3, జులై 2025, గురువారం

ప్రజలకు దగ్గరైన వారు నాకు దగ్గరగా ఉంటారు

ప్రజల్లో చెడ్డ పేరుంటే నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తాను

కుప్పంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఫార్మూలా

పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 

చిత్తూరు, జులై 3 (ఆంధ్రప్రభ బ్యూరో) ప్రజలకు దగ్గరైన వారు నాకు దగ్గరగా ఉంటారు. ప్రజల్లో చెడ్డ పేరుంటే నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తాను. కుప్పంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఫార్మూలాను అమలు చేస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కుప్పం పరిటాల సందర్భంగా నియోజకవర్గ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. సుపరిపాలనలో తొలి అడుగు-ఇంటిింటి ప్రచారం కార్యక్రమ నిర్వహణపై చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ కుటుంబ సభ్యులకు సమాజంలో శాశ్వతంగా మంచి పేరు ఉండాలని ఆకాంక్షించారు. పార్టీ కోసం పని చేసిన వారికి, గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డ వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. టీడీపీది పెద్ద సైన్యం. ఎవరి పరిధిలో వారు చేస్తే అద్భుతాలు సాధించగలం. రాబోయే నెల రోజుల్లో 100 శాతం ఇంటిింటికి ప్రచారం చేయాలి. పాజిటివ్ పర్సెప్షన్ 5-6 శాతం పెరగాలి అంటూ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. లీడర్ షిప్ ట్రైనింగ్ కార్యక్రమాలు త్వరలో చేపడనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పనితో సమానంగా పార్టీ కోసం తాను పని చేస్తునాన్నని చెప్పారు. పనులు చేయడం ఎంత ముఖ్యమో, చేసిన పనిని చెప్పుకోవడం కూడా అంతే ముఖ్యమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తాను మొదటి సారి కుప్పానికి వచ్చినప్పటి కంటే ఇప్పుడు ఎంతో మార్పు వచ్చిందన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు, ఇంటింటి ప్రచార కార్యక్రమం మొదలు పెట్టాం. ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు.. దాన్ని ప్రజలకూ తెలియచెప్పాల్సిన బాధ్యత ఉందని కార్యకర్తలను కోరారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పామనీ, హామీలిచ్చిన విధంగా పని చేస్తున్నామని ప్రజలకు చెప్పాలని కోరారు. కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేపట్టినప్పుడు ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం పెన్షన్లల్లో కోత పెట్టిందని, మనం అర్హులందరికీ పెన్షన్లు ఇస్తున్నామని వివరించారు. అభివృద్ధికి బ్రాండ్ టీడీపీ అయితే.. టీడీపీకి  బ్రాండ్ కార్యకర్తలేనని స్పష్టం చేశారు. నేతలు అటూ, ఇటూ మారుతున్నారేమో కానీ కార్యకర్తలే శాశ్వతంగా ఉంటారని కార్యకర్తలను అభినందించారు. డబుల్ సంక్షేమం చేస్తున్నామనీ, ఫలితం కూడా డబుల్ ఉండాలనే రీతిలో కేడర్ పని చేయాలని నిర్దేశించారు. కుప్పంలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులే నడపనున్నామని, అవీ కూడా ఏసీ బస్సులే ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కుప్పంలో 100 శాతం సోలార్ రూఫ్ టాప్ చేయించాలని ఎందుకు నాయకులందరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు. కుప్పానికి ఎయిర్ పోర్టు రాబోతోందనీ, అభివృద్ధిని అడ్డుకో వద్దని వైసీపీ నాయకులకు హితవపలికారు. గతంలో  అరాచకాలు చేసి, 11కు పడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. అభివృద్ధిని అడ్డుకోవద్దని వైసీపీకి హితం పలికారు. కుప్పం అభివృద్ధికి ప్రజల సహకారం కూడా కావాలన్నారు. మల్లప్పకొండ, నన్యాల్ వంటి వాటిని టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే కుప్పం పట్టణానికి హంద్రీ-నీవా నీళ్లు వస్తున్నాయనీ, భవిష్యత్తులో కుప్పంలో కరవు అనేదే లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. పొలిటికల్ గవర్ననెన్స్ చేస్తున్నామని, అభివృద్ధి, సంక్షేమం అంతా కార్యకర్త ద్వారానే జరగాలని కోరారు. ప్రజలకు మంచి జరిగితే టీడీపీ కార్యకర్తే గుర్తుకు రావాలన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 'దుర్మార్గపు' పాలనలో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు ఎదుర్కొన్న సవాళ్ల గురించి తనకు తెలుసునని అన్నారు. పార్టీ విజయానికి శ్రద్ధగా సహకరించిన వారికి ప్రతిఫలమివ్వడానికి తన నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు. కుప్పంలో అంకితభావంతో పనిచేసే పార్టీ కార్యకర్తలకు ప్రతిఫలం ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపి ప్రసాదరావు. ఎం ఎల్ సి కలిచెర్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

పో రో. గంగ 5 కుప్పంలో టిడిపి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *