17, ఏప్రిల్ 2025, గురువారం

మారుతున్న పాలసముద్రం మండల రాజకీయం

మండల పార్టీ సమావేశానికి దూరంగా చిట్టిబాబు
మండల పార్టీ అధ్యక్షుడు రాజేంద్రన్ అధ్యక్షతన సమావేశం 
పార్టీ కార్యాలయం కాకుండా కళ్యాణ మండపంలో పార్టీ సమావేశం 
తిరిగి క్రియాశీలకమైన రాజేంద్రన్, ఇందిర 

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. 


రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరని గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండల తెలుగుదేశం పార్టీలో మరోమారు రుజువయ్యింది. బుధవారం జరిగిన పాలసముద్రం మండల పార్టీ సమావేశం ఈ మార్పునకు వేదికగా నిలిచింది. గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జిగా డాక్టర్ ఎం వి థామస్ ను ప్రకటించినప్పటి నుండి ఎన్నికల వరకు థామస్ వెన్నంటి  ఉన్న పాలసముద్రం మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. ఆయన ప్రారంభించిన మండల పార్టీ కార్యాలయంలో మండల పార్టీ కార్యకర్తల సమావేశం జరగలేదు. పార్టీ కార్యాలయం కాకుండా, కళ్యాణ మండపంలో పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. భీమినేని చిట్టిబాబు స్థానంలో పాలసముద్రం మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పిటిసి సభ్యుడు రాజేంద్రన్, మాజీ ఎంపీపీ ఇందిర సమావేశంలో పాల్గొన్నారు. చిట్టిబాబు వైఖరికి నిరసనగా  ఎన్నికల సమయంలో కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్న రాజేంద్రన్, గంగాధర నెల్లూరు శాసనసభ్యులు థామస్  మొట్టమొదటిసారిగా ఒకే వేదికను పంచుకున్నారు. సంవత్సరం రోజులలో థామస్ కు  అత్యంత సన్నిహితుడిగా ఉండిన  భీమినేని చిట్టిబాబు ఆయనకు దూరం కాగా, గత సంవత్సర కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న రాజేంద్రన్ పార్టీ కార్యక్రమాలలో క్రియాశీలకమై, థామస్ కు దగ్గరయ్యారు.


గతంలో రాజేంద్రన్ పాలసముద్రం మండల  జడ్పిటిసి సభ్యుడిగా, ఎంపీపీ పనిచేశారు. అలాగే ఇందిరా ఎంపీపీగా పనిచేశారు.  ఒకప్పుడు వేరే  మండలంలో తెలుగుదేశంపార్టీని నడిపించారు.  అయితే బెంగళూరులో వ్యాపారం చేసుకుంటున్న చిట్టిబాబు టిడిపిలో చేరి మండలంలో, నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఎదిగారు. పార్టీ కార్యాలయంలో పైరవీలు చేస్తూ, తన సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా  ఎదిగారు. మండల కమిటీ అధ్యక్షుడు, జడ్పీటీసీ, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు అనుభవించారు. ఆయన వైఖరి నచ్చక  ఇందిర పార్టీ వదిలి వైసీపీలో చేరారు. రాజేంద్రన్ పార్టీ కార్యక్రమాలకు దాదాపుగా దూరం అయ్యారు. ఇందిర గత ఎన్నికల ముందు తిరిగి పార్టీలోకి వచ్చారు. 2020లో కేంద్ర పార్టీ కార్యాలయంలో చక్రం తిప్పి నియోజక వర్గ సమన్వయ కర్త పదవిని చిట్టిబాబు తెచ్చుకున్నారు. దీనితో అప్పటి ఇంచార్జిగా ఉన్న  మాజీ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మ కుమారుడు డాక్టర్ హరికృష్ణ పార్టీకి రాజీనామా చేశారు. చిట్టిబాబు తీరు నచ్చక రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి కూడా నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాగా పాలసముద్రం మండల కమిటీ అధ్యక్షుడుగా ఉన్న రాజేంద్రను చిట్టిబాబు  పలుసార్లు అవమాన పరచడంతో  ఆయన క్రియా శీలక రాజకీయాలకు దూరం అయ్యారు. ఎన్నికల సమయంలో ఎంఎల్ఏ టిక్కెట్టు కోసం రాజేంద్రన్ ప్రయత్నం చేశారు. ఆర్థికంగా పరిపుష్టి కలిగిన థామస్ ను నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించి, ఆయనకే ఎన్నికలలో టిక్కెట్టును ఖరారు చేశారు. అయితే ఎన్నికలల సమయంలో తిరిగి పార్టీలో చేరిన  ఇందిర, రాజేంద్రన్ టిడిపి అభ్యర్ధి డాక్టర్ వి ఎం థామస్ గెలుపుకు కృషి చేసారు.  అయితే ఎన్నికల్లో థామస్ గెలుపొందారు. ఎన్నికల సమయంలో చిట్టిబాబు అనుచరించిన వైఖరి నచ్చక క్రమంగా థామస్ ఆయనను పక్కన పెట్టారు. ఇద్దరి మధ్య కొంతకాలం కోల్డ్ వార్ కూడా జరిగింది. థామస్ కు,  చిట్టిబాబుకు బెడిసికొట్టడంతో, పలువురు థామస్ కు వ్యతిరేకంగా అధిష్టానంకు  ఫిర్యాదులు కూడా  చేశారు. ఇదిలా ఉండగా మార్చి ఒకటవ తేదీన గంగాధర నెల్లూరులో ప్రజవేదికలో పాల్గొనడానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కార్యకర్తల సమావేశంలో  రాజేంద్రన్ కనిపించక పోవడంతో, అరా తీశారు. రాజేంద్రన్ నిబద్దత కలిగిన కార్యకర్త అని, ఎంఎల్ఏగా రాజేంద్రన్ కు అన్ని అర్హతలు ఉన్నా, కొన్ని పరిస్థితుల కారణంగా టిక్కెట్టు ఇవ్వలేకపోయనని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వద్దకు వెళ్లి మాట్లాడి, తన వద్దకు తీసుకురావాలని థామస్ ను కోరారు. ఇప్పటికే చిట్టిి బాబును పక్కన పెట్టడంతో తిరిగి రాజేంద్రర కు ప్రాధాన్యత ఏర్పడింది ముఖ్యమంత్రి కూడా రాజేంద్రతో మాట్లాడమని చెప్పడంతో బుధవారం పాలసముద్రం ఎంపిడిఓ కార్యాలయంలోలో జరిగిన ప్రజాా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన  మండల పార్టీ కార్యకర్తల సమావేశం రాజేంద్రన్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఇందిర కూడా పాల్గొన్నారు. మండల పార్టీ సమావేశం అనంతరం ఎమ్మెల్యే థామస్, రాజేంద్రన్ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. రాజకీయంగా తిరిగి క్రియాశీలకం కావలసిందిగా ఎమ్మెల్యే రాజేంద్రన్ ను ఎమ్మెల్యే కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ఇద్దరు వెళ్లి చంద్రబాబును కలువాలని నిర్ణయించుకున్నారు. మండల పార్టీ కార్యాలయం చిట్టిి బాబుకు చెందిన భవనంలో ఉండడంతో ఆ కార్యాలయంలో సమావేశానికి రాజేంద్రన్ హాజరుకానని చెప్పడంతో, మండల కార్యకర్తల సమావేశం  కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలా పాలసముద్రం మండలంలో గత సంవత్సర కాలంలోనే రాజకీయం భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు థామస్ కు సన్నిహితంగా మెలిగిన చిట్టిి బాబు మండల పార్టీ కార్యక్రమాలకు దూరం కాగా, ఇప్పటివరకు చిట్టిబాబు మీద వ్యతిరేకతతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న రాజేంద్రన్, ఇందిరలు  తిరిగి రాజకీయంగా క్రియాశీలకమయ్యారు. చిట్టిబాబు భవనంలో నడుస్తున్న పార్టీ కార్యాలయానికి తాళాలు పడనున్నారు. కొత్త భవనంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకోనిపోనున్నారు.

పో రై గంగ 1 ఒకే వేదిక మీద ఎమ్మెల్యే థామస్, రాజేంద్రన్ 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *