బంగారుపాళ్యంలో జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శన
రోడ్ షోకు అనుమతి లేకుండా రెండు గంటలపాటు రోడ్డు షో
అడుగడుగున పోలీసుల ఆంక్షల ఉల్లంఘన
భారీగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు
అడ్డదారుల్లో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు
పోలీసులను తోచుకొని యార్డుల్లోకి వచ్చిన కార్యకర్తలు
పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదాలు
కాన్వాయ్ రోడ్డుమీద మామిడికాయల పారబోసి తొక్కించిన వైనం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా బల ప్రదర్శన చేశారు. పోలీసుల ఆంక్షలును లెక్కచేయకుండా వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. పోలీసులు రోడ్లను దిగ్బంధనం చేశారు. సుమారుగా 25 చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, వాహనాలు రాకుండా అడ్డుకున్నారు. అయితే అడ్డదారులలో, కాలినడకన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పోలీసుల ఆంక్షలను అడుగడుగున ఉల్లంఘించారు. జగన్మోహన్ రెడ్డికి రోడ్డు షో నిర్వహించడానికి అనుమతి లేకున్నా, ఆయన రోడ్డు షో నిర్వహించారు. కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేసుకుంటూ సుమారు మూడు గంటల పాటు రోడ్ షో జరిగింది. ఈ సందర్భంగా పోలీసులకు వైసీపీ నాయకులకు తీవ్ర స్థాయిలో వాగ్వివాదాలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన గొడవలో చంద్రగిరి చెందిన ఒక యువ నాయకునికి తలకు గాయమైంది. కొంతమంది వైసీపీ నాయకులు ఒక దినపత్రిక ఫోటోగ్రాఫర్ పైన దాడి చేసి గాయపరిచారు. కెమెరా లాక్కొని ఫోటోలను డిలీట్ చేశారు.
జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పోలీసులు హెలిపాడ్ లో 30 మందికి, మార్కెట్ యార్డులో 500 మందికి మాత్రమే అనుమతి మంజూరు చేశారు. అయితే వైసిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి పర్యటన కారణంగా జిల్లా వ్యాప్తంగా జన సమీకరణ చేశారు. సుమారుగా 20 నుంచి 25 వేల మందిని సమీకరించడానికి ప్రయత్నాలు జరిగాయి. మండలాల వారీగా, గ్రామాల వారీగా వాహనాలను ఏర్పాటు చేసి వైసిపి నాయకులకు లక్ష్యాలను నిర్దేశించారు. ఈ మేరకు వివిధ వాహనాలలో బంగారుపాళ్యంకు తరలి రావడానికి వైసిపి నాయకులు సమాయత్తమయ్యారు. అయితే, మంగళవారం నుంచి పోలీసులు ఎక్కువమంది రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. పూతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాలలోని వైసిపి నాయకులు 377 మందికి నోటీసులు జారీ చేశారు. వీరు కార్యకర్తలను సమీకరించి తీసుకొని రాకూడదని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా వైసీపీ నాయకులు సుమారు 3500 ద్విచక్ర వాహనాలు, 1,500 కార్ల ద్వారా జనాలను సమీకరించడానికి ప్రయత్నాలు చేశారు. జిల్లా ఎస్పీ మణికంఠ బంగారుపాళ్యంలోనే మకాం పెట్టి ఎక్కువ మంది ప్రజలు రాకుండా చర్యలు తీసుకున్నారు. పోలీసులు బంగారుపాళ్యంకు వచ్చే అన్ని రహదారులను దిగ్భంధం చేశారు. చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఆధార్ కార్డు చూపించిన వారిని లోపలికి అనుమతించారు. అయితే పోలీసుల కనులు కప్పి అడ్డదారులలో భారీగా వైసీపీ కార్యకర్తలు బంగారుపాళ్యం చేరుకున్నారు. హెలిపాడ్ లో 30 మందికి అనుమతి అయితే సుమారుగా 500 మంది చేరుకున్నారు. మామిడికాయల యార్డుకు వెనుక వైపు ఉన్న ప్రహరీ గోడ దూకి చాలామంది కార్యకర్తలు లోనికి వచ్చారు. బయట ఉన్న కార్యకర్తలు కూడా పోలీసులను దోచుకుని ఒక్కసారిగా లోపలికి తోచుకుని వచ్చారు. కార్యకర్తలను అదుపు చేయడం పోలీసులు కూడా సాధ్యం కాలేదు. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ బయలుదేరిన కొంతసేపటికి చంద్రగిరికి చెందిన ఒక నాయకుని తలకు దెబ్బ తగిలిందని అక్కడికి చేరుకున్నాడు. అతనిని పరామర్తడానికి జగన్మోహన్ రెడ్డి వాహనం నుండి దిగడానికి ప్రయత్నం చేశారు. అయితేపరిస్థితి అదుపుతప్పుతోందని జిల్లా ఎస్పీ మణికంఠ అడ్డుకున్నారు. దీంతో జిల్లా ఎస్పీకి జగన్ తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. చివరకు జగన్మోహన్ రెడ్డి కిందికి దిగకుండా రోడ్ షో ను కొనసాగించారు. జగన్మోహన్ రెడ్డి రోడ్ షోలో అడుగడుగున ప్రజలు నీరాజనాలు పలికారు. మామిడికాయలు చేతబట్టి స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులు ఇచ్చారు. రోడ్డుకి ఇరువైపులా ప్రజలు నిలబడి చేతులు ఊపుతూ స్వాగతం పలికారు. మిద్దెల మీద, మేడల మీద నిలబడి జగన్ ను తిలకించారు. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ చాలా మెల్లిగా కదిలింది. అనుకున్న సమయం కంటే రెండు గంటల ఆలస్యంగా మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. అక్కడ కొంతమంది రైతులతో మాట్లాడి, మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులకు వైసీపీ నాయకులకు అక్కడక్కడ గొడవలు, వాగ్వివాదాలు జరిగాయి. హెలిపాడ్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళలు, విజయానంద రెడ్డి కింద పడ్డారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, విజయానంద రెడ్డి వాహనాలను లోనికి అనుమతించకపోవడంతో పోలీసులతో వాదానికి దిగారు. కొందరు కార్యకర్తలు కూడా పోలీసులు మీద చాలా దురుసుగా ప్రవర్తించారు. ఒక కార్యకర్త పోలీసులను ఉద్దేశించి రప్పా రప్పా నరుకుతామని హెచ్చరించారు. పోలీసులు ఎంత నియంత్రించిన భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. తరలి వచ్చిన వారికి వైసిపి నాయకులు భోజనం, ఇతర ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా జరిగిన గొడవ కారణంగా వైసిపి కార్యకర్తకు తలకు గాయమైందని కొందరు చెబుతుండగా, పోలీసుల లాఠీ చార్జిలో గాయమైందని మరికొందరు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ప్రారంభం అయిన తర్వాత నాలుగు ట్రాక్టర్లతో మామిడికాయలను రోడ్డు మీద పోశారు. వాటిని ట్రాక్టర్లతో తొక్కించారు. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కూడా అదే దారిలో రావడం విశేషం. జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా సమీప గ్రామాలలో కూడా పోలీసులు నిఘా పెట్టారు. డ్రోన్ల ద్వారా పర్యవేక్షించారు. అనుమతి లేకుండా బంగారుపాలెంలో ఏర్పాటు చేసిన కటౌట్లు, బ్యానర్లను రాత్రికి రాత్రి పోలీసులు తొలగించారు. పోలీసుల ప్రయత్నం కారణంగా బంగారుపాళ్యం కు రావాల్సిన స్థాయిలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాలేదు. వైసీపీ నాయకులు 25 వేల మందిని సమీకరించడానికి ప్రయత్నాలు చేశారు. అయితే బుధవారం ఐదు నుంచి ఏడు వేల మంది వరకు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు అంచనా. పోలీసులు చాయశక్తులా పరిస్థితులను అదుపు చేయడానికి, ప్రశాంతంగా కార్యక్రమం జరగడానికి చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి, మాజీ మంత్రులు పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి మాజీ ఎమ్మెల్యేలు లలిత కుమారి, సునీల్, వెంకటేష్ గౌడ్, నియోజకవర్గ ఇన్చార్జులు విద్యానంద రెడ్డి, కృపా లక్ష్మి , రాజేష్, వైసీపీ నేత అనిషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా కార్యక్రమం ముగియడంతో పోలీసులు ఊపిరిపించకున్నారు. ఊహించని విధంగా రోడ్డుమీద నాలుగు ట్రాక్టర్ల మామిడికాయలను పారబోయడం పోలీసులకు అంచనాలకు అందలేదు. ఈ విషయమై పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఊహించని విధంగా ట్రాక్టర్లను తీసుకుని వచ్చి రోడ్డు మీద మామిడికాయలను పారబోసి, వాటిని ట్రాక్టర్లతో తొక్కించారు. ఈ విషయమై పోలీసులు ట్రాక్టర్ల యజమానుల వివరాలను, మామిడికాయల యజమానుల వివరాలను సేకరిస్తున్నారు. వారి మీద పోలీసు కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.
పో రై గంగ 3 జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి తరలివచ్చిన ప్రజలు
గంగ 4 అభిమానులతో సెల్ఫీలు తీసుకుంటున్న జగన్
గంగ 5 ప్రజలను బారికేట్లతో నిలువరించిన పోలీసులు
గంగ 6 మామిడికాయలతో జగన్కు స్వాగతం

