14, ఏప్రిల్ 2025, సోమవారం

చిత్తూరులో పరువు హత్య

మతాంతర వివాహమే కారణమా ? 


చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరులో నూతన వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. వధువు తల్లిదండ్రులు మందలించడంతో  ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు తెలిపారు. అయితే, తాము మతాంతర వివాహం చేసుకోవడంతో అమ్మాయిని ఇంటికి పిలిచి కుటుంబసభ్యులు హత్య చేశారని వరుడు సాయి తేజ ఆరోపిస్తున్నారు. అసలు ఏమి జరిగిందన్న దానిపై పోలీసులు వివరణ ఇవ్వకపోవడంతో చిత్తూరులో పరువు హత్య జరిగిందన్న చర్చ జోరుగా నడుస్తోంది.


చిత్తూరు రాంనగర్ కలనీకి చెందిన చౌకత్ ఆలీ చిత్తూరు రూరల్ మండలం తుమ్మింద పాలెంలో ఆర్ఎంపి క్లినిక్ నడుపుతున్నాడు. ఇతనికి ముగ్గురు ఆడపిల్లలు. ఇద్దరు కుమార్తెలకు వివాహం అయింది. మూడవ కుమార్తె యాస్మిన్ ఎస్ వి సెట్ కళాశాలలో ఎంబీఏ చేసి, ఉద్యోగ ప్రయత్నంలో ఉంది. ఆమెకు చిత్తూర్ రామ్ నగర్ కాలనీకి చెందిన షరీఫ్ అనే అతనితో  ఫిబ్రవరి 9న వివాహం చేయాలని నిర్ణయం చేశారు. అయితే ఫిబ్రవరి 6వ తారీఖున యాస్మిన్ ఇంట్లో  వాళ్లకు తెలియకుండా వెళ్లిపోయి పూతలపట్టు మండలం పోటుకనుమకు చెందిన తన ఎంబీఏ క్లాస్మేట్ సాయి తేజను నెల్లూరులో వివాహం చేసుకుంది. ఇద్దరి  మతాలు వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు ఈ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వివాహం చేసుకున్న ఈ జంట ఫిబ్రవరి 10వ తేదీన తమకు రక్షణ కల్పించాల్సిందిగా తిరుపతి రూరల్ పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు మేజర్ల కావడంతో పోలీసులు యాస్మిన్ తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్లు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి, యాస్మిన్ ను  సాయి తేజ వెంట పంపారు. ఆదివారం ఉదయం యాస్మిన్ తల్లి ముంతాజ్ ఫోన్ చేసి తండ్రికి  ఆరోగ్యం బాగాలేదని. ఇంటికి రావాల్సిందిగా కోరింది. దీంతో యాస్మిన్ తన తండ్రిని చూడడానికి ఆదివారం ఉదయం 11 గంటలకు సమయంలో ఇంటికి వచ్చింది. మధ్యాహ్నం 12:30 గంటలకు తన కూతురు ఉయ్యాల కమ్మికి సున్నితో ఉరివేసుకొని వేలాడుతూ ఉండగా, దించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లామని అమ్మాయి తల్లి ముంతాజ్ పోలీసులకు తెలియజేసింది. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లగా అప్పటికే తన కూతురు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని ఆమె పేర్కొన్నారు. ఇంటికి వచ్చిన ఆమెను  మతాంతర వివాహం చేసుకొని తన పరువు తీసానని మందలించారని, దీనికి మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్య  చేసుకుందని తల్లి చెబుతోంది. ఇంటికి వచ్చిన  ఒకటిన్నర గంటలోనే ఆమె మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడ ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు. యాస్మిన్ భానును ఆదివారం ఉదయం 11 గంటలకు చిత్తూరులోని పీసీఆర్ సర్కిల్‌కు కారులో తీసుకెళ్లిన సాయి తేజ అప్పటికే అక్కడ వెయిట్ చేస్తున్న యాస్మిన్  అన్న లాలుకు దగ్గరికి పంపాడు. అక్కడి నుంచి అన్న లాలు తీసుకొచ్చిన కారులో వెళ్లిపోయిన యాస్మిన్ భాను ఇక తిరిగి రాలేదు. ఆరోగ్యం బాగాలేని తండ్రిని పరామర్శించిన తర్వాత తిరిగి తన వెంట తీసుకు వెళ్లేందుకు పీసీఆర్ సర్కిల్ వద్దే దాదాపు గంటపాటు వెయిట్ చేసిన సాయి తేజకు ఎలాంటి సమాచారం రాకపోవడంతో నేరుగా యాస్మిన్ భాను ఇంటికి వెళ్ళాడు. యాస్మిన్ భాను ఎక్కడని ఆరా తీస్తే, సరైన సమాధానం రాకపోగా చిత్తూరు జిల్లా ఆసుపత్రిలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. అక్కడికి వెళ్లి ఆరా తీస్తే మార్చురీలో ఉందన్న సమాధానం వచ్చింది. గంట క్రితం వరకు బాగా ఉన్న యాస్మిన్ భాను తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిన అరగంటలోనే మృతి చెందడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ చిత్తూరు వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించాడు సాయి తేజ. మతతర వివాహం చేసుకున్నందుకు యాస్మిన్ కుటుంబ సభ్యులు ఆమెను హత్య చేశారని ఆమె భర్త సాయి తేజ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్యను తల్లిదండ్రులే హత్య చేశారని సాయి తేజ ఆరోపిస్తున్నాడు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవనీ, యాష్మిన్ భాను ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదంటున్న సాయి తేజ అన్ని విషయాలు పోలీసులకు చెప్పారు. కులాలు మతాలు వేరుకావడంతోనే హత్య చేశారని ఆరోపిస్తున్నాడు. యాష్మిన్ భానును ఇంటికి వెళ్లిన అరగంటలోనే హతమార్చారని సాయి తేజ ఆరోపిస్తున్నారు. మరోవైపు యాస్మిన్ భాను మృతిపై తల్లి ముంతాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయిన 15 రోజుల తర్వాత సాయి తేజ ఇంటికి వెళ్లి పరువు తీసిన కూతుర్ని నిలదీసి ఇంటికి రమ్మని కోరామన్నారు. అయితే సమయం చూసి వస్తానని చెప్పిన యాస్మిన్ భాను చిత్తూరుకు వచ్చి ఇంటికి ఫోన్ చేసిందని, ఈ మేరకు యాస్మిన్ ను ఇంటికి తీసుకొచ్చామని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కుటుంబ పరువు తీసిన యాస్మిన్ ను తిట్టి తండ్రి బయటికి వెళ్లిపోయాక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుందని ముంతాజ్ ఫిర్యాదులో పేర్కొంది. ఇలా  కూతురు యాస్మిన్ భానుది ఆత్మహత్య అని తల్లి ఫిర్యాదు చేస్తే, యాస్మిన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సాయి తేజ తన భార్యను పధకం ప్రకారం కుటుంబసభ్యులు హత్య చేశారని  ఆరోపిస్తున్నారు. దీంతో  పోలీసుల దర్యాప్తు,  పోస్టుమార్టం రిపోర్టుకీలకంగా మారింది. కధ ఎలాంటి మరుపుతిరుతుందో పోలిసుల విచారణలో తేలాలి.

పో రై. గంగ 3 యాస్మిన్
గంగ 4 సాయి తేజ

గంగ 5 యాస్మిన్, సాయి తేజ పెళ్లి ఫోటో 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *