర్థవంతమైన ఎరువుల వాడకం, సమతుల్యమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. డిజిటల్ పంట సర్వే ఇప్పటికే వ్యవసాయ విధానం, అమలుపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది.ప్రభుత్వ సబ్సిడీల పంపిణీ, సేకరణ విధానాల ప్రణాళికకు విశ్వసనీయ డేటా దోహదపడుతుంది. ఈ వ్యవస్థ కారణంగా  మాన్యువల్ సర్వేలలో సాధారణ లోపాలను తగ్గించి, ఖచ్చితమైన డేటా వస్తుంది. ఈ సర్వే ద్వారా సేకరించిన సమాచారం ఉన్నది ఉన్నట్లు  అందుబాటులో ఉంటుంది. తద్వారా పంటల విస్తీర్ణాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఖచ్చితమైన పంట డేటా ద్వారా వ్యవసాయ ప్రణాళికలను మెరుగ్గా రూపొందించవచ్చు. ఈ-పంట, డిజిటల్ క్రాప్ సర్వే వ్యవసాయ రంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది పంటల వివరాలను ఖచ్చితంగా సేకరించడానికి, పంటల ఉత్పత్తిని అంచనా వేయడానికి, వ్యవసాయ ప్రణాళికలను మెరుగ్గా రూపొందించడానికి సహాయపడుతుంది. వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ డిజిటల్ పంట సర్వే వ్యవస్థను ప్రవేశపెట్టింది, ఇది మొబైల్ ఇంటర్‌ఫేస్ ద్వారా పొలం నుండి నేరుగా పంటల వివరాలను, ఫోటోలను సేకరించడం లక్ష్యంగా పనిచేస్తుంది.  రైతులకు వారి డేటా ఎలా పంచుకోవాలో పూర్తి నియంత్రణను ఇస్తుంది. ఇది నిర్దిష్ట ప్రయోజనాల కోసం అధికారం కలిగిన సంస్థలకు మాత్రమే పరిమితం చేయబడింది. అగ్రి స్టాక్  డేటా గోప్యతా లక్షణాలు దాని సమాఖ్య నిర్మాణం ద్వారా బలోపేతం చేశారు.  ఈ ప్రయోజనాల నుండి ఏ రైతు కూడా వదలివేయబడకుండా చూసుకోవడానికి గ్రామ స్థాయిలో శిబిరాలను నిర్వహిస్తారు. ఈ మిషన్ సజావుగా అమలు చేయడానికి కేంద్రం రాష్ట్రాలకు పరిపాలనా, సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కింద రాష్ట్ర రైతు రిజిస్ట్రీ, మహిళా రైతులతో సహా అన్ని భూస్వాములను కవర్ చేస్తారు. ఇది జిల్లాలో త్వరలో ప్రారంభం కానుంది.


విషయము:




 పంట వివరాలను పక్కాగా ఆన్‌లైన్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ క్రాప్‌ సర్వేను తీసుకొచ్చింది. గతంలోనే ఈ విధానం ఉండగా, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. కాగా, రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం డిజిటల్‌ క్రాప్‌ సర్వేకు నిర్ణయించి ఆ బాధ్యతలను ఏఈవోలకు అప్పగించిం ది. అయితే ఇప్పటికే పలు కీలక పనులు నిర్వహిస్తున్న తాము అదనంగా డిజిటల్‌ క్రాప్‌ సర్వే నిర్వహించలేమని పేర్కొంటున్నారు.

వ్యవసాయరంగంలో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చి అధిక దిగుబడులు సాధించేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తుంటుంది. అందుకు గత ప్రభుత్వ హయాంలో ఏఈవోలను (వ్యవసాయ విస్తరణ అధికారులు) నియమించింది. ఏఈవోలకు ఒక్కొక్కరికి 5,000 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిని కేటాయిస్తూ ఒక క్లస్టర్‌గా ఏర్పాటుచేసింది. ఏఈవోలు రోజు వారీగా సదరు క్లస్టర్‌ పరిధిలోని గ్రామాలకు వెళ్లి రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి పంటల సాగులో నూతన పద్ధతులు, మెళకువలు, తదితర విషయాలపై అవగాహన కల్పించాలి. ఇప్పటి వరకు ఈ విఽధులతో పాటు రుణమాఫీ ప్రక్రియ, రైతుబీమా, పంటల సాగు వివరాల నమోదును అదనంగా చేపడుతున్నారు. దీంతో పాటు ప్రతీ మంగళవారం వారికి కేటాయించిన మండలంలో ఏదైనా ఒక క్లస్టర్‌ పరిధిలో రైతు వేదికలో ఆయా ప్రాంత రైతులను సమీకరించి హైదరాబాద్‌ నుంచి జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేట్టు చేస్తున్నారు. అయితే తాజాగా, వ్యవసాయశాఖ డిజిటల్‌ క్రాప్‌ సర్వే చేయాలని ఏఈవోలను ఆదేశించింది. డిజిటల్‌ క్రాప్‌ సర్వేలో పంటల సాగును పక్కాగా నమోదు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుండగా, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దీనిపై పెద్దగా ఆసక్తి చూపలేదు. తాజాగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం డిజిటల్‌ క్రాప్‌ సర్వేకు నిర్ణయించింది. అయితే డిజిటల్‌ క్రాప్‌ సర్వే తమ వల్లకాదంటూ ఏఈవోలు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలు రకాల విఽధులు నిర్వహిస్తూ ఇబ్బందులు పడుతున్నామని, డిజిటల్‌ క్రాప్‌ సర్వే చేయలేమని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. ఈ సర్వేను గత నెల 24 నుంచి నిర్వహించాల్సి ఉండగా, ఉమ్మడి జిల్లాలో ఇంకా ప్రారంభం కాలేదు. తమకు సహాయకులుగా ఆయా గ్రామాల నుంచి ఎవరినైనా నియమిస్తే ఆలోచిస్తామని ఏఈవోలు చెబుతున్నారు.

డిజిటల్‌ క్రాప్‌ సర్వే అదనపు భారం

డిజిటల్‌ క్రాప్‌ సర్వే చేయలేమని, ఇది తమకు అదనపు భారమని ఏఈవోలు పేర్కొంటున్నారు. ఇప్పటికే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఏఈవోలు వినతి పత్రాలు అం దజేశారు. ఒక్కో గ్రామంలో ఉన్న సర్వే నెంబర్లలోని సబ్‌ డివిజన్ల వారీగా రైతుల పంటల సాగు వివరాలు, ఫొటోను వ్యవసాయ శాఖ రూపొందించి న యాప్‌లో నమోదు చేయాలి. ఒక్కో సర్వే నెంబర్‌లో పలు సబ్‌ డివిజ న్లు ఉంటాయి. పదుల నుంచి వందలు, వేల ఎకరాల్లో వ్యవసాయ భూ ములు ఉన్నాయి. అంతేకాకుండా పదుల సంఖ్యలో రైతులు కూడా ఉంటా రు. క్షేత్రస్థాయికి వెళ్లి ఈ సర్వే చేయడం తమవల్ల కాదని ఏఈవోలు అంటున్నారు.

క్షేత్రస్థాయిలో ఇబ్బందులు

డిజిటల్‌ క్రాప్‌ సర్వే చేయాలంటే క్షేత్రస్థాయిలో పలు ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు ఏఈవోలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,604 మంది ఏఈవోలలో సగానికి తక్కువగా మహిళలే ఉన్నారు. ఒక్కో ఏఈవోల పరిధిలో కనీసం ఐదు వేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు ఉన్నాయి. వాటి వివరాలు నమోదు చేయాలంటే నెలల సమయం పట్టే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ పొలాల వద్ద విషసర్పాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ఏఈవోలు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు వ్యవసాయ పొలాల ప్రాంతంలో పెద్దగా జనసంచారం ఉండదు. మహిళా ఏఈవోలు డిజిటల్‌ సర్వేకు ఎలా వెళ్తారని వారు ప్రశిస్తున్నారు.

అదనపు సిబ్బందిని నియమిస్తే

డిజిటల్‌ క్రాప్‌ సర్వే చేయాలంటే ప్రభుత్వం గ్రామానికి ఒకరి చొప్పున అదనపు సిబ్బందిని నియామకం చేయాలని ఏఈవోలు కోరుతున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో డిజిటల్‌ క్రాప్‌ సర్వే చేసేందుకు బీబీనగర్‌ మండలాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అయితే ఆ మండలంలో 20 మంది ఏఈవోలు డిజిటల్‌ క్రాప్‌ సర్వే చేయడానికి మూడు నెలల సమయం పట్టింది. దీని ప్రకారం ఒక్కో ఏఈవో వారికి కేటాయించిన క్లస్టర్‌లో డిజిటల్‌ క్రాప్‌ సర్వే చేయాలంటే నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అందుకోసం గ్రామానికి ఒకరిని ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో నియమించినట్లు విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ను నియమించాలని ఏఈవోలు డిమాండ్‌ చేస్తున్నారు. అంతేగాక మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో డిజిటల్‌ క్రాప్‌ సర్వే బాధ్యతను ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించారు.

ఏఈవోలపై ఒత్తిడి తెస్తున్న వ్యవసాయశాఖాధికారులు

డిజిటల్‌ క్రాప్‌ సర్వే చేయాల్సిందేనని ఏఈవోలపై రాష్ట్ర వ్యవసాయశాఖాధికారులు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే అన్ని జిల్లాల్లో డిజిటల్‌ క్రాప్‌ సర్వే ప్రారంభం కావాల్సి ఉండగా, ఇంకా మొదలు పెట్టలేదు. క్రాప్‌ సర్వే చేయకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఏఈవోలు జేఏసీగా ఏర్పడి వ్యవసాయశాఖాధికారులతో చర్చించాలని, ఆ చర్చల్లో సానుకూలాంగా నిర్ణయం రాని పక్షంలో తదుపరి కార్యాచరణ రూపొందించేందుకు ఏఈవోలు సిద్ధపడుతున్నారు. ఇటీవల సం బంధిత యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోని ఏఈవోలు రెండు రోజులు విధులకు గైర్హాజరైనట్టు వారి మస్టర్‌లో అధికారులు నమోదు చేశారు. సూర్యాపేట జిల్లాలో 82 క్లస్టర్ల పరిధిలో 6.70లక్షల ఎకరాలు, యాదాద్రి-భువనగిరి జిల్లా లో 92 క్లస్టర్లకు ఐదు లక్షల ఎకరాల్లో, నల్లగొండ జిల్లాలో 12లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులో ఉన్నాయి.

క్షేత్రస్థాయిలో ఇబ్బందులు : జానయ్య, ఏఈవోల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు

డిజిటల్‌ క్రాప్‌ సర్వేతో ఏఈవోలు క్షేత్రస్థాయిలో పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సర్వే నెంబర్లలోని ప్రతీ సబ్‌ డివిజన్‌ వారీగా పంటల వివరాలు సంబంధిత యాప్‌లో నమోదు చేయడం ఒక్క ఏఈవోలతో సాధ్యం కాదు. కేంద్ర ప్రభు త్వం డిజిటల్‌ క్రాప్‌ సర్వేకు నిధులు మంజూరు చేసింది. ఆ నిధులతో ఇతరులను నియమించి సర్వే చేయించాలి. ఏఈవోలపై వ్యవసాయశాఖాధికారులు ఒత్తిడి తేవడం బాధాకరం. ఇప్పటికే పలు రకాల విధులతో ఇబ్బందులు పడుతున్నాం. డిజిటల్‌ క్రాప్‌ సర్వే నుంచి ఏఈవోలను మినహాయించాలి.

రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది : శ్రీధర్‌రెడ్డి, డీఏవో సూర్యాపేట

డిజిటల్‌క్రాప్‌ సర్వేపై రాష్ట్ర స్థాయిలో అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.ఏఈవోలు మాత్రం డిజిటల్‌ క్రాప్‌ సర్వే తమవల్ల కాదంటున్నారు. అంతేగాక ప్రస్తుతం వానాకాలం వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఏఈవోలు డిజిటల్‌ క్రాప్‌ సర్వే చేయలేమని, మినహాయింపు ఇవ్వాలని ఇప్పటికే వినతిపత్రాలు అందించారు.డిజిటల్‌ క్రాప్‌ సర్వే ద్వారా ప్రతీ రైతు సాగు చే సిన పంటల వివరాలు నమోదు కానున్నాయి. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగ పథకాలను అమలుచేయాలని ప్రణాళిక రూపొందించింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *