29, జులై 2025, మంగళవారం

అష్ట కష్టాలతో ముగిసిన మామిడి సీజన్

బిల్లుల కోసం రైతుల ఎదురు చూపులు 

రూ. 4 మద్దతు ధర చెల్లింపునకు జాబితాలు రెడి

గ్రామ సచివాలయాల్లో జాబితాల ప్రదర్శన 


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

ఈ సంవత్సరం మామిడి సీజన్ అష్ట కష్టాలతో ముగిసింది మామిడి రైతులకు ఒక చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఈ సీజన్ లో పడినన్ని కష్టాలు మామిడి రైతులు ఎప్పుడు పడలేదు. మామిడి కాయలు ఫ్యాక్టరీకి సరఫరా చేయడానికి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎట్టికేలకు మామిడి సీజన్ ముగిసింది. ఇప్పటివరకు చిత్తూరు జిల్లాలో 3.30 లక్షల టన్నుల తోతాపురి మామిడిని ఫ్యాక్టరీలకు, ర్యాంపులకు సరఫరా చేశారు. 41,235 మంది రైతులు ఈ మామిడికాయలను సరఫరా చేశారు. మామిడి సీజన్ పూర్తయిన ఇప్పటివరకు మామిడి రైతులకు బిల్లులు అందకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఈ సీజన్ కు 5 లక్షల టన్నుల మామిడి దిగుబడి వస్తుందని ఉద్యానవన శాఖ అధికారులు వేశారు. అయితే ఫ్యాక్టరీలకు, ర్యాంపులకు ఇప్పటివరకు 3.30 లక్షల అటనలు మాత్రమే సరఫరా అయింది. సాధారణంగా జిల్లాలోని మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు రైతుల నుంచి మామిడిని తీసుకున్న 15 రోజుల తర్వాత అందుకు సంబంధించిన బిల్లులను చెల్లించేవారు. ఈ సంవత్సరం చాలా ఫ్యాక్టరీల్లో ఇప్పటివరకు రైతులకు చెల్లింపులు ప్రారంభం కాలేదు. మామిడి గుజ్జు పరిశ్రమల్లో పేరుకుపోయిన పల్ప్ నిల్వల కారణంగా రైతులకు చెల్లింపులు చేయలేకపోతున్నామని ఫ్యాక్టరీ యజమానులు అంటున్నారు. జిల్లాలో మామిడి పల్ప్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. విదేశాలకు కూడా ఎగుమతులు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ అమ్మకాలు మందకొడిగా సాగుతుండడంతో మామిడి ప్యాక్టరీలకు తగినంత నిధులు లేవని తెలుస్తోంది. కొన్ని ఫ్యాక్టరీలు మాత్రం బ్యాంకుల వద్ద రుణం తీసుకొని చిన్నకారు రైతులకు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తరఫున నాలుగు రూపాయల మద్దతు ధరను ప్రకటించారు. ఈ మద్దతు ధర కూడా ఇప్పటివరకు రైతులకు అందలేదు. ఫ్యాక్టరీలకు మామిడిని సరఫరా చేసినప్పుడు ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు ఆ రైతులకు సంబంధించిన ఇన్వాయిస్, ఆధార్, బ్యాంకు అకౌంట్ నెంబర్లను తీసుకున్నారు. దీని ప్రకారం రైతులకు ఫ్యాక్టరీ సరఫరా చేసిన మామిడికి నాలుగు రూపాయల వంతున రైతుల ఖాతాలలో జమ చేయడానికి కసరత్తు చేశారు. ఈ కసరత్తు దాదాపుగా పూర్తయింది. మామిడి రైతుల వివరాలను గ్రామ సచివాలయాలు వారిగా నోటీసు బోర్డులలో ప్రకటించారు. రైతులు తమ పేర్లను సరిచూసుకొని లేకుంటే తమకు తెలియజేయాలని కోరారు. ఆగస్టు నెల నుంచి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నాలుగు రూపాయల మద్దతు ధరను వాళ్ల బ్యాంక్ అకౌంట్లో వేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కూడా ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ అధికారులతో సమీపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు సేకరించిన మామిడికి రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న రూ.4.00 సబ్సిడీ మొత్తం రూ.150 కోట్లు రైతులు ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. తోతాపురి మామిడి రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న సబ్సిడీ దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత మండల అధికారులపై ఉందని తెలిపారు. జూన్ నెల వరకు సేకరించిన మామిడికి సంబంధించి సబ్సిడీ జూలై నెలలో, అలాగే జూలై నెలలో సేకరిస్తున్న మామిడికి సంబంధించి సబ్సిడీ ఆగస్టు నెలలో రైతులు ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఆగస్టు ఒకటో తేదీ లోపు అన్ని రికార్డులు నమోదు ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. రైతుల బ్యాంకుల ఖాతాలకు సంబంధించి బ్యాంక్ వివరాలు, ఐఎఫ్ ఎస్ సి కోడ్ మరియు ఈ క్రాప్ పంటలను పరిశీలించాలని తెలిపారు.  ఇతర రాష్ట్రాలకు తరలించిన మామిడి రైతులకు ప్రభుత్వం మద్దతు ధర అందజేస్తుందని తెలిపారు. అటువంటి నివేదికలు జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వే ప్రక్రియ జాగ్రత్తగా అంశాలను దృష్టిలో పెట్టుకొని, రైతుకు ఈక్రాపింగ్ జరిగిందా లేదా పరిశీలించాలనీ, ఆధార్ కార్డు అనుసంధానం అయ్యిందా లేదా పరిశీలించాలని కోరారు.  రైతుల డేటా మండల స్థాయి బృందాలకు పంపిణీ చేశామని, వీటిని పరిశీలించాలని, పరిశీలన అనంతరం మండల వారీగా రైతుల జాబితాను తయారు చేసి, తహసీల్దార్ సంతకాలతో ధృవీకరించాలన్నారు.

*మామిడి రైతుల వినతి *

మామిడి రైతుల సంక్షేమ సంఘం తరఫున మంగళవారం ప్రతినిధులు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 12 రూపాయల మద్దతు ధర అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అలాగే కొందరు ర్యాంపు యాజమానులు కిలోకు 2.50 రూపాయలు, గుజ్జు యజమానులు ఐదు రూపాయలు చెల్లిస్తున్నారని, మిగిలిన మొత్తాన్ని కూడా ఆగస్టు 10వ తారీఖు లోపు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. నీలం రకానికి కూడా సబ్సిడీ వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని, జిల్లాకు మామిడి బోర్డు మంజూరు చేయడానికి కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా మామిడి రైతులకు సబ్సిడీ ఇస్తున్నందున రైతుల నష్టపోకుండా 12 రూపాయలు చెల్లించాలని కోరారు. జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో సంక్షేమ సంఘం నాయకులు ఆనంద నాయుడు, జనార్ధన్, హరిబాబు నాయుడు తదితరులు ఉన్నారు.

పో రై. గంగ 1 మామిడి 

గంగ 2 కలెక్టర్ ను కలిసిన మామిడి రైతులు 


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *