3, జులై 2025, గురువారం

చంద్రబాబు సహకారంతోనే మూడో సారి కేంద్రం కూటమి ప్రభుత్వం

 
కేంద్ర సామాజిక న్యాయం,సాధికారత శాఖ మంత్రి రాందాస్ అధవాలే

చిత్తూరు, జులై 3 (ఆంధ్రప్రభ బ్యూరో) : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషి కారణంగా కేంద్రంలో బిజెపి మూడవసారి అధికారం చేపట్టిందని కేంద్ర సామాజిక న్యాయం,సాధికారత శాఖ మంత్రి రాందాస్ అధవాలే స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తుందని హామీ ఇచ్చారు. గురువారం చిత్తూరు పివికేఎన్ డిగ్రీ కళాశాల ఆవరణంలో  జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వము, అలీంకో సహకారంతో  వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, వినికిడి యంత్రాలు,తదితర ఉపకరణాలను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, చిత్తూరు ఎంపీ డా. దగ్గుమళ్ళ ప్రసాద్ రావు, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడల్, డిఆర్వో కె మోహన్ కుమార్, మున్సిపల్ మేయర్ ఆముద అదనపు ఎస్పి రాజశేఖర్, పుంగనూరు టిడిపి ఇంచార్జి చల్లా బాబు, బిజెపి నాయకులు అట్లూరి శ్రీనివాసులు, రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రివర్యులు మాట్లాడుతూ రాందాస్ అధవాలే  మాట్లాడుతూ దివ్యాంగులకు ఆత్మవిశ్వాసాన్ని నింపి, వాళ్ళు సామాన్య పౌరుల వలె అన్ని రకాల హక్కులను అనుభవించడానికి అనువన వాతావరణాన్ని  తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. అమృత ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ సమయంలో దివ్యాంగుల చట్టాన్ని సవరించి ఏడు రకాలుగా ఉన్న దివ్యాంగులను 21 రకాలకు పెంచడం జరిగిందన్నారు.. దివ్యాంగుల రిజర్వేషన్లను మూడు శాతం నుంచి నాలుగు శాతం వరకు పెంచామని తెలిపారు. దివ్యాంగులకు సౌకర్యవంతంగా 516 కోట్ల రూపాయలతో 1314 భవనాలను మార్పు చేయడం జరిగిందన్నారు. విమానాశ్రయాలలో, రైల్వేస్టేషన్లో వారికి అనుగుణంగా సదుపాయాలను ఏర్పాటు చేశామన్నారు. బస్సులను కూడా వారికి అనుకూలంగా తయారు చేస్తున్నామని, మరుగుదొడ్లు తదితరులు వాళ్లకు అనుకూలంగా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 2. 81 లక్షల మందికి 921 కోట్ల రూపాయలతో ఉపకరణాలను అందజేయడం జరిగిందన్నారు. దివ్యాంగుల సమాచారం, వార్తల కోసం ప్రత్యేకంగా ఏడు వెబ్సైట్లు రూపొందించామన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఒక డిక్షనరీ ని కూడా రూపొందిస్తున్నామని తెలిపారు. ఒకటవ తరగతి నుంచి అన్ని తరగతులకు దివ్యాంగులకు అనుకూలమైన రీతిలో పాఠ్యపుస్తకాలను అనువాదం చేస్తున్నామని, ప్రస్తుతం ఆరవ తరగతి వరకు ఈ ప్రక్రియ పూర్తయింది అన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి బండి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో బుద్ధి మాంద్యం, అంగ వైకల్యం కలిగిన వారికి సహాయం అందించడానికి ప్రభుత్వముతో కలిసి కొన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయని, అందులో అలింకో సంస్థ ఒకటని అని తెలిపారు. సామాన్య ప్రజలతో ఏమాత్రం తీసిపోరని నమ్మకం కలిగించేలా వారికి ఉపకారణాలను అందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంగవైకల్యం కలిగిన వారికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా రూ.6,000, రూ. 10,000 మరియు రూ.15,000లు పెన్షన్ల అందజేయడం జరుగుతున్నదని, ఈ ఘనత మన ముఖ్యమంత్రి కే దక్కుతుందని తెలిపారు. దీంతోపాటు అంగవైకల్యం కలిగిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ట్రై సైకిళ్ళు , బ్యాటరీ సైకిల్ లు అందించడం జరుగుతుందన్నారు. విభిన్న ప్రతిభావంతులకు సహాయం అందించడానికి ప్రభుత్వ యంత్రాంగం స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తుందని తెలిపారు. చిత్తూరు ఎం పి ప్రసాదరావు  మాట్లాడుతూ బుద్ధిమాంద్యం, అంగ వైకల్యం కలిగిన వారికి కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయం మరియు సాధికార మంత్రిత్వ శాఖ ద్వారా ఉపకారణాలను అందించడంలో భాగంగా గత డిసెంబర్లో ఒక వారం రోజుల పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ చేపట్టడం జరిగిందని తెలిపారు. అలింకో సంస్థ ద్వారా అర్హుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి వారికి కృత్రిమ అవయవాలు, వినికిడి యంత్రాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రూ.4.69 కోట్లతో జిల్లాలోని 3,678 మందికి ఉపకరణాలను అందించడం జరిగింది అన్నారు. ప్రభుత్వం ద్వారా అందించే ఉపకారణాల ద్వారా విన్న ప్రతిభవంతులు సామాన్య ప్రజలతో సమానంగా జీవనం గడపాలని ఆశిస్తున్నాను అని తెలిపారు. చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్ నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయ మరియు సాధికారిక మంత్రిత్వ శాఖ ద్వారా చిత్తూరు నియోజకవర్గంలోని 60 సంవత్సరాలు దాటిన వయో వృద్ధులకు మరియు విభిన్న ప్రతిభావంతులకు ఉపకారణాలను అందించడం జరిగిందని , చిత్తూరు నియోజకవర్గం సంబంధించి 68 మందికి ట్రై సైకిల్లు, 383 మందికి హీరింగ్ ఎయిడ్స్, 17 మందికి వీల్ చైర్స్ 110 టచ్ ఫోన్స్, 62 వాకింగ్ స్టిక్స్, 97 మందికి బ్లైండ్ వాకింగ్ స్టిక్స్ , మొత్తం 970 మందికి ఉపకరణాలు అందించడం జరిగిందని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 

పో రై గంగ 1 దివ్యాంగులకు మూడు చక్రాల సైకిల్ ను పంపిణీ చేస్తున్న కేంద్రమంత్రి రాందాస్ అధవాలే

గంగ 2 దివ్యాంగులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న కేంద్రమంత్రి రాందాస్ అధవాలే

గంగ 3 సమావేశంలో ప్రసంగిస్తున్న రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి

గంగ 4 సమావేశానికి హాజరైన దివ్యాంగులు


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *