30, ఏప్రిల్ 2025, బుధవారం

అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ ప్రారంభం

గత సంవత్సరం రిజిస్ట్రేషన్ ల ద్వారా రూ. 197 కోట్ల ఆదాయం 

జిల్లాకు వంద రూపాయలు విలువ చేసి 40,000 స్టాంపులు 

ఆంధ్రప్రభ బ్యూరోతో జిల్లా రిజిస్ట్రార్ ఏవిఆర్ మూర్తి


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ

చిత్తూరు జిల్లాలోని అన్ని రిజిస్టర్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చిందని చిత్తూరు జిల్లా రిజిస్ట్రార్ ఏ వి ఆర్ మూర్తి తెలిపారు. బుధవారం ఆయన చిత్తూరులో ఆంధ్రప్రభ బ్యూరోతో మాట్లాడుతూ చిత్తూరులోని ప్రధాన కార్యాలయంలో మాత్రం ఏప్రిల్ 4వ తారీఖు నుంచి స్లాట్ బుకింగ్ అందుబాటులోకి వచ్చిందన్నారు. అవసరమైన వినియోగదారులు ఏ సమయంలో రిజిస్ట్రేషన్ అవసరమో ముందుగా తేది, టైం బుక్ చేసుకోవచ్చని వివరించారు. ఇందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాకు  40 వేల వంద రూపాయల స్టాంపులు వచ్చాయని, వాటిని త్వరలోనే జిల్లాలోని అన్ని రిజిస్టర్ కార్యాలయాలకు అందజేస్తామన్నారు. 


చిత్తూరు జిల్లాలో 8 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు పనిచేస్తున్నాయని, ఇవి గత సంవత్సరం రిజిస్ట్రేషన్ ల ద్వారా 197 కోట్ల రూపాయల ఆదాయాన్ని అర్జించాయని తెలిపారు. బంగారు పాల్యం సబ్ రిజిస్టర్ కార్యాలయం 10. 44 కోట్ల రూపాయలు, కుప్పం 22.87 కోట్లు, పలమనేరు 30.07 కోట్లు, పుంగనూరు 29.16 కోట్లు, చిత్తూరు ప్రధాన కార్యాలయం 67.44 కోట్లు, కార్వేటినగరం 8.66 కోట్లు, నగరి 14.53 కోట్లు, చిత్తూరు రూరల్ 14.32 కోట్ల రూపాయలు గత సంవత్సరం రిజిస్ట్రేషన్ ల రూపంలోవసూలు చేశాయని వివరించాయి. గత ఆర్థిక సంవత్సరానికి 222 కోట్ల రూపాయలు లక్ష్యంగా  రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. అయితే తాము 69 శాతం సాధించాలని 197 కోట్ల రూపాయలను వసూలు చేశామని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సంవత్సర లక్ష్యం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందలేదన్నారు. ఏప్రిల్ నెలలకు 24.40 కోట్ల రూపాయలులక్ష్యం  కాగా,  ఇప్పటివరకు 13.38 కోట్ల రూపాయలను వసూలు చేశామన్నారు. జిల్లాలోని అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలను కంప్లీట్ కంప్యూటర్ ఈ కరణ చేయడం జరిగిందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాఫీగా నడుస్తుందన్నారు. బుధవారం నుంచి అన్ని సబ్ డిజిటల్ కార్యాలయాల్లో అందుబాటులోకి వచ్చిన స్లాట్ బుకింగ్ ను వినియోగదారులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు. స్లాట్ బుక్ చేసుకుంటే ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, అయితే స్లాట్ ను మరో రోజుకు మార్పు చేయాలనుకుంటే 200 రూపాయలను చెల్లించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో సెలవు రోజులలో కూడా రిజిస్ట్రేషన్ల సౌకర్యం ఉందన్నారు. ఇందుకు 5000 రూపాయలను అదనంగా  చెల్లించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో స్టాంపులు కొరతను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం  జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 100 రూపాయలు విలువచేసే 40,000 స్టాంపులను చిత్తూరుకు  సరఫరా చేసిందన్నారు. వీటిని త్వరలోనే జిల్లాలోని అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు పంపిణి  చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి జిల్లాలోని అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలు పనిచేస్తున్నాయని తెలిపారు. తాను నిరంతరం జిల్లాలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం తనిఖీ చేస్తూ, వాటి పనితీరును పర్యవేక్షిస్తున్నారని జిల్లా రిజిస్ట్రార్ ఏ వి ఆర్ మూర్తి వివరించారు.

పో రై గంగ 1జిల్లా రిజిస్ట్రార్ ఏ వి ఆర్ మూర్తి

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *