19, ఏప్రిల్ 2025, శనివారం

రాజకీయ దురందురుడు, అపర చానిక్యుడు చంద్రబాబు

 1978లో కాంగ్రెస్  ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానం ప్రారంభం 

ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాల సుదీర్ఘ  ప్రయాణం

 ఎమ్మెల్యేగా 9 సార్లు, 41 సంవత్సరాల అనుభవం 
సమకాలిన ఎమ్మెల్యేలు 12 మంది కాలగర్భంలో 
మిగిలిన ఇద్దరు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా 
ముగ్గురు సమకాలిన నాయకులు నేటికీ అండగా
నేడు తిరుపతికి చంద్రబాబు రాక 

ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు. 

రాజకీయ దురందురుడుగా, అపర రాజకీయ చానిక్యుడిగా పేరు తెచ్చుకున్న ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా ఆణిముత్యం. పడిలేచిన కెరటం వాలే సాగిన అయన రాజకీయ ప్రస్థానం  ఎందరికో ఆదర్శం. ఆయన 30 ఏళ్ళ క్రితం తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా 15 ఏళ్ళ అనుభవంతో ముందుకు సాగుతున్నారు. తొలిసారిగా 1978  ఎమ్మెల్యే అయిన ఆయన ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చిత్తూరు జిల్లాలో 1978లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మళ్ళి 8 సార్లు కుప్పం నుండి వరుస విజయాలు సాదిస్తున్నారు. ఎమ్మెల్యేగా అయన అనుభవం 41 సంవత్సరాలు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు అయిన 14 మందిలో  12 మంది చనిపోయారు. ఇద్దరు జీవించి ఉన్నప్పటికీ వారు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాలలో ఉన్న ఆయన వయస్సు  ఏప్రిల్ 20 నాటికి 75 ఏళ్ళు పూర్తి అవుతుంది. ఆయనతో పాటు  సమకాలీన రాజకీయాలు చేసిన వారిలో ముగ్గురు ఇప్పుడు ఆయనతో కలసి తెలుగుదేశం పార్టీలో  ప్రయాణం సాగిస్తున్నారు.

నారా చంద్రబాబు నాయుడు 1950 లో చంద్రగిరి మండలం నారావారి పల్లెలో జన్మించి, చంద్రగిరి, తిరుపతిలో చదువుకున్నారు. ఎస్వీ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో ఎంఎ పూర్తి చేసారు. తరువాత పీ హెచ్ డీ స్కాలర్ గా పరిశోధన ప్రారంభించారు. 1975 నుంచి యూత్ కాంగ్రెస్ నేతగా ఉన్నారు. 1978లో చంద్రగిరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ విజయం సాధించారు. యూనివర్సిటీలో ఆయన ప్రత్యర్థి అయిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీలేరు నుంచి జనతా అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయారు. ఆ ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 15 నియోజక వర్గాలలో 12 స్థానాల్లో కాంగ్రెస్, మూడు చోట్ల జనతా అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్ నుంచి నారా చంద్రబాబు ( చంద్రగిరి), ఉన్నం సుబ్రమణ్యం నాయుడు ( శ్రీకాళహస్తి), సి దాస్ ( సత్యవేడు), రెడ్డివారి చెంగా రెడ్డి ( నగరి), ఎ రత్నం                  ( పలమనేరు), బి దొరస్వామి నాయుడు ( కుప్పం), కె పతి (పుంగనూరు), గంగారపు వెంకటనారాయణ రెడ్డి                ( మదనపల్లి), అవుల మోహన్ రెడ్డి ( తంబళ్లపల్లె), నల్లారి అమరనాథ రెడ్డి ( వాయల్పాడు), మొఘల్ సైఫుల్లా బేగ్ (పీలేరు), అగరాల ఈశ్వర్ రెడ్డి ( తిరుపతి) గెలిచారు. జనతా పార్టీ నుంచి ఎన్ పి వేంకటేశ్వర చౌదరి ( చిత్తూరు), కె బి సిద్దయ్య నాయుడు( పుత్తూరు), బంగళ ఆర్మగం ( వేపంజేరి) విజయం సాధించారు. అప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో చెంగారెడ్డి, వేంకటేశ్వర చౌదరి మాత్రమే జీవించి ఉన్నారు. చెంగా రెడ్డి నగరి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మూడుసార్లు మంత్రిగా పనిచేశారు. ఒకప్పుడు చిత్తూరులో చక్రం తిప్పారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అగరాల ఈశ్వర్ రెడ్డి అప్పటిలో స్పీకర్ గా ఉన్నారు. తరువాత ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. సి దాస్ అప్పటిలో మంత్రిగా పనిచేశారు. అమరనాద రెడ్డి 1985, 1989 లో ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేశారు. ఆయన మరణానంతరం రాజకీయాలలోకి వచ్చిన ఆయన పెద్ద కుమారుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ఆఖరి ముఖ్య మంత్రిగా మూడేళ్లు పనిచేశారు. ఆయన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి ప్రస్తుతం పీలేరు ఎమ్మెల్యేగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అయిన తొలి రోజుల్లోనే రాష్ట్ర మంత్రి అయ్యారు. 1983లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి చంద్రగిరిలో ఓడిపోయారు. 1984 లో టిడిపిలో చేరి పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. 1985 మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసారు. 1985 నుంచి  ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసారు. 1989 నుంచి కుప్పం ఎమ్మెల్యేగా వరుస విజయాలనుసొంతం చేసుకున్నారు. 1995లో పార్టీలో నెలకొన్న సంక్షోభ సమయంలో చాకచక్యంగా వ్యవహరించి సెప్టెంబర్ ఒకటిన ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత 1999, 2014, 1924 లో ముఖ్య మంత్రి అయ్యారు. అధికారంలో లేని సమయంలో ప్రతి పక్ష నేతగా అలుపెరుగని  పోరాటం చేసారు. కాగా విద్యార్థి దశలో ఆయన ప్రత్యర్థిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి  ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడు సార్లు మంత్రిగా పనిచేసారు. వైసిపి పాలనలో జిల్లాలో ఎదురులేని నేతగా ఉన్నారు. కాగా చంద్రబాబుతో కలసి చదువుకున్న మునిరత్నం ( కుప్పం) 1989 నుంచి చంద్రబాబు వెంట అంటూ పార్టీలో పలు బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆర్టీసీ వైస్ చైర్మన్ గా పనిచేస్తున్నారు. ఎస్వీ యూనివర్సిటీలో చంద్రబాబుతో కలసి పచదువుకున్న  సూరా సుధాకర్ రెడ్డి ( తిరుపతి) తొలినుంచి టిడిపిలో అంటూ పలు బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. విద్యార్థి దశ  నుంచి చంద్రబాబుకు దూరంగా రాజకీయాలు చేసిన డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి 2020 నుంచి టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. 1978లో ఎబివిపి చిత్తూరు జిల్లా కన్వీనర్ గా ఉన్న ఆయన 1983లో పుత్తూరు జనతా అభ్యర్థిగా పోటీ చేసారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో జిల్లా రాష్ట్ర స్థాయి బాధ్యతలు నిర్వహించారు. 1999 నుంచి రాజకీయాలకు స్వస్తి చెప్పి సైకాలజిస్తుగా ఉన్నారు. ఈ నేపథ్యం పరిశీలిస్తే సుదీర్ఘ కాలం రాజకీయాలలో చంద్రబాబు వలే  ఇంత క్రియాశీలక  విజయాలను సొంతం చేసుకున్న వ్యక్తి మరొకరు ఉండరని పిస్తుంది. దీనికి కారణం అతని విలక్షణ వ్యక్తిత్వం, రాజకీయ వ్యూహం, అవిశ్రాంత పోరాటం అనడంలో సందేహం లేదు.

పో రై గంగ 1 చంద్రబాబుతో సురా సుధాకర్ రెడ్డి 
గంగ 2 చంద్రబాబుతో పిఎస్ మునిరత్నం 
గంగ 3 చంద్రబాబుతో ఎన్ బి సుధాకర్ రెడ్డి 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *