2, ఏప్రిల్ 2025, బుధవారం

ఎస్సీ కార్పోరేషన్ ఆర్థిక రుణాలకు 11 నుండి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్

మే 20 వరకు  ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చును 

జిల్లాలో రూ. 27.43 కోట్లతో 786 మంది ఎస్సీలు లబ్ధి

లబ్దిదారుడు 5 శాతం వాటా చెల్లించాలి 

ప్రభుత్వ రాయితీ 50 నుంచి 60 శాతం వరకు  

యూనిట్ ఏర్పాటు చేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వ సబ్సిడీ 

రెండేళ్లు  బ్యాంకు రుణం సక్రమంగా చెల్లిస్తానే సబ్సిడీ విడుదల 

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

ఎస్సీ కార్పోరేషన్ ద్వారా 2025 - 26 సంవత్సరానికి సబ్సిడీ రుణాల నిమిత్తం ఈ నెల 11 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అవుతాయి. ఆశక్తి ఉన్న ఎస్సి అభ్యర్ధులు  ఏప్రిల్ 11 నుండి మే 20 వరకు లోన్స్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చును. ఎస్సిలకు యూనిట్ల ప్రాతిపదికన ఆర్థిక చేయూత రుణాలు అందించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం  మెడికల్ షాపు, మెడికల్ ల్యాబ్, ఎలెక్ట్రిక్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్, ఎలెక్ట్రిక్ ఆటో, పాసింజర్ కార్, గూడ్స్ ట్రక్ తదితర యూనిట్ల ద్వారా అవకాశం కల్పించనున్నారు. 

చిత్తూరు జిల్లాలో  ఎస్సిల  ఆర్థికాభివృద్ధికి 27.43 కోట్ల రూపాయలతో వార్షిక  ప్రణాళికను రూపొందించారు. ఇందులో కార్పొరేషన్ సబ్సిడీగా 12.52 కోట్ల రూపాయలను అందజేస్తుంది. బ్యాంకర్లు రుణాల కింద మరో 13.53 కోట్లను సమకూర్చుతాయి. లబ్దిదారులు తమ వాటాగా 1.37 కోట్ల రూపాయలు చెల్లించాల్చి ఉంటుంది.  ఈ ప్రణాళిక కారణంగా జిల్లాలోని 786 మంది ఎస్సీలు లబ్ధి పొందనున్నారు. ఎస్సీ కార్పొరేషన్ కింద రుణాలను పొందే లబ్ధిదారులు విధిగా ఐదు శాతం లబ్ధిదారుల వాటా చెల్లించాల్సి ఉంటుంది. యూనిట్ వ్యయాన్ని బట్టి ప్రభుత్వం 50 నుంచి 60 శాతం వరకు రాయితీ ఇస్తుంది. మిగతా మొత్తాన్ని బ్యాంకు నుంచి నేరుగా పొందుతారు. రాయితీని యూనిట్ ఏర్పాటు చేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వం అందజేయనుంది. యూనిట్ ప్రారంభించి ఆరు నెలల తర్వాత నెలకోసారి జియో టాగింగ్ తప్పని సరి.ఆ తర్వాత మరో రెండు విడతల్లో థర్డ్ పార్టీ తనిఖీలు ఉంటాయి. యూనిట్ ను  ప్రారంభించిన రెండేళ్లు పాటు బ్యాంకు రుణ వాయిదాలను సక్రమంగా చెల్లిస్తానే లబ్ధిదారునికి ప్రభుత్వం నుంచి రాయితీ అందుతుంది. అప్పటివరకు ప్రభుత్వం విడుదల చేసిన రాయితీని లబ్ధిదారుడి పేరుపైన బ్యాంకులో ప్రత్యేక ఖాతాలో జమ చేస్తారు. రాయితీ రుణ పథకం కింద రవాణా రంగంలో ప్యాసింజర్ ఆటోల ఏర్పాటుకు,  ట్రక్కుల కొనుగోలుకు, వ్యవసాయ రంగంలో డ్రోన్ల కొనుగోలుకు అవకాశం ఉంది.  ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నాలుగు కేటగిరీలుగా రుణాలను అందజేయనుంది. వాణా, పశుసంవర్ధక, చిన్న తరహా వ్యాపారం, వ్యవసాయం కేటగిరీలుగా విభజించి లబ్ధిదారులకు రుణాలను అందజేస్తారు. రవాణా రంగంలో సబ్సిడీ 50 శాతం, బ్యాంకు రుణం 45 శాతం, లబ్ధిదారుని వాటా 5 శాతం ఉంటుంది. ఈ స్కీములో ప్యాసింజర్ ఆటోలు, ప్యాసింజర్ కార్లు, రవాణా ట్రక్కులకు రుణాలను 77 మందికి 7 కోట్ల రూపాయలను అందజేస్తారు. పశుసంవర్థక శాఖ రంగంలో  సబ్సిడీ 60 శాతం, బ్యాంకు లోను 35 శాతం, లబ్ధిదారుల వాటా 5 శాతం. ఈ కేటగిరీలో  లబ్ధిదారులకు గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు సరఫరా చేస్తారు. మొత్తం 280 మందికి 3.6 కోట్ల రూపాయలతో వీటిని అందజేస్తారు. చిన్న తరహా వ్యాపారం కింద తిరిగి రెండు కేటగిరీలుగా ప్రభుత్వం రుణాలను విభజించింది. మొదటి కేటగిరీలో 3 లక్షల వరకు రుణాలు అంద చేస్తారు. ఇందులో 60 శాతం సబ్సిడీ, 35 శాతం బ్యాంకు లోను, 5 శాతం లబ్ధిదారుని వాటా ఉంటుంది. ఇందులో లక్ష రూపాయలు వరకు సబ్సిడీ ఉంటుంది. రెండవ కేటగిరీ కింద మూడు లక్షలు, ఆపై పడిన వ్యాపారాలకు రుణాలను అందజేస్తారు. ఈ కేటగిరీలో హోటళ్లు, శారీ పాలిషింగ్, బ్యూటీ పార్లర్, ఫోటో స్టూడియో, కూరగాయల షాపు, సెల్ ఫోన్ రిపేర్, కిరాణా షాపులు, మినీ డైరీ, ఈవెంట్ మేనేజ్మెంట్, లెదర్ జువెలరీ, ఐస్ క్రీమ్ పార్లర్, మెటల్ బ్రాస్ యూనిట్, జెనెటిక్ మెడికల్ షాప్స్, మొబైల్ ఫుడ్ స్టాల్స్, లెదర్ బెల్ట్ మేకింగ్ యూనిట్స్,  గన్నీ బ్యాగుల తయారీ, టెక్స్టైల్ యూనిట్స్ వస్తాయి. ఈ కేటగిరీ కింద 327 మందికి 11 కోట్ల రూపాయలను రుణాలుగా అందచేస్తారు. వ్యవసాయం కేటగిరీ కింద బహుళ పంట నూర్పిడి యంత్రాలు, పవర్ ట్రీల్లర్లు, కలుపు మొక్కలు తీసే యంత్రాలు, ట్రాక్టర్ టైలర్స్, మినీ రైస్ మిల్, మినీ దాల్ మిల్, ట్రాక్టర్, రోటావేటర్  అన్న్దచేస్తారు. ఈ కేటగిరిలో 102 మందికి 5.78 కోట్ల రూపాయలను అందజేస్తారు. దరఖాస్తుదారులు కుల ధ్రువీకరణ పత్రం, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంకుపాసు బుక్ తో పాటు ఫోన్ నెంబరును  జత చేయాల్సి ఉంటుంది.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *