16, జులై 2025, బుధవారం

ధర తగ్గిన డ్రాగన్ ఫ్రూట్

కిలో రూ. 300 నుంచి రూ. 100కు పడిపోయిన ధరలు 

కొనుగోలుదారులలో ఆనందం 

ఆవేదనకు గురవుతున్న రైతులు

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

పోషకాల గని అయిన డ్రాగన్ ఫ్రూట్ ధరలు చిత్తూరు జిల్లాలో ఘనంగా తగ్గాయి. ఒకప్పుడు ధనవంతులు మాత్రమే కొనుగోలు చేసే డ్రాగన్ ఫ్రూట్ ఫలాలను ప్రస్తుతం సామాన్య ప్రజలు కూడా కొనుగోలు చేస్తున్నారు. గతంలో కిలో 2005 నుంచి 300 రూపాయలు పలికిన డ్రాగన్ ఫ్రూట్ ప్రస్తుతం 100 రూపాయలకే లభ్యమవుతుంది. ఒక్కొక్క పండు 25 రూపాయలకే జరుగుతుంది. కర్ణాటక, అన్నమయ్య జిల్లాల నుంచి చిత్తూరు పట్టణానికి భారీగా డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకుని వస్తున్నారు. రోడ్లమీద వాహనాలను పెట్టీ కిలో 100 రూపాయల వంతున విక్రయిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ ధరలు తగ్గడంతో వినియోగదారులలో ఆనందం వ్యక్తం అవుతుంది. అయితే డ్రాగన్ ఫ్రూట్ పండించిన రైతుల మాత్రం గిట్టుబాటు కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


  ఆరోగ్యానికి ప్రధాయనిగా డ్రాగన్ ఫ్రూట్ ప్రసిద్ధి పొందింది. దీని గుజ్జు  తెలుపు లేదా ఎరుపు రంగు గుజ్జుతో ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ మెక్సికో, సెంట్రల్ అమెరికాలలో పుట్టిన, ఇప్పుడు  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక  రాష్ట్రాల్లో కూడా భారీగా సాగుచేస్తున్నారు.డ్రాగన్ ఫ్రూట్ లో అధిక పీచు ఉండడం వలన జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఐరన్, విటమిన్ సి ఎక్కువగా ఉండటం వలన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించడంలో సహాయపడుతుంది. తక్కువ క్యాలరీలు ఉన్నందున డైయట్ లో భాగంగా తీసుకోవచ్చు. చర్మం, జుట్టు ఆరోగ్యానికి సహాయపడే యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ వేడి, తేమ కలిగిన ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. వేసవి లేదా వర్షాకాలం ప్రారంభంలో నాటాలి. మొలక వేసిన తర్వాత 1.5 నుండి 2 సంవత్సరాలలో దిగుబడి వస్తుంది. ప్రామాణికంగా ఒక ఎకరాకు 5 లక్షల రూపాయలు వరకు పెట్టుబడి పెట్టాలి, కానీ ఆదాయంగా 10 నుండి 12 లక్షల రూపాయల వరకు వచ్చే అవకాశముంటుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఒకప్పుడు ఖరీదైన పండుగా ఉండేది. దీనిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని, వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి దేశంలోనూ ఈ పంట సాగు పెరిగింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల రైతులు అందిపుచ్చుకున్నారు. అప్పటి నుంచి ఒక్కో పండు ధర రూ.200 నుంచి రూ.100 తగ్గింది. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వెల్లువెత్తుతున్న దిగుమతులతో ఉంది. ఇప్పడు ఈ డ్రాగన్​ ఫూట్​ ధర నాలుగో వంతుకు పడిపోయింది. దీంతో తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలుగు రాష్ట్రాల రైతులు వాపోతున్నారు. అయితే మన రాష్ట్రంలో సైతం అత్యధికంగా ఈ డ్రాగన్ పండడంతో పలువురు జామ పండు మాదిరిగా కొనుగోలు చేస్తున్నారు. జామ పండు కంటే డ్రాగన్ ఫ్రూట్ ధరలు తక్కువగా ఉన్నాయి.  డ్రాగన్ ఫ్రూట్స్ చూడటానికి పెద్ద సైజులో ఎరుపు రంగులో నిగినిగలాడుతూ కనిపిస్తున్న ఈ పండు తినాలి అంటే, డబ్బున్న మహారాజులు మాత్రమే తినాలి అన్న విధంగా వాటి రేట్లు గతం వరకు ఉండేవి. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ పంట మన ప్రాంతం కాకపోవడం దీనికి ప్రధాన కారణం. నీరసంగా ఉన్నవారు ఈ డ్రాగన్ ఫ్రూట్ తినడం ద్వారా శక్తివంతులుగా మారుతారని వైద్యులే సూచించడంతో, వీటిని తినడానికి ప్రజలు మక్కువ చూపుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇదంతా గత పరిస్థితి అని చెప్పుకోవచ్చు. తాజాగా జామపళ్ళు మాదిరిగా డ్రాగన్ పళ్ళు మార్కెట్లోనే కాదు, వాటిని పెంచుతున్న తోటల వద్ద సైతం అమ్ముడుపోతున్న పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఈ డ్రాగన్​ మొక్కలను నాటి నాలుగేళ్ల పాటు సంరక్షిస్తే ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం పంట చేతికి వస్తుంది. ఎకరాకు 6 టన్నుల వరకూ దిగుబడి వస్తుంది. ఆ తర్వాత పంట చేతికి వచ్చేవరకూ రూ.5 లక్షల పెట్టుబడి అవుతోందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​లో 1100 ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలో ఈ పంట సాగు భారీగా పెరిగిపోయింది. దీంతో అక్కడి రైతులూ తెలుగు రాష్ట్రాలలో మార్కెట్​కు తెచ్చి తెలుగు రాష్ట్రాల రైతుల కంటే తక్కువ ధరకు ఈ పండ్లను విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల రైతులు ఉత్పత్తుల విక్రయాలు మందగించాయి. చిత్తూరు పట్టణం శివార్లలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహనాలు పెట్టి ఒక్కో పండును రూ.25కే అమ్ముతున్నారు. మార్కెట్​లోని ఏజెంట్లు సైతం వారి వద్దకే వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. గతంలో  డ్రాగన్​ ఫ్రూట్​ డిమాండ్​ దృష్టా ఎకరానికి రూ.6 లక్షల ఆదాయం వస్తుండేది. రూ.5 లక్షల పెట్టుబడి పోనూ ఐదో ఏటా నుంచి కనీసం ఎకరానికి రూ.లక్ష లాభం మిగిలేది. కానీ ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఈ పండ్ల రవాణా జిల్లాకు మొదలయ్యాక రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల ఆదాయమే వస్తోంది. దానిలో రూ.2 లక్షలకుపైగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గడంతో ప్రజలు మాత్రం ఆనందంగా డ్రాగన్ ఫ్రూట్లను కొనుగోలు చేస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *