1, ఏప్రిల్ 2025, మంగళవారం

మాల సంక్షేమ సహకార ఆర్థిక కార్పొరేషన్ డైరెక్టర్లుగా జిల్లాలో ఇద్దరికీ అవకాశం


ఒకరుకి జనసేన నుండి, మరొకరికి బిజెపి నుండి 

ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ సహకార ఆర్థిక కార్పొరేషన్ లో డైరెక్టర్లుగా చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరికీ స్థానం దక్కింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం ఎం నాయక్ ఆదేశాలు జారీ చేశారు. ఒకరు గంగాధర నెల్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ కాగా, మరొకరు చిత్తూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీకి చెందిన ఎస్సీ సెల్ కన్వీనర్ సి. బాబు. డాక్టర్ పొన్న యుగంధర్ ఎన్నికలకు ముందు నుంచి గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన అంగవైకల్యాన్ని కూడా పక్కనపెట్టి చురుగ్గా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా స్పందిస్తూ, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఆయన గత ఎన్నికలలో గంగాధర నెల్లూరు అసెంబ్లీ స్థానాన్ని జనసేన పార్టీ తరఫున యుగంధర్ ఆశించారు. దళిత వికలాంగ యువకుడైన డాక్టర్ యుగంధర్ కు అవకాశం వస్తుందని పలువురు  భావించారు. అయితే ఆ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ డాక్టర్ ఎం వి థామస్ కు కేటాయించింది. అయినా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయానికి డాక్టర్ పొన్న యుగంధర్ శక్తివంచన లేకుండా కృషి చేశారు. 

చిత్తూరు గిరింపేటకు చెందిన చిన్న రాజులు బాబు @సి.బాబు ఉపాధ్యాయుడిగా పనిచేసి, పదవీవిరమణ చేశారు. భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా యస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పనిచేచేశారు. ప్రస్తుతం యస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పనిచేస్తున్నారు. అయన ఎనిమిది సంవత్సరాలుగా బిజెపిలో అంకితభావం కలిగిన కార్యకర్తగా పనిచేస్తున్నారు.  అయన  సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ మాల వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా బిజెపి సిఫారసు చేసింది. కూటమి ప్రభుత్వం మాల వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది.  అయన నియామకం  బిజెపి జిల్లా అధ్యక్షులు జగదీశ్వర నాయుడు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు హర్షం వ్యక్తంచేశారు. అభినందించారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *