మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి సిట్ నోటిసులు
సోమవారం విచారణకు రావాలని ఆదేశం
సాక్షిగా పిలిచినట్లు సమాచారం
కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలుగా నారాయణ స్వామి విమర్శ
ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన ఆధరం బెదరం: క్రుపాలక్ష్మి
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మాజీ ఎమ్మెల్యే కె. నారాయణ స్వామికి సిట్ నుంచి పిలుపు వచ్చింది. వైసిపి పాలనలో డిప్యూటీ సీఎం, ఎక్సైంజ్ శాఖ మంత్రిగా పని చేసిన ఆయన నుంచి కీలక సమాచారం సేకరించే అవకాశం ఉంది. సోమవారం సిట్ ముందు హాజరు కావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నేతలు అరెస్టు అయ్యారు. శనివారం ఈ కేసులో నిందితుడిగా కూడా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని కూడా సిట్ అధికారులు విచారించారు. లిక్కర్ స్కామ్‌లో ఇప్పటి వరకూ నారాయణ స్వామి పేరు వినిపించలేదు. ఇప్పుడు కూడా ఆయనను కేవలం సాక్షిగా మాత్రమే పిలిచారని తెలిసింది. ఈ కుంభకోణ ఎక్సైజ్ శాఖ పరిధిలోకి వస్తుంది కాబట్టి అప్పటిలో అయిన ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు సిట్ నోటీసులు ఇచ్చిందని అంటున్నారు. పేరుకు నారాయణ స్వామి మంత్రి అయినప్పటికీ నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వలేదని అంటున్నారు.
ఎప్పుడైనా వివాదాలు వచ్చినా మీడియాకు చెప్పే అవకాశం కూడా ఆయనకు ఉండేది కాదని ఆయన సన్నిహితులు చెప్పారు. ఆయన శాఖలో ఇంత పెద్ద స్కాం జరిగితే అందులో ఆయనకు ఎలాంటి కమిషన్ ముట్టలేదని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసు కొందరు వైసిపి నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. ఇందులో దోచేసిన వేల కోట్ల రూపాయల్లో 90 శాతం నేరుగా ‘బిగ్ బాస్ ’కే చేరిందని సిట్ దర్యాప్తులో తేలింది. మిగతా 10 శాతంముడుపులు రాజ్ కెసిరెడ్డి నేతృత్వంలో పనిచేసిన క్యాష్ కొరియర్లు, హ్యాండ్లర్లు వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు , అక్రమ దందా అమలులో భాగస్వాములైన అధికారులకు అందినట్లు సిట్ గుర్తించింది. ముడుపుల సొమ్ములో ఎవరి వాటా ఎంతో పేర్కొంటూ సిట్ జాబితా సిద్ధం చేసింది. ‘బిగ్‌బాస్’కు 2 వేల 970 కోట్లు:మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అరెస్టయిన నిందితులు, సాక్షుల విచారణలో వెల్లడైన అంశాలు, వాంగ్మూలాలు, వారి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లలోని సమాచారాన్ని వెలికి తీసిన వాటాల గుట్టును సిట్ తేల్చింది. బేసిక్ ప్రైస్ ఆధారంగా ఒక్కో కేసుపై 150 నుంచి 600 వరకూ వైఎస్సార్సీపీ మద్యం ముఠా వసూలు చేసిందని సిట్ గుర్తించింది. ఇలా మొత్తం 3 వేల 300 కోట్ల వరకూ కొల్లగొట్టి ఉంటారని ప్రాథమిక అంచనా. ఈ ముడుపుల సొమ్ముతో బెంగళూరు, హైదరాబాదు నగరాలలో భూములపై పెట్టుబడులుగా పెట్టినట్లు, బినామీ కంపెనీలు పెట్టినట్లు గుర్చించిన సీట్ వీటిని వెలికితీస్తోంది. వైఎస్సార్సీపీ ముఠా ఏపీఎస్‌బీసీఎల్‌లో ఇద్దరు కీలక అధికారులను నియమించుకుని వారి ద్వారా మద్యం కథ నడిపించిందని సిట్ దర్యాప్తులో వెలుగుచూసింది. ముడుపులు చెల్లించిన కంపెనీలకే అత్యధికంగా సరఫరా ఆర్డర్లు ఇవ్వటం, ముడుపులు ఇవ్వని కంపెనీలను మార్కెట్ నుంచి తరిమేయడం వంటివి వీరితో వైఎస్సార్సీపీ ముఠా చేయించింది. ప్రతిఫలంగా ఓ ముఖ్య అధికారికి నెలకు 50 లక్షల రూపాయలు, మరో అధికారికి నెలకు 20 లక్షల రూపాయలు చొప్పున లంచాలుగా చెల్లించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఆ ఇద్దరు అధికారులు రాజ్ కెసిరెడ్డి సూచించిన కంపెనీలకు మాత్రమే మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చేవారని తేలింది. మద్యం ముడుపుల్లో వైఎస్సార్సీపీ ముఖ్య నేతలకు వాటాలు, అధికారులకు లంచాలు పోనూ మిగతా సొమ్మును రాజ్ కెసిరెడ్డి కమీషన్‌గా తీసుకునేవారని సిట్ దర్యాప్తులో వెలుగు చూసింది. కిరణ్‌కుమార్‌రెడ్డి, ముప్పిడి అవినాష్‌రెడ్డి, బూనేటి చాణక్య, పైలా దిలీప్‌లను ముందు పెట్టి క్యాష్ హ్యాండ్లర్ల వ్యవస్థను నిర్వహించే వారని గుర్తించింది. అంతేకాకుండా రాజ్ కెసిరెడ్డి తన వారితో కొత్తగా కొన్ని మద్యం సరఫరా కంపెనీలను ఏర్పాటు చేయించి వాటికి భారీగా సరఫరా ఆర్డర్లు దక్కేలా చేసుకున్నారని దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ నేపధ్యంలో నారాయణ స్వామి నుంచి పలు కీలక సమాచారం చెకరించాలని సిట్ భావిస్తున్నట్టు తెలిసింది.
*కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు*
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష్య సాధింపు చర్యలకు దిగుతోంది. వైయస్ఆర్‌సీపీ ముఖ్య నాయకులపై సిట్ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయి. మద్యం కుంభకోణం మిద విచారణ జరుపుతున్న సిట్ నారాయణస్వామికి నితిసులు జారీ చేసిన నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను అవినీతి కు అవకాశం నిర్వహించింది. వైసిపి పాలనలో ఒక్క బెల్ట్ షాపు లేదు. ప్రభుత్వం పారదర్శకంగా మద్యం దుకాణాలు నిర్వహించింది. ఈరోజు గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు తెరిచారు. 50 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎక్కడ అవినీతికి పాల్పడలేదు. నీతిగా నిజాయితీగా పాలన చేశాం. దళిత నాయకుడుగా ఉన్నతనపై ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు దిగుతోంది. జీడి నెల్లూరుకు వచ్చిన సీఎం చంద్రబాబు నేను ఎలాంటి అవినీతికి పాల్పడే వ్యక్తి కాదు అని స్వయంగా చెప్పారు.
