చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో జూనియర్ కళాశాలలో గురువారం పేరెంట్ టీచర్స్ సమావేశాలు అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో జరిగాయి. జిల్లాలోని 62,838 పాఠశాలల్లో పేరెంట్ టీచర్స్ సమావేశాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో 38,661 మంది తల్లులు, 22,819 మంది తండ్రులు, 865 మంది సంరక్షకులు మొత్తం 62,345 మంది విద్యార్థుల తరఫున పాల్గొన్నారు. జిల్లాలో 7,962 మంది ఉపాధ్యాయులు, 2,07,621 మంది విద్యార్థులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు 11,561 మంది, ఓల్డ్ స్టూడెంట్స్ 1,438 మంది, దాతలు 1,316 మంది, ప్రజా ప్రతినిధులు1403 మంది, అధికారులు 1455 మంది, ఇతర ఆహ్వానితులు 2047 మంది, ఇతరులు 26,217 మంది మొత్తం 45,437 మంది ఈ సమావేశాలకు హాజరయ్యారు. బంగారుపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో చిత్తూరు పార్లమెంటు సభ్యుడు దగ్గుమల్ల ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొన్నారు. రామకుప్పం మండలం వీర్నమలలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ హాజరయ్యారు. ఎస్ఆర్ పురం మండలం కొత్తపల్లి మిట్టలో జరిగిన సమావేశంలో గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్, సర్వ శిక్ష అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మద్దిపట్ల వెంకటరమణ హాజరయ్యారు. పాలసముద్రం మండలం ఎస్ ఆర్ ఖండ్రిగలో లో జరిగిన సమావేశంలో సమగ్ర శిక్ష అభియాన్ ఏపీ సి వెంకటరమణ హాజరయ్యారు. కల్లూరులో జరిగిన సమావేశంలో పుంగనూరు టిడిపి ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి హాజరయ్యారు. రొంపిచర్ల ఏపీ మోడల్ స్కూల్ లో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు హాజరయ్యారు. ఎస్ఆర్ పురం మండలం మద్దికుప్పం ఎంపీపీ పాఠశాలలో జరిగిన సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి హాజరయ్యారు. సమగ్ర శిక్ష అభియాన్ సెక్టరల్ అధికారులు 7 మంది తమకు కేటాయించిన నియోజకవర్గంలోని పాఠశాలలో పేరెంట్ టీచర్స్ సమావేశాలకు హాజరై, వాటిని పర్యవేక్షించారు.