2, జులై 2025, బుధవారం

ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల

క్లారిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు

పిఎం కిసాన్ నిధులతో పాటు అన్నదాత సుఖీభవ

ఒక్కో రైతు ఖాతాలో 7 వేల రూపాయలు జమ 


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. 


ఎప్పుడెప్పుడా అని రైతులు ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదలపై రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు వివిధ అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చారు. జులై నెలలో పీఎం కిసాన్ యోజనతో నిధులు విడుదల చేసిన రోజే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు రైతుల బ్యాంకు అకౌంట్లలో జమచేస్తామని చంద్రబాబు వెల్లడించారు. అర్హులైన రైతులకు రూ. 2,000. పిఎం-కిసాన్ యోజన కింద పిఎం-కిసాన్ 18వ విడతను ప్రభుత్వం 5 అక్టోబర్ 2024న విడుదల చేసింది. 19వ విడతను ప్రభుత్వం 24 ఫిబ్రవరి 2025న విడుదల చేసింది.  20వ విడత నిధులు కూడా జూలై నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత అన్నదాత సుఖీభవ పథకం నిధులు  విడుదల చేసే అవకాశం ఉంది.


అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.20 వేలు అందించనుంది ఏపీ ప్రభుత్వం. అయితే అన్నదాత సుఖీభవ తొలి విడత నిధుల విడుదలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జులై నెలలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేస్తుందన్న చంద్రబాబు పీఎం కిసాన్ యోజన నిధులతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల చేసిన రోజే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు. అన్నదాత సుఖీభవ పధకం కింద కేంద్ర ప్రభుత్వం 6 వేల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం మరో 14 వేల రూపాయలు కలిపి 20 వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేయనుంది. మొత్తం మూడు విడతల్లో ఈ మొత్తం జమ కానుంది. పథకం మొదటి విడతలో భాగంగా అర్హులైన ఒక్కో రైతు ఖాతాలో 7 వేల రూపాయలు జమకానున్నాయి. రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు జమకానున్నాయి. మూడో విడతలో 6 వేల రూపాయలు జమ అవుతాయి. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఉద్దేశించిన అన్నదాతా సుఖీభవ అంతకంతకూ ఆలస్యమవుతోంది. వర్షాలు మొదలు కావడంతో ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు పెట్టుబడుల కోసం ప్రభుత్వంకేసి చూస్తున్నారు. ప్రభుత్వం తొలుత మే నెలలో ఇస్తామని చెప్పి, అనంతరం జూన్‌కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. జూన్‌ 21న రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆ గడువు ముగిసినా  ప్రభుత్వంలో కదలిక లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పిఎంకిసాన్‌ యోజన జమ చేస్తే, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా సొమ్ము జమ చేస్తుందని మాట మార్చారు. కాగా పిఎంకిసాన్‌ కిస్తుపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదు. మొదట్లో జూన్‌ చివరాఖరులోనన్నారు. ఇప్పుడు జులై అంటున్నారు. కేంద్రం పిఎంకిసాన్‌ విడుదల చేసే వరకు రాష్ట్ర ప్రభుత్వ సాయం కోసం రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్రం స్వంత భూమి కలిగిన రైతులకే పిఎంకిసాన్‌ సాయం చేస్తోంది. కౌలు రైతులకు రాష్ట్ర ఖజానా నుంచి మొత్తం నిధులూ భరిస్తామని కూటమి సర్కారు హామీ ఇచ్చి, కౌలు రైతులకు అక్టోబర్‌, జనవరిలో రెండు వాయిదాల్లో సాయం చేస్తామంటోంది. టిడిపి కూటమి ఎన్నికల్లో ఇచ్చిన ‘సూపర్‌ సిక్స్‌’ హామీలలో అన్నదాత సుఖీభవ పధకం ఒకటి. రైతులు, కౌలు రైతులు సేద్యం సాగించేందుకు ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం చేస్తామన్నారు. అధికారంలోకొచ్చాక తొలేడాది ఇవ్వలేదు. రెండవ సంవత్సరం నుంచి అన్నారు. గత వైసిపి ప్రభుత్వానికిమల్లే ఏడాదిలో మూడు విడతల్లో, కేంద్ర పథకం పిఎంకిసాన్‌తో కలిపి అమలు చేస్తామని చెబుతున్నారు. కౌలు రైతులకు మొత్తం నిధులూ రాష్ట్రమే భరిస్తుందన్నారు. ఇవన్నీ మాటలే తప్ప ఇప్పటి వరకు స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల కాలేదు.  తాజాగా వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ రైతుల జాబితా ఇ-కెవైసి పరిశీలనకు పంపామన్నారు. వెరిఫికేషన్‌ 98 శాతం పూర్తయిందంటున్నారు. కేంద్రం ఇ-కెవైసి సహా పలు నిబంధనలు విధించింది. స్వంత భూమి కలిగిన వారికే ఇస్తోంది. గుర్తింపు కార్డు, ఇ-పంటలో నమోదు తప్పనిసరి చేసినట్లు చెబుతున్నారు. కేంద్రం పిఎంకిసాన్‌కు విధించిన ఆంక్షలతో లబ్ధిదారులు అంతకంతకూ తగ్గిపోతున్నారు. 2024-25లో కేంద్రం రెండు వేల చొప్పున మూడు విడతలు జమ చేసింది. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *