27, ఏప్రిల్ 2025, ఆదివారం

కుప్పం మున్సిపాలిటీపై టిడిపి జెండా ?

అవసరమైన బల సేకరణలో టిడిపి 

15 మంది బలం టిడిపికి ఉన్నట్లు అంచనా 

శిబిరాల నిర్వహణలో  ఇరు పార్టీలు

నేడే మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నిక  


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. 


కుప్పం  మున్సిపాలిటీ చైర్మన్ పదవికి సోమవారం జరగనున్న ఉప ఎన్నికలు ఎలాగైనా తెలుగుదేశం పార్టీ జెండాను కుప్పం మున్సిపాలిటీ పైన ఎగరవేయాలని తెలుగుదేశం పార్టీ వర్గాలు కృత నిశ్చయంతో ఉన్నాయి. ఈ మేరకు కౌన్సిలర్ల మద్దతును సమీకరిస్తున్నారు. ఇప్పటికీ దాదాపుగా మెజార్టీ దిశగా తెలుగుదేశం పార్టీ సభ్యులు దోసుకుపోతున్నట్లు సమాచారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు శిబిరాలను నిర్వహిస్తున్న, ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి మోగించే అవకాశం ఎక్కువగా ఉదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అవసరమైన సంఖ్యాబలం తెలుగుదేశం పార్టీ సమీకరించిందని చెబుతున్నారు. శాసన మడలి సభ్యుడు కంచర్ల శ్రీకాంత్ పటిష్టాత్మకంగా వ్యూహరచన చేసి గెలుపు సాధించడానికి కృషి చేస్తున్నారు.


ఏకపక్షంగా జరిగన గత స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయకూడదని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. అయినా కుప్పం మునిసిపాలిటీలో ఆరు మంది తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు విజయం సాధించారు. కుప్పం  మున్సిపాలిటీలో 25 కౌన్సిలర్ స్థానాలు ఉండగా, అందులో 19 స్థానాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆరు స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసిన విధంగానే కుప్పం మున్సిపాలిటీ మీద కూడా ఆ పార్టీ విజయ కేతనాన్ని ఎగురవేసింది. ఏడాదికి ముదు జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో కుప్పం మునిసిపాలిటీలో కూడా రాజకీయ సమీకరణాలు మారుతూ వచ్చాయి. మూడు నెలల కిందట కుప్పం మున్సిపల్ చైర్మన్ గా ఉండిన సుధీర్ మున్సిపల్ చైర్మన్ పదవికి, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఐదు మంది కౌన్సిలర్లతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పట్లో వీరితోపాటు చేరిన సయ్యద్ అలీ అనే కౌన్సిలర్ తిరిగి వైసీపీలో జరుగుతున్నట్లు ప్రకటించారు. కుప్పం మున్సిపాలిటీలో 25 కౌన్సిలర్ పోస్టులు ఉండగా ఇందులో చైర్మన్ గా ఉన్న సుధీర్ రాజీనామా చేశారు. దీంతో కౌన్సిలర్ల సంఖ్య 24 తగ్గింది. కుప్పం మున్సిపాలిటీలో ఎమ్మెల్సీలు కలిచర్ల శ్రీకాంత్, భరత్ లు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. అలాగే కుప్పం నియోజకవర్గం నుంచి విజయ కేతనం ఎగురవేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నయుడు కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. దీంతో సభ్యుల సంఖ్య 27కు పెరిగింది. సోమవారం జరిగే ఉప ఎన్నికల్లో ఎవరు విజయం సాధించాలన్న 14 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నుండి తొలుత గెలుపొందిన 6 మంది సభ్యులు ఉన్నారు. వీరికి తోడుగా ఇటీవల పార్టీలో చేరిన ముగ్గురు కౌన్సిలర్లు ఉన్నారు. దేనితో తెలుగుదేశం పార్టీ బలం 9కి పెరిగింది. ఎక్స్ అఫీషియో సభ్యుడు కంచర్ల శ్రీకాంత్ తో కలిసి ఈ బలం 10కి పెరిగింది. తెలుగుదేశం పార్టీ విజయం సాధించడానికి మరో నలుగురు అవసరమవుతారు. గతంలో తెలుగుదేశం పార్టీలో చేరి తిరిగి వైసిపి పార్టీలోకి వెళ్లిన సయ్యద్ అలీ తిరిగి తెలుగుదేశం శిబిరంలో చేరినట్లు సమాచారం. అలాగే మరో ఇద్దరు కౌన్సిలర్లు గణపతి, అరవింద్ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఆ పార్టీ శిబిరంలో చేరినట్లు సమాచారం. దీంతో తెలుగుదేశం పార్టీ బలం 13 కు చేరింది. దీనికి తోడు ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు నాగరాజు, రంగన్న కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి మద్దతు అవసరం లేకుండానే తెలుగుదేశం పార్టీ 15 ఓట్లను సాధించే అవకాశం ఉంది. ఇలా సోమవారం జరగనున్న కుప్పం మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని, కుప్పం మున్సిపాలిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కైవసం చేసుకుంటుందని తెలుగుదేశం పార్టీ వర్గాలు భీమా ను వ్యక్తం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని ఇప్పటివరకు ఆ పార్టీ ప్రకటించలేదు. అయితే సెల్వం, సోమశేఖర్, దామోదర్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. టిడిపి చైర్మన్ అభ్యర్థిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం ప్రకటించే అవకాశం ఉంది.

పో రై గంగ 2 కుప్పం మున్సిపాలిటీ  




అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *