30, జులై 2025, బుధవారం

జిల్లాకు కొత్తగా 4,880 పెన్షన్లు మంజూరు

వితంతువులకు భారీగా 4,517 పెన్షన్లు
వృద్దులకు 252, వికలాంగులకు 71
కొత్త పెన్షన్లు శుక్రవారం పంపిణి 
లబ్ధిదారులలో హర్షాతిరేకాలు

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కొత్తగా పెన్షన్లను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చిత్తూరు జిల్లాకు అన్ని రకాల పెన్షన్లు కలిపి 4,880 పెన్షన్లు మంజూరయ్యాయి. ఈ పెన్షన్లను శుక్రవారం లబ్ధిదారులకు అందజేయనున్నారు. కొత్తగా వితంతు పెన్షన్ లతోపాటు వికలాంగుల పెన్షన్లు, కల్లుగీత కార్మికులకు, ఒంటరి మహిళలకు, చేపలు పట్టే వారికి, డప్పు కళాకారులకు, కల్లుగీత కార్మికులకు, కిడ్నీ డయాలసిస్ రోగులకు కూడా పెన్షన్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని నియోజకవర్గాలతో పోల్చుకుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి అధిక సంఖ్యలో పెన్షన్లు మంజూరు కావడం విశేషం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడంతో లబ్ధిదారులలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల పంపిణీ పై ప్రత్యేక దృష్టిని సాధించింది. వైసిపి ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లను పెంచి లబ్ధిదారులకు అందజేస్తుంది. అలాగే వృద్ధులకు, వితంతువులకు, కల్లుగీత కార్మికులకు, ఒంటరి మహిళలకు, చేపలు పట్టే వారికి, డప్పు కళాకారులకు, చర్మకారులకు 3000 ఉన్న పెన్షన్ ను 4000 రూపాయలు చేశారు. కుష్టు వ్యాధితో వైకల్యం సంభవించిన వారికి పెన్షన్ కూడా 3వేల నుంచి 6 వేలకు పెరిగింది. కిడ్నీ, కాలేయం, గుండె అపరేషన్ చేసుకున్న వారికి, డయాలసిస్ చేసుకుంటున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలసరి పింఛన్ 5000 నుంచి 10000 రూపాయలకు పెంచారు. మంచానికే పరిమితమైన వారికి పింఛన్ 5000 నుండి 15 వేలకు పెరిగింది. వృద్ధుల పెన్షన్లను పెంచి రెండు నెలల బకాయిలతో కూడా చెల్లించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక పెన్షన్ల విషయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఒకటవ తేదీ ఆదివారం అయితే ముందు రోజే పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెల ఒక జిల్లాకు వెళ్లి ఆయనే స్వయంగా లబ్ధిదారులతో మాట్లాడి పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పెన్షన్ల పంపిణీలో విధిగా పాల్గొంటున్నారు. సాధారణంగా పెన్షన్లను గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్షించి, కొత్త పెన్షన్లను మంజూరు చేసేవారు. అయితే ఎన్నికల కారణంగా కొత్త పెన్షన్ల మంజూరు వాయిదా పడింది. అలాగే తర్వాత బోగస్ పెన్షన్ల పరిశీలన తదితర అంశాలతో కొత్త పెన్షన్లు మంజూరు చేయక సుమారు ఒకటిన్నర సంవత్సరం కావస్తుంది. దీంతో ప్రజాప్రతినిధులు కోరిక మేరకు కొత్త పెన్షన్లను మంజూరు చేస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాకు 4880 కొత్త పెన్షన్లు మంజూరయ్యాయి. ఇందులో వితంతువుల కేటగిరిలో 4,517, వృద్ధాప్య పింఛన్లు 252, వికలాంగులకు 71, కల్లుగీత కార్మికులకు రెండు, ఒంటరి మహిళలు, చేపలు పట్టేవారు ఒక్కొక్కటి చొప్పున, డప్పు కళాకారులకు ఏడు మందికి, చెప్పులు కుట్టే వాటికి ఒకరికి, ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ డయాలసిస్ చేసుకుంటున్నా వారికి పది మందికి, ప్రైవేట్ ఆస్పత్రులలో కిడ్నీ డయాలసిస్ చేసుకుంటున్న 18 మందికి ఈ పెన్షన్లను మంజూరు చేశారు. మండలాల వారిగా బైరెడ్డిపల్లికి 163, బంగారుపాలెంకు 196, చిత్తూరుకు 103, చిత్తూరు మున్సిపాలిటీకి 294, చౌడేపల్లికి 95, గంగాధర నెల్లూరుకు 29, గంగవరంకు 150, గుడిపల్లికి 127, గుడిపాలకు 115, కార్వేటి నగరముకు 125, కుప్పంకు 420, నగరికి 104, నగరి మున్సిపాలిటీకి 118 పింఛన్లు మంజూరయ్యాయి. నిండ్ర మండలానికి 88, పలమనేరుకు 84, పలమనేరు మున్సిపాలిటీ 67, పాలసముద్రానికి 28, పెద్ద పంజానికి 145, పెనుమూరుకు 122, పులిచర్లకు 98, పుంగనూరుకు 116, పుంగనూరు మున్సిపాలిటీకి 66, పూతలపట్టుకు 110, రామకుప్పంకు 228, రొంపిచర్లకు 76, శాంతిపురంకు 211, సదంకు  80, సోమలకు 123, ఎస్ఆర్ పురానికి 115 పెన్షన్లు మంజూరయ్యాయి. తవణంపల్లి మండలానికి 139, వెదురుకుప్పానికి 128, వీకోటకు 181, విజయపురానికి 109, యాదమరికి 124 పెన్షన్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో వృద్ధాప్య పెన్షన్లు గుడిపల్లికి 39, కుప్పం మండలానికి 115, నగిరి మున్సిపాలిటీకి ఒకటి, రామకుప్పంకు 64, శాంతి పురానికి 32, వీకోటకు ఒక పెన్షన్ మంజూరయ్యాయి. వికలాంగుల కేటగిరిలో గుడిపల్లికి నాలుగు, కుప్పంకు 25, రామకుప్పంకు 5,  శాంతిపురంకు 37 పెన్షన్లు మంజూరు చేశారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *