కుప్పంలో రూ.200 కోట్ల పెట్టుబడితో మదర్ డెయిరీ భారీ ప్రాపెసింగ్ ప్లాంటు
స్థలం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రతించిన మదర్ డెయిరీ యాజమాన్యం
స్థలం కేటాయించగానే నిర్మాణ పనులు ప్రారంభం
ఇక దేశ,విదేశాలకు కుప్పం పండ్లు, కూరగాయలు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
రాష్ట్రంలోకూటమి సర్కారు పాలన మొదలయ్యాక రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. పిలవకున్నా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. మేం రెడీ అండీ మీరు స్థలం ఇవ్వడమే లేటు అంటూ చాలా కంపెనీలు తాజాగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తన్న కుప్పం పరిధిలో పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు పాల పంపిణీ సంస్థ మదర్ డెయిరీ సిద్దంగా ఉంది. కుప్పంలో సదరు ప్లాంట్ కు అవసరమైన స్థలాన్ని కేటాయించిన వెంటనే రంగంలోకి దిగిపోతామంటూ ఆ సంస్థ ఎండీ మనీష్ బాండ్లిష్ ప్రకటించారు. కుప్పంలో పండ్లు కూరగాయల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు అయితే, కుప్పం రైతులకు మహర్దశ పట్టనుంది. కుప్పం నుండి పండ్లు, కూరగాయలు ఇతర రాష్ట్రాలకే కాకుండా, ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతాయి. రైతులకు మంచి గిట్టుబాటు ధర రానుంది.
పాల పంపిణీలో దేశంలోనే పేరెన్నికగన్న సంస్థగా గుర్తింపు సంపాదించుకున్న మదర్ డెయిరీ గత కొంతకాలం క్రితం పండ్లు కూరగాయల ప్రాసెసింగ్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. అందులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే మూడు ప్లాంట్లను ఆ సంస్థ ఏర్పాటు చేసింది. ఈ రంగంలో మంచి పనితీరు కనబరుస్తున్న ఆ సంస్థ ఈ కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా కొత్తగా రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని తీర్మానించింది. అందలో ఒక ప్లాంటును ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఏర్పాటు చేయాలని భావించగా గుజరాత్ ప్రభుత్వం ఆ కంపెనీకి ఓకే చెప్పేయడంతో పాటుగా స్థలాన్ని కూడా కేటాయించింది. దీంతో గుజరాత్ లో రూ.600 కోట్లతో ఓ భారీ ప్లాంటును మదర్ డెయిరీ ఏర్పాటు చేస్తోంది. ఇక మిగిలిన మరో ప్లాంటును కుప్పంలో ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా కూటమి సర్కారు అందుకు సమ్మతిని తెలిపింది. గుజరాత్‌లోని బరోడా సమీపంలోని ఇటోలాలో ఒక ప్లాంట్ కోసం రూ. 600 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. నిర్మాణం రెండేళ్లలో పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందుకు బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇటోలా ప్లాంట్‌ను స్థాపించే ప్రక్రియ త్వరలో ప్రారంభమై రాబోయే రెండేళ్లలో పూర్తవుతుంది. ఇక, రెండో ప్లాంట్ ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పంలో రూ. 150-200 కోట్ల పెట్టుబడితో పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మదర్ డెయిరీకి ఇంక భూమిని కేటాయించలేదు. ప్రభుత్వం కుప్పంలో ఎంతమేర స్థలాన్ని కేటాయిస్తుందన్న దాని ఆధారంగా పెట్టే పెట్టుబడి ఎంత అన్న దానిని నిర్ణయిస్తారు. బారీ ప్లాంటుకు సరిపడా స్థలాన్ని కేటాయిస్తే, మదర్ డెయిరీ రూ.200 కోట్ల పెట్టుబడితో భారీ ప్రాపెసింగ్ ప్లాంటును ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది కుప్పం పరిధిలోని పండ్లు, కూరగాయల రైతులకు ఎంతగానో ఉపయోగపడనుందని చెప్పాలి. భూమిని కేటాయించిన వెంటనే ప్లాంట్ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడానికి మదర్ డెయిరీ సిద్దంగా ఉంది. కుప్పంలో పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ ప్లాంట్‌కు సంబధించిన డీపీఆర్ తయారవుతోంది. ప్రస్తుతం మదర్ డైరీకి చెందిన సఫల్ బ్రాండ్... రాంచీ (జార్ఖండ్), బెంగళూరు (కర్ణాటక), మంగోల్‌పురి (ఢిల్లీ)లలో మూడు పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ ప్లాంట్‌లను కలిగి ఉంది. ఇవి ఏటా రెండు లక్షల టన్నుల ఉత్పత్తులను ప్రాసెస్ చేస్తాయి. ఇక, పాలు, పాల ఉత్పత్తులను ప్రాసెస్ చేయడానికి రూ. 500 కోట్లకు పైగా పెట్టుబడితో కొత్తగా నాగ్‌పూర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది. 2026 నాటికి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. మదర్ డెయిరీ ఇటీవల ఢిల్లీ-ఎన్సీఆర్ మార్కెట్లో ఆవిష్కరించిన ఇడ్లీ-దోశ పిండికి వినియోగదారుల నుంచి మంచి ఆదరణ వస్తోంది. రోజుకు టన్ను చొప్పున తయారు చేసి, విక్రయిస్తున్నారు.
పో గంగ 1 మదర్ డెయిరీ

